United Christmas celebrations
-
క్రిస్మస్ జోష్
-
క్రైస్తవులకు భవనం: కేసీఆర్
* హజ్ కమిటీ తరహాలో క్రిస్టియన్ యూనిటీ బోర్డు హైదరాబాద్: క్రైస్తవులకు హైదరాబాద్‌లో ప్రత్యేక భవనం ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం జీవో విడుదల చేస్తానన్నారు. ‘‘భవన్‌కు ఈ నెలలోనే శంకుస్థాపన చేస్తాం. వచ్చే ఏడాది క్రిస్మస్ వేడుకలు క్రైస్తవ భవన్‌లోనే జరుపుకోవాలి. ఈ భవన్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తాం’’ అని చెప్పారు. గురువారం రాత్రి నాంపల్లిలోని తెలుగు లలిత కళాతోరణం ప్రాంగణంలో యునెటైడ్ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్రైస్తవులకు ఎలాంటి లోటూ ఉండదని, దళితులతో సమానంగా వారికి హోదా కల్పిస్తామని తెలిపారు. ముస్లింలకు హజ్ కమిటీ తరహాలో క్రిస్టియన్స్ యూనిటీ బోర్డు కూడా ఏర్పాటుచేస్తామన్నారు. కలెక్టర్ల అనుమతి అవసరం లేకుండా చర్చిలు నిర్మించుకునేందుకు కూడా శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తామని వివరించారు. ‘‘హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లతో సమావేశమై శ్మశానవాటికల సమస్యను పరిష్కరిస్తా. అలాగే పాస్టర్లు వివాహాలు జరపడానికి కావాల్సిన లెసైన్సుల జారీలో ఆలస్యం జరగకుండా చూస్తా’’ అని హామీలిచ్చారు. వారి మిగతా సమస్యలన్నింటిని పరిష్కరిస్తానన్నారు. తెలంగాణలో క్రిస్మస్కు ఇకపై రెండు రోజులు సెలవులివ్వనున్నట్టు గుర్తు చేశారు. ‘‘17 ఏళ్లుగా క్రిస్మస్‌నాడు చాపెల్ రోడ్డులోని చర్చికి వెళ్తున్నా. ఏటా అక్కడ దైవాశీస్సులు అందుకుంటుంటా. ఈ ఏడాది కూడా అక్కడికే వెళ్తా’’ అని అన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, యునెటైడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చైర్మన్ రేమండ్ పీటర్, నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్వీ స్టీవెన్సన్, బిషప్‌లు సుమబాల తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఐక్య క్రిస్మస్
=కుంభా రవిబాబు ఆధ్వర్యంలో గద్యగుడలో నిర్వహణ =పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ చొక్కాకుల అరకులోయ, న్యూస్‌లైన్: మతం కన్నా మానవత్వం గొప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కుంభా రవిబాబు చెప్పారు. మానవత్వాన్ని ప్రబోధించిన క్రైస్తవ మతానికి అందుకే విశేష ఆదరణ లభించిందని తెలిపారు. మండలంలోని గద్యగుడ గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. క్రైస్తవం మానవాళికి మంచి జీవన విధానాన్ని బోధించే మార్గమని తెలిపారు. మన్యంలో క్రైస్తవ మతం అభివృద్ధి చెందడం వల్ల చెడు వ్యసనాల నుంచి అనేక మంది బయట పడి తమ జీవితాలను చక్కదిద్దు కున్నారని ఆయన తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన్యవాసులకు దైవ సందేశాన్ని వినిపిస్తున్న మత బోధకులకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం కేక్ కట్ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ రూరల్ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావుకు, దైవ సేవకులకు తినిపించారు. సభలో చొక్కాకుల ప్రసంగిస్తూ క్రైస్తవులంతా ఒకే వేదికపైకి వచ్చి క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయమని తెలిపారు. ఏటా రవిబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐక్య క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఆనందాయకమని చెప్పారు. పాస్టర్స్ ఫొలోషిఫ్ అధ్యక్షుడు జాన్ ప్రకాష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విశాఖకు చెందిన మత బోధకుడు ప్రసంగికుడు స్టీవెన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన, రెవరెండ్ సంజీవ్ కుమార్, కొర్రా శెట్టి బాబురావు దైవ సందేశాన్ని అందించారు. ఎస్.కోట వైఎస్సార్ కాంగ్రెస్ నేత రాంనాయుడు, డాక్టర్ అజయ్, ఏయూ ప్రొఫెసర్లు అప్పారావు, అరుణ్ కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బి.బి జగ్గన్న, పాంగి చిన్నారావు, పల్టాసింగ్ విజయ్ కుమార్, పొద్దు అమ్మన్న, కొండలరావు, సొన్నాయి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్ మండలాల నుంచి పాస్టర్లు, క్రైస్తవులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.