12 భాషలతో మైక్రోమ్యాక్స్ ఫోన్లు
దేశీయ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ మైక్రోమ్యాక్స్, యునైట్ సిరీస్ లో తన స్మార్ట్ ఫోన్లను విస్తరిస్తోంది. తాజాగా యునైట్ 4, యునైట్ 4 ప్రో స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. యునైట్ 4 ధర రూ.6,999గా, యునైట్ 4 ప్రో ధర రూ.7,499గా కంపెనీ వెల్లడించింది. యునైట్ 4 స్మార్ట్ ఫోన్లు ఆఫ్ లైన్ రిటైల్ లభ్యమవుతాయని తెలుపగా.. యునైట్ 4 ప్రోను ప్రత్యేకంగా స్నాప్ డీల్ లో మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది. ఎవరైతే తమ ప్రాంతీయ భాషలో మొదటిసారి స్మార్ట్ ఫోన్ ను వాడాలనుకుంటున్నారో వారిని టార్గెట్ గా చేసుకుని ఈ ఫోన్లను ప్రవేశపెట్టినట్టు కంపెనీ వెల్లడించింది. 12 ప్రాంతీయ భాషల సపోర్టుతో వచ్చిన ఇండస్ ఓఎస్ 2.0 మొదటి డివైజ్ లు ఇవేనని కంపెనీ ప్రకటించింది. యాప్ బజార్(ఇండస్ ప్రాంతీయ భాషల యాప్ మార్కెట్ ప్లేస్), ఇండస్ టూ ఇండస్ ఉచిత ఎస్ఎమ్ఎస్ సర్వీసులు, ఇండస్ స్వైప్ ఫీచర్లు ఈ ఓఎస్ ద్వారా సపోర్టు చేయనున్నాయి. ఆరు ప్రాంతీయ భాషల్లో టెస్ట్ నుంచి స్పీచ్ టెక్నాలజీని ఈ ఓఎస్ సపోర్టు చేస్తుంది. ఇండస్ ఓఎస్ భాగస్వామ్యంతో భాష అడ్డంకులను తొలగించి, బెస్ట్ స్థానిక స్మార్ట్ ఫోన్ అనుభవాన్ని యూజర్లకు కల్పిస్తున్నామని మైక్రోమ్యాక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుభజిత్ సేన్ తెలిపారు. ఈ రెండు డివైజ్ లను ఫింగర్ ప్రింట్ స్కానర్ తో కంపెనీ ఆవిష్కరించింది.
యునైట్ 4 ఫీచర్లు...
5.00 అంగుళాల డిస్ ప్లే
1జీహెచ్ జడ్ ప్రాసెసర్
720x1280 పిక్సెల్స్ రెసుల్యూషన్
1 జీబీ ర్యామ్
8 జీబీ స్టోరేజ్
8 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
5 మెగా పిక్పెల్ ముందు కెమెరా
2500 ఎంఏహెచ్
యునైట్ 4 ప్రో ఫీచర్లు...
5.00 అంగుళాల డిస్ ప్లే
1.3 జీహెచ్ జడ్ ప్రాసెసర్
720x1280 పిక్సెల్స్ రెసుల్యూషన్
2 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్
8 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
5 మెగా పిక్సెల్ ముందు కెమెరా
3900 ఎంఏహెచ్