breaking news
Universal
-
సింగపూర్‌లో కూడా ఉంది యూనివర్సల్ స్టూడియోస్...
అమెరికాలో యూనివర్సల్ స్టూడియోస్ (Universal Studios) అందరూ చూస్తారు. అయితే సింగపూర్‌లో ఉన్న యూనివర్సల్ స్టూడియో ఇంకా ఇంటెరెస్టింగ్‌గా ఉంటుంది. ఇది సింగపూర్‌లోని సెంటోసా వద్ద ఉన్న థీమ్ పార్క్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్కులలో ఇదీ ఒకటి. ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడి వచ్చి వెళ్తుంటారు. 2007 ఏప్రిల్ 19న ఈ థీమ్ పార్క్ నిర్మాణం ప్రారంభించి 2011లో పూర్తి చేశారు. మొత్తం 62 ఎకరాల్లో విస్తరించి ఉన్న ‘యూనివర్సల్ స్టూడియోస్’ ఆసియా ఖండంలో విశిష్టమైనది. మొదటి సంవత్సరంలోనే ఈ పార్క్‌కు సమారు 30 లక్షలమంది సందర్శించారు. అప్పటి నుండి ఏటా సుమారు 40 లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ పార్క్‌లో సందర్శకుల్ని ఆకర్షించేందుకు 17 రకాల జోన్స్ ఏర్పాటు చేశారు. అందులో ‘హాలీవుడ్’, ‘న్యూయార్క్’, ‘స్కైఫై సిటీ’, ‘పురాతన ఈజిప్టు’, ‘జురాసిక్ పార్క్’.. ఇలా రకరకాల జోన్స్ ఉన్నాయి. వాటిలోకి వెళ్తే నిజంగానే అక్కడే ఉన్న అనుభూతి కలుగుతుంది. ఆయా జోన్స్‌లోకి వెళ్లిన వారికోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో కొన్ని సీజనల్ కాగా, మరికొన్ని రోజూ ఉంటాయి. ఈ కారణంగా ప్రపంచంలో అనేక దేశాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. వాటిని కూడా చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు.ఇదీ చదవండి: Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు? -
బీఎస్ఎన్ఎల్ యూనివర్సల్ సిమ్: ఎక్కడైనా.. ఎప్పుడైనా
జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచిన తరువాత బీఎస్ఎన్ఎల్ ఊపందుకుంది. ఇప్పటికే లక్షలమంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి చేరారు. తమ యూజర్లకు అత్యుత్తమ సర్వీస్ అందించడానికి.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో 4G, 5G రెడీ సిమ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి రీవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్స్ విభాగం ఇటీవల వెల్లడించింది.ఈ విషయాన్ని డాట్ ఇండియా తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. 4G, 5G సర్వీస్ అనేది భౌగోళిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఇందులో పేర్కొన్నారు.భారతదేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కంపాటబుల్ ఓవర్ ది ఎయిర్ (OTA), యూనివర్సల్ సిమ్ (U SIM) ప్లాట్‌ఫారమ్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. దీని ద్వారా యూజర్లు తమ మొబైల్ నెంబర్లను ఎంచుకోవచ్చు. దీనికి ఎలాంటి భౌగోళిక పరిమితులు లేవు.గత సంవత్సరం.. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం మొత్తం రూ. 89,047 కోట్లతో బీఎస్ఎన్ఎల్ కోసం మూడవ పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ వ్యూహంలో భాగంగా ఈ ప్యాకేజ్ ప్రకటించడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఇందులో 4G/5G స్పెక్ట్రమ్ కేటాయింపులు కూడా ఉన్నాయి.BSNL ready. Bharat ready.#ComingSoon pic.twitter.com/BpWz0gW4by— DoT India (@DoT_India) August 10, 2024 -
హుషారుగా బ్రదర్ హుడ్ డే...
నగరానికి చెందిన ఫ్రీమేసన్స్ సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సల్ బ్రదర్ హుడ్ డే ఆదివారం సందడిగా జరిగింది. ఇందులో భాగంగా మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా వాక్‌థాన్‌ను నిర్వహించారు. హానికారక డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని విన్నవిస్తూ నిర్వహించిన ఈ వాక్‌థాన్ అబిడ్స్ నుంచి మొజంజాహీ మార్కెట్ వరకూ కొనసాగింది. ఫ్రీమేసన్స్కు చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
క్రికెట్‌ను జాగ్రత్తగా విస్తరిస్తాం: రిచర్డ్సన్
సిడ్నీ: క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలనే ఆలోచన ఉన్నా మరీ బలహీన స్థితిలో ఈ ఆటను చూడలేమని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ స్పష్టం చేశారు. వచ్చే ప్రపంచకప్‌లో కేవలం 10 జట్లతోనే టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత టోర్నీ 14 జట్లతో జరుగుతోంది. అయితే ఈ ఆలోచనను అసోసియేట్ సభ్య దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే జరిగితే తమ దేశాల్లో క్రికెట్ అంతరించిపోతుందని ఆ జట్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ‘ఇప్పుడు మేం ఓ నిర్ణయానికి వచ్చాం. క్రికెట్‌ను మరింత పటిష్టపర్చుకోవాలనుకుంటున్నామే తప్ప క్రేజ్ తగ్గించాలనుకోవడం లేదు. మాకు శాశ్వత సభ్య దేశాలున్నాయి. మేం ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంది’ అని రిచర్డ్సన్ అన్నారు. అమెరికాలో క్రికెట్‌ను అభివృద్ధి చేసే ఆలోచన ఉందని చెప్పారు. యూఏఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించినప్పుడు అమెరికా ఎందుకు సాధించకూడదని ఆయన ప్రశ్నించారు. -
అంతరిక్ష పరిశోధనలకు.. ఆస్ట్రానమీ
అప్‌కమింగ్ కెరీర్: విశ్వం ఎలా ఏర్పడింది? దీనికి ఆది, అంతం ఎక్కడ? గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా ఉద్భవించాయి? రాత్రిపూట మిణుకుమిణుకుమనే నక్షత్రాలు, పాలపుంతలు, తోక చుక్కల మర్మమేంటి? మరో గ్రహంపై మానవ నివాసం సాధ్యం కావాలంటే ఏం చేయాలి?... తదితర విషయాలపై ఎవరికైనా ఆసక్తి ఉండడం సహజం. అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోతున్న అనంతమైన విశ్వ రహస్యాలను తెలుసుకోవాలని మనిషి అనాదిగా కృషి చేస్తూనే ఉన్నాడు. కొంతవరకు సఫలీకృతుడయ్యాడు. అంతరిక్షంపై నిరంతరం పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలు ఈ పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ అధికంగా నిధులను ఖర్చు చేస్తున్నాయి. కాబట్టి ఆస్ట్రానమీని కెరీర్‌గా మలచుకుంటే.. బంగారు భవిష్యత్తు సొంతమవడం ఖాయం. ఆస్ట్రానమీలో రెండు విభాగాలుంటాయి. అవి.. థియారెటికల్ ఆస్ట్రానమీ, అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ. అభ్యర్థులు తమకు ఆసక్తి కలిగిన రంగాన్ని ఎంచుకోవచ్చు. ఆస్ట్రానమర్లకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో తగిన పరిజ్ఞానం సంపాదిస్తే.. అబ్జర్వేటరీల్లో పరిశోధకులుగా, యూనివర్సిటీలు/కాలేజీల్లో ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో), స్పేస్ ఫిజిక్స్ ల్యాబోరేటరీస్ వంటి అత్యున్నత సంస్థల్లో అంతరిక్ష శాస్త్రవేత్తలుగా మంచి అవకాశాలున్నాయి. ఆస్ట్రానమర్‌గా గుర్తింపు సాధించాలంటే.. ఫిజిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్‌లో అడ్వాన్స్డ్ నాలెడ్జ్‌ను సొంతం చేసుకోవాలి. డేటా అనాలిసిస్‌పై గట్టి పట్టు ఉండాలి. నూతన శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలి. వేతనాలు: పరిశోధనా కేంద్రాల్లో రీసెర్చ్ వర్క్, కాలేజీ/యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే ఆస్ట్రానమర్లకు ప్రారంభంలో నెలకు రూ.50 వేల దాకా వేతనం లభిస్తుంది. తర్వాత ఎక్స్‌పీరియెన్స్, సీనియారిటీని బట్టి వేతనం పెరుగుతుంది. అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్, బీఎస్సీ పూర్తిచేసిన తర్వాత ఫిజిక్స్/ఆస్ట్రానమీ/ఆస్ట్రోఫిజిక్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ చదవాలి. అనంతరం పీహెచ్డీ కూడా పూర్తిచేస్తే పరిశోధనా రంగంలో స్థిరపడొచ్చు. వర్సిటీలు/కాలేజీల్లో ఫ్యాకల్టీగా పనిచేయొచ్చు. అస్ట్రానమీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.osmania.ac.in/ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్-పుణె వెబ్సైట్: http://www.iucaa.ernet.in/ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్-బెంగళూరు వెబ్సైట్: http://www.iiap.res.in/ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్-బెంగళూరు వెబ్సైట్: http://www.rri.res.in/ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్సైట్: http://www.du.ac.in/ యూనివర్సిటీ ఆఫ్ ముంబై వెబ్సైట్: http://www.mu.ac.in/ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ-త్రివేండ్రం వెబ్సైట్: http://www.iist.ac.in/ పరిశోధనలకు సరైన ఎంపిక ‘‘విశ్వ రహస్యాల ఛేదనలో ఖగోళ శాస్త్రవేత్తలది కీలకపాత్ర. ఆస్ట్రానమీ అనగానే పాత సబ్జెక్టు అనే భావన రాదు. అది ఎప్పటికీ నిత్యనూతనం. అంతరిక్షంలో మానవాళి నివాసానికి అనువుగా ఉండే గ్రహాల అన్వేషణ. నక్షత్రాలు, గ్రహాల గమనం వంటి అంశాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో గమనిస్తూనే ఉన్నారు. దీనికి తగినట్లుగానే ప్రభుత్వాలు పరిశోధనలను ప్రోత్సహిస్తున్నాయి. అస్ట్రో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి భిన్నమైన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి పలు యూనివర్సిటీల్లో ఫెలోషిప్‌లు అందజేసేందుకు యూజీసీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలకు కొదవలేదు. అయితే పరిశోధనలతో కొత్త అంశాలను వెలికితీయాలనే ఉత్సుకత ఉన్న యువతకు ఆర్అండ్డీ విభాగంలో అవకాశాలు అపారం. బోధన రంగంలో స్థిరపడే వీలుంది. కేవలం మనదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆస్ట్రానమీతో అవకాశాలు పుష్కలం’’ - డాక్టర్ ఎస్.ఎన్.హసన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ హెడ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం