జాతీయ అవార్డును స్వీకరించిన రాములు
పోచమ్మమైదాన్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఆదివారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర జౌళి శాఖ మం త్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా జిల్లావాసి పిట్ట రాములు జాతీయ ఉత్తమ చేనేత అవార్డును అందుకున్నారు. దీంతోపాటు ఆయనకు నగదు పారితోషికాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.