University of Exeter
-
అంటార్కిటికా హరితమయం!
న్యూఢిల్లీ: మంచుతో కప్పి ఉండే అంటార్కిటికా ద్వీపకల్పం క్రమంగా హరితమయం అవుతోంది. ఇక్కడ పచ్చదనం పెరుగుతోంది. పచి్చక పరిధి విస్తృతమవుతోంది. గత మూడు దశాబ్దాల కాలంతో పోలిస్తే ఈ పరిణామం ఇటీవల 30 శాతానికిపైగా వేగం పుంజుకున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అంటార్కిటికా పరిణామాలపై యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సిటర్ సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఇందుకోసం శాటిలైట్ డేటాను ఉపయోగించారు. అంటార్కిటికాలో 1986లో చదరపు కిలోమీటర్ కంటే తక్కువ వైశాల్యంలో పచ్చదనం ఉండగా, 2021 నాటికి అది 12 చదరపు కిలోమీటర్లకు చేరుకున్నట్లు తేల్చారు. ఇక్కడ పచ్చదనం పెరిగిపోతుండానికి కారణంగా భూతాపం, వాతావరణ మార్పులేనని చెబుతున్నారు. ఒకవైపు మంచు పరిమాణం తగ్గిపోతుండగా, అదే సమయంలో పచ్చదనం పెరుగుతోంది. ఈ రెండింటికీ సంబంధం ఉందని అంటున్నారు. ఆధునిక కాలంలో ప్రపంచ సగటుతో పోలిస్తే అంటార్కిటికా ద్వీపకల్పం వేగంగా వేడెక్కుతోంది. ఇక్కడ వడగాల్పులు సర్వసాధారణంగా మారిపోయాయి. మంచి కరిగిపోయి, ఆ ప్రాంతంలో పచి్చక కనిపిస్తోంది. ఇది కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పచి్చక అని సైంటిస్టులు చెప్పారు. వాతావరణ మార్పులను అడ్డుకోకపోతే అంటార్కిటికాలో మంచు పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడపై ప్రతికూల ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు. -
శునకాలు అంత తెలివైనవేమీ కావు!
లండన్: ‘శునకాలు చాలా తెలివైనవి. మిగతా జంతువులతో పోలిస్తే అవి అత్యంత ప్రతిభను కనబరుస్తాయి’. సాధారణంగా శునకాల విషయంలో ఎక్కువ మంది భావన ఇది. అయితే మనం అనుకుంటున్నట్లు శునకాలు అంత తెలివైనవేమీ కావని తాజా అధ్యయనంలో తేలింది. యూకేకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎక్ట్సర్, క్రైస్ట్ చర్చ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పరిశోధనల్లో భాగంగా శునకాలతో పాటు ఇతర పెంపుడు జంతువులు, వేటాడే జీవులు, ఇతర మాంసాహార జీవుల మేథో శక్తిని పోల్చి చూశారు. వీటిలో శునకాలతో పాటు తోడేళ్లు, ఎలుగుబంట్లు, సింహాలు, హైనాలూ ఉన్నాయి. శునకాలు ప్రదర్శించే మేధో సామర్థ్యాలను ఇతర జంతువులూ అదే స్థాయిలో కలిగి ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. ‘పరిశోధనలో భాగంగా మేం నిర్వహించిన కొన్ని టాస్కుల్లో శునకాలతో పాటు ఇతర జంతువులూ ఒకే రీతిలో పాల్గొన్నాయ’ని అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ స్టీఫెన్ లీ తెలిపారు. ఇందులో భాగంగా పరిశోధకులు శునకాలతో పాటు ఇతర జంతువుల మేధస్సుకు సంబంధించిన దాదాపు 300 పరిశోధన పత్రాలను పరిగణనలోకి తీసుకొని ఈ విషయం వెల్లడించినట్లు చెప్పారు. -
రాకాసి తిమింగలానికి ఏమైంది..!
లండన్: ప్రపంచంలోనే అత్యధిక వయసు గల కిల్లర్ వేల్(తిమింగలం) అదృశ్యమైందా.. లేక చనిపోయిందా.. అంటే చనిపోయి ఉండొచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దాదాపు వంద ఏళ్ల వయసున్న కిల్లర్ వేల్ కు గ్రాన్నీ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్షీరదాల ఫ్యామిలీలో గ్రాన్నీ, మరికొన్ని తిమింగలాలు మాత్రమే కీలక పాత్ర పోషిస్తాయి. కిల్లర్ వేల్స్ ఇతర ఆడ తిమింగలాలు, పిల్ల తిమింగలాలకు రక్షణ కల్పిస్తాయి. మగ తిమింగలాలకు ఆహారం అందించడం వీటి మరో ప్రత్యేకత. గత కొన్ని నెలలుగా కిల్లర్ వేల్ గ్రాన్నీ కనిపించిన దాఖలాలు లేవని, దీంతో వీటి సంఖ్య తగ్గే అవకాశం ఉందని యూకే లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సీటర్కు చెందిన ఓ ప్రొఫెసర్ డారెన్ గ్రాఫ్ట్ అభిప్రాయపడ్డారు. శతాబ్దం వయసు గల ఈ కిల్లర్ వేల్ ఎన్నో ఏళ్లుగా తన వర్గానికి చెందిన తిమింగలాలకు రక్షణ కల్పించింది. ఇతర తిమింగలాలకు ఆహారం ఎలా సంపాదించుకోవాలి.. ఎక్కడ దొరుకుతుంది అనే విషయాలలో ఇది గైడ్‌గా పనిచేస్తుందని ప్రొఫెసర్ తెలిపారు. 1972లో కిల్లర్ వేల్‌ను కెన్ బాల్కోంబ్ అనే రీసెర్చర్ ఫొటో తీశాడు. సెంటర్ ఫర్ వేల్ రీసెర్చ్ వారు దీనికి 'j2' అని పేరు పెట్టారు. గ్రాన్నీ తిమింగళంపై దాదాపు 4 దశాబ్దాలపాటు రీసెర్చ్ చేసినట్లు ఈ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. చివరగా గతేడాది అక్టోబర్ 12న ఉత్తర దిశగా ఈదుతూ కనిపించింది. ఆ తర్వాత పలువురు గ్రాన్నీ వేల్ ను వెతకగా దీని జాడ కనిపించలేదని చనిపోయి ఉండొచ్చునని అదే దీని అదృశ్యానికి కారణమని రీసెర్చర్స్ పేర్కొన్నారు.