University of America
-
కరోనా ఉన్నా మనోళ్ల చాయిస్ అమెరికానే
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ భారతీయ విద్యార్థుల్లో ఉన్నత చదువులకు అమెరికా వెళ్లే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 2020–21 విద్యాసంవత్సరంలో 9.14 లక్షల మంది విదేశీ విద్యార్థులు అమెరికాలో అడ్మిషన్ తీసుకున్నారు. ఇందులో అత్యధికంగా 34.7%తో చైనా విద్యార్థులు 3,17,299 మంది ఉండగా, ఆ తర్వాత స్థానంలో 18.3 శాతం(1,67,582 మంది) భారతీయ విద్యార్థులు అక్కడి విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. కరోనా ప్రభావం అడ్మిషన్లపై స్పష్టంగా కనిపించింది. 2019–20 విద్యాసంవత్సరంతో పోలిస్తే విదేశీ విద్యార్థుల అడ్మిషన్లలో 15% తగ్గుదల నమోదైంది. అందులో మనదేశ విద్యార్థులకు సంబంధించి 13.2% తగ్గుదల ఉందని ఓపెన్ డోర్స్ రిపోర్ట్ వెల్లడించింది. నవంబర్ 15న అంతర్జాతీయ విద్యా వారోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలోని యూఎస్ఏ మిషన్ ఇండియా సంస్థ ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200కి పైగా ప్రాంతాలకు చెందిన 9,14,095 మంది విద్యార్థులతో అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికా ఒక అగ్ర గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. న్యూయార్క్ యూనివర్సిటీలో అత్యధికంగా 17,050 మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. అదే సమయంలో 20.9%తో 1,90,590 మంది విదేశీ విద్యార్థులు ఇంజనీరింగ్, 19.9%తో 1,82,106 మంది కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. కాగా 2019–20లో 1.62 లక్షల మంది అమెరికన్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చదువుతున్నారని, అందులో మన దేశంలో 1,736 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, ఈ ఏడాది వేసవిలోనే 62,000కు పైగా భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు జారీ చేశామని యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ తెలిపింది. ఇది గతేడాదికంటే ఎక్కువ అని, విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు యునైటెడ్ స్టేట్స్ ఎంపిక గమ్యస్థానంగా ఉందని ఈ గణాంకాలు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. -
అంతా మీరే చేస్తున్నారు!
ఒకప్పుడు ఒబేసిటీ బాధితులు చాలా తక్కువ. మరి ఇప్పుడు.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి 100 మందిలో 30 మంది దీనిబారిన పడుతున్నారు. బాధితుల సంఖ్య ఇంతగా పెరగడానికి కారణమేంటి? ఇదేమైనా అంటువ్యాధా? ..ఎస్, అవుననే అంటున్నాయి పరిశోధనలు. అనారోగ్య సమస్య నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందకపోయినా.. అందుకు కారణమయ్యే అలవాట్లు మాత్రం ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నాయట. ఉదయాన్నే లేవడం, ఇంటి పని చకచకా చేసుకోవడం, ఇంట్లో తయారుచేసే టిఫిన్ తినేసి పనులకెళ్లడం, సాయంత్రం వచ్చాక కుటుంబసభ్యులతో కలసి సరదాగా గడపడం, పొద్దుగూకిన మరుక్షణమే పడుకోవడం.. ఇవన్నీ కనుమరుగై చాలారోజులే అయ్యింది. కాలచక్రం కాస్త.. కాదు కాదు.. బాగానే ముందుకు కదిలింది. రాత్రి ఒంటిగంట దాటిన తర్వాతే నిద్ర. పొద్దున 10 దాటిన తర్వాతే పక్కదిగడం. ఇక ఫోన్లో ఆర్డరిచ్చి, కార్లో తినేయడం, కదలకుండా గంటల తరబడి కుర్చీలో కూర్చొని పనిచేయడం, ఇంటికొచ్చాక సోఫాలో సాగిలబడి టీవీకి అతుక్కుపోవడం, వంటి అలవాట్లే మన కొంప ముంచుతున్నాయి. అలాగే రాబోయే తరాల ఆరోగ్యాన్నీ మనమే పాడుచేసేలా చేస్తున్నాయి. కారణం చిన్నపిల్లలు మనల్ని చూసి ఇలాంటి అలవాట్లు అనుకరిస్తుండడమే. అంటు వ్యాధిలా అలవాట్లు..: తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఎన్నో నేర్చుకుంటారు. వారి ఆహార్యాన్ని అనుకరించడమేకాదు.. అలవాట్లనూ పాటిస్తారు. పేరెంట్స్ ఒబెసిటీ మార్గంలో నడిస్తే.. పిల్లలూ అదేబాట అనుసరించి రేపటి ఒబెసిటీ పేషెంట్లవుతారు. అమెరికాలోని బఫెలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దాదాపు 286 కాలేజీల విద్యార్థుల అలవాట్లను పరిశీలించి, కారణాలను విశ్లేషించి చెప్పిన సంగతిది. ఇలా అలవాట్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడం వల్లే యువతరం ఒబేసిటీ బారిన పడుతున్నారని తేల్చారు. -
అమెరికా వర్సిటీలో భారతీయుల కోసం నిధి
వాషింగ్టన్: అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో చదివే భారత సంతతి విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటునందించేందుకుగాను ఓ ఇండియన్ అమెరికన్ వైద్యుల సంఘం విద్యానిధిని ఏర్పాటు చేసింది. ఈ నిధికి 30 వేల డాలర్ల(రూ.18.72 లక్షలు)ను ఆ సంఘం విరాళంగా ప్రకటించింది. యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సెంట్రల్ ఫ్లోరిడా అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ అధ్యక్షుడు ఉదయ్ ఎ.దేశాయ్ వర్సిటీ డీన్కు ఈ మేరకు చెక్కును అందజేశారు. ఈ నిధి నుంచి భారత సంతతి విద్యార్థులకు ‘సీఏపీఐ ఎండీ ఎన్డోవ్డ్ స్కాలర్షిప్’ను అందజేస్తారు. కాగా ఫ్లోరిడాలో వైద్యుల సమస్యల పరిష్కారానికి సీఏపీఐ బాగా కృషి చేస్తోందని, ఆ సంస్థ కార్యకలాపాలకు తమ తోడ్పాటును కూడా అందిస్తామని ఫ్లోరిడా మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది.