United Kingdom to India
-
కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: యూకే ఎన్నారైలు
లండన్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని యూకే ఎన్నారైలు ఆకాంక్షించారు. నూతన జాతీయ పార్టీ స్థాపించాలన్న ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద సమావేశమైన ఎన్నారైలు కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. యూకేలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు సైతం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని, భారత దేశానికి నాయకత్వం వహించి దేశ గతిని మార్చాలని కోరారు. ప్రస్తుతం దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తుందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధి దేశమంతా జరగాలంటే ఆయన వల్లే సాధ్యమని ఎన్నారైలు తెలిపారు. "దేశ్ కి నేత కేసీఆర్" అంటూ భారీ కేసీఆర్ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలంతో పాటు ఎన్నారైలు పాల్గొన్నారు. -
ట్రస్ కేబినెట్ ...హోంమంత్రిగా భారత్ సంతతికి చెందిన వ్యక్తి
-
ఎన్ఆర్ఐ మహిళ సాహస యాత్ర
వడోదర: మహిళలను రక్షించండి, విద్యావంతుల్ని చేయండి అని ప్రచారం చేస్తూ గుజరాత్‌కు చెందిన ఎన్ఆర్ఐ మహిళ భారులత కాంబ్లే (43) కారు యాత్ర చేపట్టారు. ఇంగ్లండ్ నుంచి 32 వేల కిలోమీటర్ల దూరం కారు నడుపుతూ స్వదేశానికి వచ్చారు. ఆమె 57 రోజుల పాటు 32 దేశాలు దాటి వచ్చారు. భారులత సొంతూరు గుజరాత్‌లోని నవ్సారి. ఆదివారం నవ్సారిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఆమెను సన్మానించారు. అంతకుముందు బరోడాలో కూడా ఆమెకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారులత మాట్లాడుతూ.. సొంతూరులో ఆస్పత్రి నిర్మించనున్నట్టు చెప్పారు. తగిన వైద్య సదుపాయాలు లేక తన తాత మరణించడం చూశానని గుర్తు చేసుకున్నారు. 32 దేశాల ప్రజలతో మాట్లాడానని, నవ్సారిలో అన్ని వసతులతో ఆస్పత్రి నిర్మాణం కోసం నిధులు సేకరించానని తెలిపారు. 57 రోజుల్లో అత్యధిక దేశాలను సందర్శించిన తొలి మహిళ తానేనని చెప్పారు. రెండు ఖండాలు, మూడు పెద్ద ఎడారులు, పర్వతాలు దాటి వచ్చారు. ఈ కారు యాత్ర గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డుల్లో నమోదైంది.