బెంగళూరులో బీజేపీ కార్యకర్త దారుణ హత్య
బెంగళూరు : కర్ణాటకలో బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన సూర్యా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బీజేపీ మున్సిపాలిటీ సభ్యుడు శ్రీనివాస్ ప్రసాద్ అలియాస్ కతిగనహళ్లి వాసుపై మంగళవారం ఉదయం దుండగులు దాడి చేసి హత్య చేశారు.
బొమ్మసముద్ర మున్సిపాలిటీ సభ్యుడైన వాసు ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్కు కారులో వెళుతుండగా అటాక్ జరిగింది. కారులో వచ్చిన దుండగుల అతడి వాహనాన్ని అడ్డుకుని, అనంతరం వాసును కారులోనుంచి బయటకు లాగి, కత్తులతో పొడిచి హతమార్చారు. కాగా దాడికి గల కారణాలు తెలియరాలేదు. మృతుడు వాసు భార్య జిల్లా పంచాయితీ సభ్యురాలు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. అయితే భూ వివాదాల వల్లే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.