Union Minister Jayant Sinha
-
ఏపీకి ప్రత్యేక సాయం కింద రూ. 700 కోట్లు ఇచ్చాం
లోక్‌సభలో కేంద్రమంత్రి జయంత్ సిన్హా వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సాయం కింద రూ.700 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ఈ మొత్తంలో రాష్ట్ర రాజధానికి రూ.350 కోట్లు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని 7 వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయించామని తెలిపారు. కాగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచబడిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఒకసారి సాయం కింద రూ.2000 కోట్లను ఈ ఏడాది కేంద్రబడ్జెట్లో కేటాయించినట్టు ఆయన చెప్పారు. లోక్‌సభలో శుక్రవారం ఏఐఏడీఏంకే సభ్యుడు ఎం.చంద్రకాశి అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక జవాబిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికున్న మార్గదర్శకాలేమిటీ? ఇకముందు ‘హోదా’ ఇవ్వకుండా రద్దు చేసే ప్రతిపాదనుందా? అని చంద్రకాశి అడగ్గా.. మంత్రి సూటిగా బదులివ్వలేదు. ఏపీకి పన్ను రాయితీ ప్రతిపాదనేదీ లేదు: హిమాచల్‌ప్రదేశ్ తరహాలో ఏపీకి పన్ను రాయితీపై ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. ఏపీకి పన్ను రాయితీపై లోక్‌సభలో ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, నాని, బీబీ పాటిల్, అసదుద్దీన్ ఒవైసీలు అడిగిన ప్రశ్నకు శుక్రవారం మంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. -
భారీ వృద్ధి బాటన భారత్
కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ♦ పెట్టుబడుల వృద్ధి, ద్రవ్యోల్బణం ♦ కట్టడి ధ్యేయమని వివరణ న్యూఢిల్లీ : భారత్ ఆర్థిక రంగం భారీ వృద్ధి దిశలో ఉందని ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా శుక్రవారం పేర్కొన్నారు. పెట్టుబడులను భారీగా ఆకర్షించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కేంద్రం ప్రధాన లక్ష్యమని వివరించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూ, సాధించే అభివృద్ధి పటిష్టంగా ఉంటుందని, తద్వారా ‘వృద్ధి బుడగ పేలడం’ తరహా పరిస్థితి ఉత్పన్నం కాదని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ విజిలెన్స్ అధికారుల 6వ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘నిర్ణయాత్మక నాయకత్వం కేంద్రంలో ఉంది. వృద్ధికి సంబంధించి విధాన పరమైన కార్యాచరణను మేము రూపొం దించాం. మేము చాలా విశ్వసనీయతతో ముందుకు వెళుతున్నామన్న అంశం దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు చాలా స్పష్టంగా అర్థమైంది. భారత్ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ బాటలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది’’ అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తగిన మద్దతు అందించడానికి కేంద్రం కట్టుబడి ఉన్నదని సిన్హా అన్నారు. మొండిబకాయిల కేసుల్లో కఠిన చర్యలుండాలి: సిన్హా బ్యాంకింగ్ వ్యవస్థలో దాదాపు రూ. 2.22 లక్షల కోట్ల మేర మొండిబకాయిలు (ఎన్డీఏ) పేరుకు పోవడానికి దారి తీసిన బ్యాంకింగ్ మోసాల్లాంటి వాటికి చెక్ పెట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హా చెప్పారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో మోసాలను ముందస్తుగా గుర్తిం చేందుకుపై అన్ని స్థాయిల్లో సిబ్బంది ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించేలా చూడాల్సి ఉందని సదస్సులో తెలిపారు. ఎన్పీఏలుగా మారే రుణాల ముప్పు గురించి ముందస్తుగానే అప్రమత్తయ్యేందుకు రెడ్ ఫ్లాగ్ అకౌంట్స్ విధానాన్ని ఆర్బీఐ ప్రవేశపెట్టిందని అనిల్ సిన్హా పేర్కొన్నారు.