Unidentified goons
-
టోల్ ప్లాజా వద్ద రెచ్చిపోయారు..
-
టోల్ ప్లాజా వద్ద రెచ్చిపోయారు..
నోయిడా: ఉత్తరప్రదేశ్ నోయిడాలో దుండగులు రెచ్చిపోయారు. ఓ టోల్ ప్లాజాపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. టోల్ గేట్ ట్యాక్స్ చెల్లించమని అడిగినందుకుకొందరు యువకులు టోల్ ప్లాజాలోకి దూసుకొచ్చి అక్కడి కార్యాలయంపై దాడి చేశారు. టోల్ ప్లాజా కార్యాలయ ఉద్యోగులపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఇదంతా అక్కడి నిఘా కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వేట ముమ్మరం చేశారు.