పల్టీలు కొడుతూ యాక్సిడెంట్‌‌.. చివర్లో ట్విస్ట్‌ | Passengers Escaped form Fatal Accident in Morbi | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 5 2018 5:24 PM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

Passengers Escaped form Fatal Accident in Morbi - Sakshi

అహ్మదాబాద్‌ : ఇలాంటి యాక్సిడెంట్‌ వీడియో ఇంతకు ముందు బహుశా మీరు చూసి ఉండకపోవచ్చు. వేగంగా దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టి పడిపోయింది. ఆ ప్రమాదం జరిగిన తీరు చూస్తే అందులో ఉన్నవాళ్లు సురక్షితంగా బయటపడే ఛాన్సే లేదనుకుంటాం. కానీ, గుజరాత్‌ లో జరిగిన ఓ యాక్సిడెంట్‌ తాలూకు వీడియో ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఓ డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఆ ప్రమాదం చూసిన వారేవరైనా కనీసం లోపల ఉన్నవాళ్లు గాయాలపాలై ఉంటారని అనుకుంటారు. కానీ, అందులో ఉన్న ప్రయాణికులిద్దరూ చిన్న గీత కూడా పడకుండా దర్జాగా బయటకు రావటం వీడియోలో చూడొచ్చు. మోర్బి పట్టణంలోని ఆదివారం మధ్యాహ్నం ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement