కరిగిపోతున్న మంచు
భూతాపమే ప్రధాన కారణం
న్యూఢిల్లీ: మంచుతో కప్పి ఉండే అంటార్కిటికా ద్వీపకల్పం క్రమంగా హరితమయం అవుతోంది. ఇక్కడ పచ్చదనం పెరుగుతోంది. పచి్చక పరిధి విస్తృతమవుతోంది. గత మూడు దశాబ్దాల కాలంతో పోలిస్తే ఈ పరిణామం ఇటీవల 30 శాతానికిపైగా వేగం పుంజుకున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అంటార్కిటికా పరిణామాలపై యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సిటర్ సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఇందుకోసం శాటిలైట్ డేటాను ఉపయోగించారు.
అంటార్కిటికాలో 1986లో చదరపు కిలోమీటర్ కంటే తక్కువ వైశాల్యంలో పచ్చదనం ఉండగా, 2021 నాటికి అది 12 చదరపు కిలోమీటర్లకు చేరుకున్నట్లు తేల్చారు. ఇక్కడ పచ్చదనం పెరిగిపోతుండానికి కారణంగా భూతాపం, వాతావరణ మార్పులేనని చెబుతున్నారు. ఒకవైపు మంచు పరిమాణం తగ్గిపోతుండగా, అదే సమయంలో పచ్చదనం పెరుగుతోంది. ఈ రెండింటికీ సంబంధం ఉందని అంటున్నారు.
ఆధునిక కాలంలో ప్రపంచ సగటుతో పోలిస్తే అంటార్కిటికా ద్వీపకల్పం వేగంగా వేడెక్కుతోంది. ఇక్కడ వడగాల్పులు సర్వసాధారణంగా మారిపోయాయి. మంచి కరిగిపోయి, ఆ ప్రాంతంలో పచి్చక కనిపిస్తోంది. ఇది కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పచి్చక అని సైంటిస్టులు చెప్పారు. వాతావరణ మార్పులను అడ్డుకోకపోతే అంటార్కిటికాలో మంచు పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడపై ప్రతికూల ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment