peninsula
-
అంటార్కిటికా హరితమయం!
న్యూఢిల్లీ: మంచుతో కప్పి ఉండే అంటార్కిటికా ద్వీపకల్పం క్రమంగా హరితమయం అవుతోంది. ఇక్కడ పచ్చదనం పెరుగుతోంది. పచి్చక పరిధి విస్తృతమవుతోంది. గత మూడు దశాబ్దాల కాలంతో పోలిస్తే ఈ పరిణామం ఇటీవల 30 శాతానికిపైగా వేగం పుంజుకున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అంటార్కిటికా పరిణామాలపై యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సిటర్ సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఇందుకోసం శాటిలైట్ డేటాను ఉపయోగించారు. అంటార్కిటికాలో 1986లో చదరపు కిలోమీటర్ కంటే తక్కువ వైశాల్యంలో పచ్చదనం ఉండగా, 2021 నాటికి అది 12 చదరపు కిలోమీటర్లకు చేరుకున్నట్లు తేల్చారు. ఇక్కడ పచ్చదనం పెరిగిపోతుండానికి కారణంగా భూతాపం, వాతావరణ మార్పులేనని చెబుతున్నారు. ఒకవైపు మంచు పరిమాణం తగ్గిపోతుండగా, అదే సమయంలో పచ్చదనం పెరుగుతోంది. ఈ రెండింటికీ సంబంధం ఉందని అంటున్నారు. ఆధునిక కాలంలో ప్రపంచ సగటుతో పోలిస్తే అంటార్కిటికా ద్వీపకల్పం వేగంగా వేడెక్కుతోంది. ఇక్కడ వడగాల్పులు సర్వసాధారణంగా మారిపోయాయి. మంచి కరిగిపోయి, ఆ ప్రాంతంలో పచి్చక కనిపిస్తోంది. ఇది కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పచి్చక అని సైంటిస్టులు చెప్పారు. వాతావరణ మార్పులను అడ్డుకోకపోతే అంటార్కిటికాలో మంచు పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడపై ప్రతికూల ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు. -
Iceland volcano: భూగర్భంలో భుగభుగలు
అనగనగా ఒక చిన్న పల్లెపట్టు. అంతా సజావుగా సాగిపోతున్న వేళ. ఉన్నట్టుండి ఎటు చూస్తే అటు భూమిపై పగుళ్లు. చూస్తుండగానే అందులోంచి ఫౌంటేన్‌లా విరజిమ్ముతూ లావా ప్రవాహాలు. బిక్కచచి్చపోయి కకావికలమవుతున్న జనం. ఏదో హాలీవుడ్ సినిమాలా ఉంది కదూ! ఐస్లాండ్లో పశ్చిమ రెగ్జానెస్ ద్వీపకల్పంలోని గ్రెంతావిక్ అనే బుల్లి బెస్త గ్రామం, దాని పరిసర ప్రాంతాలు ఇప్పుడు అచ్చం అలాంటి భయానక పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. అక్కడ భూగర్భంలో 800 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న అపారమైన లావా రాశి కొన్నాళ్లుగా ఒళ్లు విరుచుకుంటోంది. భారీ ప్రవాహంగా మారి భయపెడుతోంది...! ఐస్లాండ్ అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. అక్కడి రెగ్జానెస్ ద్వీపకల్పమైతే అందమైన అగ్నిపర్వతాలకు నిలయం. పెద్ద టూరిస్టు స్పాట్ కూడా. గత 800 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఒక్క అగ్నిపర్వతం కూడా బద్దలవలేదు. అలాంటిది గతేడాది నుంచి ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. కొద్ది రోజులుగా భయానక స్థాయికి చేరాయి. ముఖ్యంగా గ్రెంతావిక్, పరిసర ప్రాంతాల్లో గత నెల రోజుల్లోపే ఏకంగా మూడుసార్లు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. లావా ప్రవాహాలు ఉవ్వెత్తున ఎగజిమ్మి భయభ్రాంతులను చేశాయి. దాంతో ఆ ప్రాంతాలవారిని ఖాళీ చేయించాల్సి వచి్చంది. ఇదంతా టీజర్ మాత్రమేనని అసలు ముప్పు ముందుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గ్రెంతావిక్ కింద భూగర్భంలో మాగ్మా (శిలాద్రవం) పూర్తిగా కరిగి అపార లావా ప్రవహంగా మారిందని తేల్చారు! దాని పరిమాణం రికార్డు స్థాయిలో ఏకంగా 65 లక్షల క్యూబిక్ మీటర్లని లెక్కగట్టారు! అంతేకాదు, ఈ లావా భూగర్భంలో ఏకంగా సెకనుకు 7,400 క్యుబిక్ మీటర్ల వేగంతో ప్రవహిస్తోందట. ఇది డాన్యుబ్ వంటి భారీ నదుల ప్రవాహ వేగం కంటే కూడా చాలా ఎక్కువ. 2021–23 మధ్య ఇక్కడ భూగర్భంలో నమోదైన లావా ప్రవాహ రేటు కంటే ఇది 100 రెట్లు ఎక్కువని అధ్యయన సారథి యూనివర్సిటీ ఆఫ్ ఐస్లాండ్లోని నోర్డిక్ వోల్కెనోలాజికల్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ ఫ్రెస్టెనిన్ సిగ్మండ్సన్ లెక్కగట్టారు. ఈ లావా ప్రవాహం ఉజ్జాయింపుగా 15 కిలోమీటర్ల పొడవు, నాలుగు కిలోమీటర్ల ఎత్తు, కేవలం కొన్ని మీటర్ల వెడల్పున్నట్టు తేల్చారు. ఈ గణాంకాలు, హెచ్చరికలతో కూడిన అధ్యయనం జర్నల్‌సైన్స్‌లో గురువారం ప్రచురితమైంది. అందుకు కేవలం కొన్ని గంటల ముందే ఆ ప్రాంతమంతటా అగ్నిపర్వతం బద్దలవడంతో పాటు భూగర్భం నుంచి కూడా లావా ఎగజిమ్మిన ఉదంతాలు నమోదయ్యాయి! ఇలా జరగడం గత రెండు నెలల్లో మూడోసారి. గతేడాది డిసెంబర్ 18 నుంచి ఈ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు లావా ఎగజిమ్మింది. మళ్లీ ఈ ఏడాది జనవరి 14న కూడా రెండుసార్లు లావా పెల్లుబికింది. దాంతో ప్రభుత్వం హుటాహుటిన రంగంలోకి దిగింది. ఈ ద్వీపకల్పమంతటా ఎమర్జెన్సీ ప్రకటించింది. భవిష్యత్తుపై ఆందోళన తాజా పరిస్థితుల నేపథ్యంలో రెగ్జానెస్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొద్ది రోజులుగా గ్రెంతావిక్తో పాటు ఇక్కడి పలు ఆవాస ప్రాంతాల్లో భూగర్భంపై ఒత్తిడి తీవ్రతరమవుతున్న సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. భూమిలోంచి లావా ప్రవాహాలు ఎగజిమ్ముతుండటమే గాక ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో భూ ప్రకంపనలూ నమోదవుతున్నాయి. ఒక పెద్ద క్రీడా మైదానంలో సగానికి పైగా భారీ పగులు ఏర్పడటం వణికిస్తోంది. ప్రస్తుతానికైతే మొత్తం ద్వీపకల్పం భవిష్యత్తుపైనే నీలినీడలు కమ్ముకున్నాయని ప్రొఫెసర్ సిగ్మండ్సన్ ఆవేదనగా చెబుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ లావా ప్రవాహం మరింతగా పెరిగేలా ఉందని కూడా ఆయన హెచ్చరించారు. అగ్నిపర్వతాల పుట్టిల్లు ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో చురుకైన అగ్నిపర్వతాలు ఉన్న దేశంగా ఐస్లాండ్కు పేరుంది. అందుకే దాన్ని లాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని చమత్కరిస్తుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30కి పైగా అగ్నిపర్వతాలు చురుగ్గా ఉన్నాయి. ఇవి భారీ పర్యాటక ఆకర్షణలు కూడా. వీటిని చూసేందుకు ఏటా విదేశీయులు వస్తుంటారు. ఐస్లాండ్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ప్రాంతంలో ఉండటమే అక్కడ ఇన్ని అగ్నిపర్వాతల పుట్టుకకు ప్రధాన కారణమన్నది సైంటిస్టుల అభిప్రాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యాలో ఒళ్లు విరుచుకున్న అగ్నిపర్వతాలు
మాస్కో: రష్యాలో రాజధాని మాస్కోకు 6,600 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో కంచట్కా ద్వీపకల్పంలో రెండు అగ్నిపర్వతాలు నిద్రాణ స్థితి నుంచి మేల్కొని ఒళ్లు విరుచుకున్నాయి. భారీ పరిమాణంలో లావాను వెదజల్లుతున్నాయి. వాటినుంచి వెలువడుతున్న లావా, ధూళి మేఘాలు సుదూరాల దాకా కన్పిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అతి త్వరలో పూర్తిస్థాయిలో బద్దలయ్యే ప్రమాదముందన్నారు. శనివారం సంభవించిన గట్టి భూకంపమే ఇందుకు కారణమట. వీటిలో క్లుచెవ్స్కయా స్పోకా అగ్నిపర్వతం నుంచి గంటకు ఏకంగా పదిసార్లు భారీ పేలుళ్లు వెలువడుతున్నాయట! 4,754 మీటర్ల ఎత్తులో ఉన్న ఇది యురేషియాలోకెల్లా అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం. కంచట్కా ద్వీపకల్ప ప్రాంతం ఏకంగా 30కి పైగా చురుకైన అగ్నిపర్వతాలకు నిలయం! -
గత అధ్యక్షులు విఫలం
వాషింగ్టన్: కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన కోసం గతంలో అమెరికా చేసిన ప్రయ త్నాలన్నీ బెడిసికొట్టాయి. ఆ విషయంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన 11 మంది ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయా రు. 1960ల్లో కెన్నడీ, జాన్సన్ అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఉత్తర కొరియాతో కొంతవరకు సత్సంబంధాలు కొనసాగాయి. 1968లో అమెరికా నిఘా నౌకల్ని నిర్బంధించడంతో పాటు గూఢచర్య విమానాల్ని ఉత్తర కొరియా పేల్చివేసింది. ఆ తర్వాత రెండేళ్లకి ఉత్తర కొరియా తన ధోరణి మార్చుకుని శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. 1974 అనంతరం అప్పటి ఉత్తర కొరియా అధినేత కిమ్ ఇల్ సంగ్, అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌తో శాంతి ఒప్పందానికి ప్రయత్నాలు చేశారు. అయితే చర్చల్లో ముందడుగు పడలేదు. 1981 లో అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించారు. దక్షిణా కొరియాను సమర్థిస్తూ మిలటరీ బలగాల్ని పెంచారు. ఆ తర్వాతి అధ్యక్షుడు జార్జ్ బుష్(సీనియర్) దక్షిణకొరియా నుంచి భారీగా సైన్యాన్ని వెనక్కి రప్పించారు. అయితే ఉత్తరకొరియాతో శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. 1993–2001 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ ఉత్తర కొరియాతో సంక్షోభ పరిష్కారానికి కొంతవరకు ప్రయత్నాలు చేశారు. పదేళ్ల పాటు శాంతియుత సంబంధాలే కొనసాగినా, జార్జ్ బుష్(జూనియర్) అధ్యక్షుడయ్యాక మళ్లీ సంబంధాలు క్షీణించాయి. ఉ.కొరియాతో సంబంధాల విషయంలో ఒబామా సంయమనం పాటించారు. ఆంక్షలతో దారికి వస్తుం దని భావించారు. 2011లో ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టిన కిమ్ ఆంక్షల్ని లెక్క చేయకుం డా అణుపరీక్షలు కొనసాగించారు. ఈ సారైనా ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు వెళ్తా యా? లేక గతంలో మాదిరిగా ప్రహసనంగా మారుతుం దా? అన్నది ట్రంప్ చేతుల్లోనే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
‘అణ్వస్త్రాలతో మా వైపు ఎందుకు?’
-
‘అణ్వస్త్రాలతో మా వైపు ఎందుకు?’
ప్యాంగ్యాంగ్: అమెరికాపై మరోసారి ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద మొత్తంలో వ్యూహాత్మక అణుబాంబులతో అమెరికా యుద్ధ నౌక కొరియా ద్వీపకల్పంలోకి రావడమేంటని ప్రశ్నించింది. అమెరికా యుద్ధ నౌక సమీపిస్తుండగానే ఆరోసారి ఉత్తర కొరియా అణుపరీక్ష జరిపేందుకు సిద్ధమవుతుండటం ఇప్పుడు కలవరాన్ని రేపుతోంది. సిరియా అమాయక ప్రజలపై విషరసాయనాల దాడులు జరిగిన తర్వాత అక్కడి వైమానిక స్థావరాలపై అమెరికా ఏక కాలంలో మొత్తం 59 తొమాహక్ క్షిపణులతో దాడులు చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా పరోక్షంగా దూకుడుగా ఉన్న ఉత్తర కొరియా, చైనాకు అమెరికా హెచ్చరికలు చేసింది. అయినప్పటికీ ఉత్తర కొరియా ఏ మాత్రం వెనక్కి తగ్గకపోగా యుద్ధం వస్తే తాము సై అంటూ ప్రకటించింది. దీంతో అమెరికా కొరియాను సమీపిస్తోంది. మరోపక్క, ఇక మా వ్యూహాత్మక ఓపిక నశించిందని అమెరికా ప్రకటించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
మారని తలరాత
సరి‘హద్దు’ మీరిన సమస్యలు నరకానికి నకళ్లు ఆ రహదారులు పడవలు, తెప్పలే ప్రయాణ సాధనాలుబడులూ లేవు, దవాఖానా లేదుతలాపునే నీళ్లు, దాహం తీరదు వానాకాలం వణుకుడు,ఎండాకాలం ఉడుకుడు అభివృద్ధి నిధుల మంజూరు శూన్యమే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇదే దుస్థితి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు దాటింది. జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామీణ భారతం మాత్రం ఆవిష్కృతం కాలేదు. ఇప్పటికీ చాలా వరకు పల్లెలు సమస్యల చక్రబంధంలో ఇరుక్కుని ఉన్నాయి. గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామన్న ప్రజాప్రతినిధులు, అధికారుల మాటలు నీటి మూటలేనని అవి నిరూపిస్తున్నాయి. నిజామా బాద్-మెదక్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఊళ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. రహదారులు లేవు. తాగడానికి నీళ్లు లేవు. చదువుకోవడానికి బడులు లేవు. రోగమొస్తే చూపించుకోవడానికి దవాఖాన లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవి ఎవ్వరికీ పట్టని జనావాసాలు. ఇక్కడి దీనస్థితిపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. - బాన్సువాడ పడేసినట్లున్న ఊళ్లు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో, మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ గ్రామాలు. వీటికి కూతవేటు దూరంలో, మహారాష్ట్ర, కర్ణాటకలోని గ్రామాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్, పిట్లం మండలాలు, మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల గ్రామాలన్నీ సరిహద్దుకే ఆనుకొని ఉన్నాయి. ముఖ్యంగా జుక్కల్ మండలంలోని బాబుల్ గాం, శక్తినగర్, చింతల్‌వాడి, చింతల్‌వాడి తాండ, హట్యానాయక్ తాండ, కంగ్టి మండలంలోని బోర్గి, చౌకన్పల్లి తదితర గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేక అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బడా సమస్యల బాబుల్‌గాం బాబుల్‌గాం గ్రామం ద్వీపకల్పంలా ఉంది. ఈ గ్రామాన్ని మూడు వైపులా కౌలాస్‌నాలా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఆవరించి ఉంది. ఏడాదికి 12 నెలలూ ఇదే పరిస్థితి. బా బుల్గాం నుంచి విఠ ల్వాడికిగానీ, జుక్కల్కుగానీ వెళ్లాలంటే వానాకాలంలో 60 కిలోమీటర్లు, ఎండాకాంలో 30 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిందే. వాస్తవానికి బాబుల్‌గాం నుంచి జుక్కల్‌కు పది కిలోమీటర్ల దూరమే ఉన్నా, కౌలాస్‌నాలా బ్యాక్ వాటర్‌తోపాటు రోడ్డు సరిగా లేక ఆ గ్రామ ప్రజలు 50 కిలోమీటర్లు అధికంగా తిరగాల్సి వస్తోంది. వర్షాకాలంలో కౌలాస్‌నాలా ప్రాజెక్టు నిండితే బాబుల్‌గాం పూర్తిగా మునిగినట్టే. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, అంధకారంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతారు అక్కడి ప్రజలు. ఈ గ్రామానికి మండలస్థాయి అధికారులు ఎవరూ రారు. ఎప్పుడైనా వస్తే వారు రోజంతా ఇక్కడే గడపాలి. మరో రెండు రోజులు సెలవు పెట్టాలి. అయితేనే ఆ గ్రామానికి చేరుకొంటారు. గ్రామం చెంతనే కేఎన్పీ బ్యాక్‌వాటర్ ఉన్నా, బోర్లు మాత్రం పని చేయవు. రాళ్లతో కూడిన రహదారిపై కాలి నడకన వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సిందే. బడి ఉన్నా పేరుకే..ఉపాధ్యాయులు లేరు. దవాఖానా లేదు. రోగమొస్తే తెప్పలెక్కి పట్టణానికి పోవలసిందే. తండాల పరిస్థితీ అంతే! బాబుల్‌గాం సమీపంలో ఉండే హట్యానాయక్ తాండ, చింతల్‌వాడి తాండ, చౌకన్పల్ల తాండాలలో గిరిజనులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, అవి క్షేత్ర స్థాయిలో అందడం లేదనడానికి ఈ తండాలే నిదర్శనం. తాగునీటి కోసం ఈ తండాల వా సులు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ జిల్లా కంగ్టీ మండలం చౌకన్పల్లికి వెళ్తున్నారు.రాష్ట్రంలోనే వెనుకబడి ఉన్న జుక్కల్ సెగ్మెంట్లోని అనేక గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. గోజెగాం గ్రామం మద్నూర్ మండల కేంద్రానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా, లెండి వాగు అడ్డంగా ఉండడంతో గ్రామస్తులు 30 కిలోమీటర్ల వరకు తిరిగి, మహారాష్ట్ర ద్వారా మద్నూర్‌కు వస్తున్నారు. గోజెగాం వంతెన నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే గం గారాం హయాంలో కోటి రూపాయలు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ నిధులను లింబూర్-మద్నూర్ రోడ్డు నిర్మాణానికి మళ్లించారు. దీం తో గ్రామస్తుల కల కలగానే మిగిలింది. ప్రస్తుతం పనులు మందకొడిగా సాగుతున్నాయి. జుక్కల్ మండలంలోని బాబుల్‌గాం, శక్తినగర్, చింతల్‌వాడి గ్రామాలు ప్రతీ వర్షాకాలంలో కౌలాస్‌నాలా బ్యాక్ వాటర్‌తో జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. -
ఇటలీ
చరిత్ర: ఇటలీ దేశానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. వేల సంవత్సరాలుగా ఈ దేశం గొప్ప గొప్ప రాజుల ఏలుబడిలో ఉండి, ఎంతో అభివృద్ధి చెందిన దేశంగా పేరు గాంచింది. మధ్యధరా సముద్రంలోకి ఒక తోకలా చొచ్చుకొన్న ద్వీపకల్పం ఇటలీ. దేశంలోని అనేక నగరాలు వేలాది సంవత్సరాల క్రితం నాడే అభివృద్ధి చెంది ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యం ఒకప్పుడు ఇటలీ అంతా విస్తరించి ప్రపంచ చరిత్రలో తిరుగులేని సామ్రాజ్యంగా వెలుగొందింది. ఆ తర్వాత ఫ్రెంచి రాజులు, అరబ్బులు ఈ దేశాన్ని పాలించారు. ప్రపంచ ప్రసిద్ధ యోధుడు నెపొలియన్ కూడా ఈ దేశాన్ని పరిపాలించాడు. ప్రపంచ ప్రసిద్ధ రోమ్ నగరం, మిలన్ నగరాలు ఈ దేశంలోనే ఉన్నాయి. క్రైస్తవులకు గుండెకాయలాంటి వాటికన్ పవిత్ర నగరం కూడా ఇటలీ దేశంలోనే ఉంది. దేశంలో ఉత్తరం నుండి దక్షిణం దాకా ఆలివ్ తోటలు విస్తరించి ఉన్నాయి. ప్రపంచవీక్షణం నైసర్గిక స్వరూపం ఖండం - యూరప్ వైశాల్యం - 3,01,338 చదరపు కిలోమీటర్లు, జనాభా - 60,923,964 (తాజా అంచనాల మేరకు), రాజధాని - రోమ్, ప్రభుత్వం - యూనిటరీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్, భాషలు - ఇటాలియన్ (అధికారభాష), ఫ్రెంచ్, జర్మన్, కరెన్సీ- లీరా, మతస్థులు - క్రైస్తవులు 83%, ముస్లిములు 2.6%, హిందువులు 2%, వాతావరణం - జనవరిలో 4 నుండి 11 డిగ్రీలు, జులైలో 20 నుండి 30 డిగ్రీలు. సరిహద్దులు - స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, యుగొస్లావియా, ఫ్రాన్స్ మధ్యధరా సముద్రం, స్వాతంత్య్రం దినం: 1946 జాన్ 2. పాలనా విధానం: పాలనా సౌలభ్యం కోసం ఇటలీ దేశాన్ని 20 రీజియన్లుగా విభజించారు. ఇటలీలో 15 మెట్రోనగరాలను కలుపుకొని మొత్తం 20 నగరాలు అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరాలుగా చలామణి అవుతున్నాయి. అవి రోమ్, మిలన్, నేపుల్స్, టురిమ్, పావెర్మో జెనోవా, బొలోగ్నా, ఫ్లారెన్స్, బారి, కాటానియా, వెనిస్, వెరోనా, మెస్సినా, పడువా, ట్రిస్టే, టరాంటో, బ్రెసియా, ప్రాటో, పర్మా, రెగ్గియె కలబ్రియో. ఇటలీలో లక్షా యాభైవేల మంది భారతీయులు నివసిస్తున్నారు. రోమ్ నగరం: రోమ్ నగరాన్ని సంవత్సరానికి దాదాపు కోటి మంది సందర్శిస్తుంటారు. ఇక్కడ ఉన్న కలోజియం, వాటికన్ మ్యూజియం, పాంథియన్, ట్రెవి ఫౌంటెన్, సెయింట్ పీటర్స్ బసిలాకా, సెయింట్ జాన్ బసిలికా సాంటాంజిలో గుహలు చూడదగ్గవి. మొత్తం ప్రపంచంలో రోమ్నగరాన్ని సందర్శించే జనాభా 22 శాతంగా ఉంది. రోమ్ నగరం మధ్యలో ఉన్న కలోజియం ఒక అద్భుత కట్టడం. వేలాది సంవత్సరాల క్రితం నిర్మించినా, ఇప్పుడు అది ఒక నిర్మాణ అద్భుతంగా దర్శనమిస్తుంది. నగరంలో చూడాల్సిన మరో ప్రదేశం సెయింట్ పీటర్స్ స్క్వేర్. ఇది కూడా ఒక అద్భుతమైన కట్టడం. చూడగానే ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. నగరంలోనే టైబర్నది ప్రవహిస్తూ ఉంటుంది. నదికి ఇరువైపులా నీళ్ళలోనే కట్టినట్లుగా ఉండే ఎత్తై భవనాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. 1. మిలన్ నగరం: మిలన్ నగరం ప్రపంచపు ఫ్యాషన్ నగరాలలో ప్రముఖమైనది. ఇక్కడ ఎన్నో ఫ్యాషన్ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. నగరంలో డ్యూమో, సాన్ సిరో స్టేడియం, విట్టోరియో గ్యాలరీ, సెయింట్ ఆమ్బ్రోజియో బ్యాసిలికా మొదలగు కట్టడాలు ప్రసిద్ధి. ఇక్కడ 12వ శతాబ్దంలో కట్టిన గోడలు ఒక ప్రత్యేక ఆకర్షణ. మిలన్ నగరంలో మొత్తం ఏడు ముఖ్యద్వారాలతో అప్పటి నగరం చుట్టూ గోడ కట్టారు. దాని ఆనవాళ్ళు నేటికీ నిలిచి ఉన్నాయి.రోమ్ నగరాన్ని క్రీస్తుపూర్వం 49లో నిర్మించారని చరిత్ర చెబుతోంది. మిలన్లోని కాథెడ్రల్ ఒక అద్భుత కట్టడం. 2. ఫ్లారెన్స్: ఇది టస్కనీ రీజియన్‌కు రాజధాని. ఈ నగరంలో దాదాపు 20 లక్షల జనాభా ఉంది. ఒకప్పటి ఇటలీ రాజ్యానికి రాజధానిగా వెలుగొందింది. 1982లో యునెస్కో దీనికి ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపునిచ్చింది. ఇక్కడి శిల్పకళ, సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రపంచంలోనే అద్భుతం అని చెప్పవచ్చు. ఇక్కడ పాలాజో డెగ్లీ ఉఫిజి కట్టడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ నగరాన్ని క్రీస్తుపూర్వం 80వ సంవత్సరంలో నిర్మించారు. నగరంలో పాలజో వెచ్చియో, ఫ్లారెన్స్ సిటీహల్, ఆర్నోనది ఒడ్డున ఉన్న పోంటే వెచ్చియో, డ్యూమో, పాలరాతితో నిర్మించిన నెఫ్ట్యూన్ ఫౌంటెన్, క్యాథెడ్రల్, సాన్ లోరెంజో చర్చి, పాలాజా డెల్లా సిగ్నోరియా, పియాజాలె డెగ్లి ఉఫిజి, పాలాజో పిట్టి, బొబొలి గార్డెన్స్, సాంటామారియా క్యాథెడ్రల్, ఫ్లారెన్స్ కాథడ్రల్, లొగ్గియూ డిలాంజి, ఆర్కియోలాజికల్ మ్యూజియం, సైన్స్ హిస్టరీ మ్యూజియం, జూలాజికల్ మ్యూజియం మొదలైనవి చూడదగ్గవి. 3. వెనిస్ నగరం: వెనిస్ నగరానికి అనేక పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా లాడామినెంటె, సెరెనిస్సియా, అడ్రియాటిక్ క్వీన్, సిటీ ఆఫ్ వాటర్, సిటీ ఆఫ్ మాస్క్స్, సిటీ ఆఫ్ బ్రిడ్జెస్, ది ఫ్లోటింగ్ సిటీ, సిటీ ఆఫ్ కెనాల్స్, యూరప్ దేశపు శృంగార నగరం ఇలా అనేక పేర్లు ఉన్నాయి. దీనిని క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో నిర్మించారు. నగరం మొత్తం యునెస్కో వారసత్వపు నగరంగా గుర్తింపు పొందింది. నగరం అంతా చిన్న చిన్న ద్వీపాలుగా ఉంటుంది. నగరం నిండా నీళ్ళతో నిండిన కాలువలే కనిపిస్తాయి. ప్రజలు ఈ కాలువల్లో చిన్న చిన్న పడవలలో ప్రయాణిస్తూ ఉంటారు. వందలాది సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. గ్రాండ్ కెనాల్ ఈ నగరానికే గొప్ప శోభ. 4. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా పీసా నగరంలో ఉన్న ఈ కట్టడం ప్రపంచ వింతలలో ఒకటిగా పేరుగాంచింది. 11వ శతాబ్దంలో ఈ కట్టడం నిర్మాణం ఆరంభమైంది. మూడో అంతస్తు నిర్మాణం పూర్తయ్యేసరికి ఈ కట్టడం కాస్త కుంగి ఓ వైపుకు ఒరిగింది. కొంతకాలానికి మళ్ళీ ఆరంభించి 8 అంతస్తులు నిర్మించారు. అది ఇప్పటికీఅలాగే ఓ పక్కకు ఒరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. నేటికీ పడిపోకపోవడం అనేదే దీని ప్రత్యేకత. పంటలు-పరిశ్రమలు: ఇటలీ దేశంలో గోధుమలు, మొక్కజొన్న, వరితో పాటు టమోటాలు, ఆలివ్ ఎక్కువగా పండిస్తారు. ఈ రెండింటినీ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. బంగాళదుంపలు, కమలాపళ్ళు, బార్లీ, ఆపిల్స్, ద్రాక్ష కూడా బాగా పండుతాయి. మిలన్ పరిశ్రమల ప్రాంతాలలో అనేక పరిశ్రమలు నెలకొని ఉన్నాయి. మోటరు వాహనాల పరిశ్రమలు, టైర్ల తయారీ, రసాయనాలు, పెట్రో రసాయనాలు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పరిశ్రమలు, గృహోపకరణాలు, హెలికాప్టర్లు, యుద్ధవిమానాలు, వస్త్రపరిశ్రమ, ఆహార ఉత్పత్తులు, లగ్జరీ కార్లు, క్రీడా పరికరాలు, పడవలు ఇంకా ఇతర పరిశ్రమలు ఉన్నాయి. ఇటలీ దేశం పవన విద్యుత్తును, సోలార్ విద్యుత్తును గణనీయంగా ఉత్పత్తి చేస్తోంది. ప్రజలు- సంస్కృతి: దేశంలో వివిధ దేశాలకు చెందిన ప్రజలు నివసిస్తూ ఉండడం వల్ల విభిన్న సంస్కృతులు దర్శనిమిస్తుంటాయి. ఇటలీ ప్రజలు ఫ్యాషన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. మిలన్ నగరం ఆధునిక ఫ్యాషన్‌కు కేంద్ర బిందువు అయితే, రోమ్ నగరం పురాతన ఫ్యాషన్‌కు ప్రతీకగా నిలుస్తుంది. బెనెట్టన్, గుచి అనే ఫ్యాషన్ దుస్తులు ఇటలీ తయారీయే.ఇక ఇటలీ ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ ప్రసిద్ధ మోనాలిసా చిత్రాన్ని గీసిన చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ ఈ దేశానికి చెందిన వాడే. ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన కలోజియం ఈ దేశంలోనే ఉంది. ఇది రోమ్ నగరం మధ్యలో నిలిచి ఉంది. దీనిని రోమన్ రాజులు నిర్మించారు. ఆహారం: ఇటలీ దేశం పిజ్జా, పాస్తాలకు ప్రసిద్ధి. బ్రెడ్డు, సాస్ తింటూ వైన్ తాగుతూ ఆనందిస్తారు ఇక్కడి ప్రజలు. ఫ్రూట్సలాడ్, పిజ్జా, పాస్తా, మాంసం, చేపలు, సారాయి వీరి ముఖ్య ఆహారపు అలవాట్లు. ఏదైనా ఆహారం తీసుకోగానే టమాటా సూప్ తాగడం వీరికి తప్పనిసరి. ఉదయం పూట ‘కాపుసినో’ అనే కాఫీ తాగుతారు. -
తలాపునే మంజీర...
కుర్తి(పిట్లం), న్యూస్‌లైన్: పిట్లం మండలంలోని కుర్తి గ్రామం ద్వీపకల్పంగా పేరు గాంచింది. ఎందుకంటే ఈ గ్రామం చుట్టూ మంజీర నది పారుతుంటుంది. ‘‘ఈ గ్రామస్తులు ఎంతో అదృష్టవంతులు. మంజీర నీరు తాగుతారు’’ అని అందరూ అనుకుంటారు. కానీ, వారు తాగేది ఫ్లోరైడ్ నీరే!. ఏళ్ల తరబడి ఈ నీటిని సేవి స్తున్న గ్రామస్తులు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కుర్తి గతం లో రాంపూర్ కలాన్ పంచాయతీకి అనుబంధంగా ఉండేది. కాలక్రమంలో పంచాయతీగా ఆవిర్భవిం చింది. గ్రామంలో సుమారు వెయ్యికి పైగా జనాభా ఉండగా, రెండు వందలకు పైగా కుటుంబాలు ఉన్నాయి. వీరందరు నిత్యం తమ అవసరాల కోసం గ్రామంలో గల చేతిపంపులు, నీటిట్యాంకు నీరుపైనే ఆధారపడుతున్నారు. గ్రామంలో ప్రస్తుతం ఒక నీటి ట్యాంకు, ఎస్సీ కాలనీకి నీరు సరఫరా చేసే మరో మినీ నీటి ట్యాంకు ఉంది. వీటితో పాటుగా మరి కొన్ని చేతిపంపులు ఉన్నాయి. ఈ వనరుల ద్వారా గ్రామస్తులకు ఫ్లోరైడ్ నీరే అందుతోంది. ప్లోరైడ్ నీరు వాడకంతో తమకు రోగాలు వస్తున్నాయని గ్రామస్తులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో భాగంగా అప్పటి కలెక్టర్ క్రిస్టీనా కుర్తి గ్రామానికి వచ్చినపుడు ప్లోరైడ్ నీటి బాధను గ్రామస్తులు ఆమెకు వివరించారు. కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీర్చుతానని హామీ ఇచ్చారు. అం తేగాక గతంలో చాలా సార్లు ఎమ్మెల్యే హోదాలో గ్రామానికి వచ్చిన హన్మంత్ సింధే దృష్టికి కూడ సమస్యను తీసుకెళ్లారు. ఇలా ఎంతమందికి విన్నవించినా సమస్య తీరలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెంతనున్న మంజీర నీరును సరఫరా చేయాలని విన్నవించుకుంటున్నారు.