భర్త లేకుంటేనే నయం!
లండన్: స్త్రీకి ఐదోతనమే భాగ్యం అనే మాట మన సంప్రదాయంలో ఉంది. కానీ, భర్త బతికున్నప్పటి కంటే మరణించిన తర్వాతే భార్యలు ఒత్తిడి లేకుండా జీవిస్తారని తాజాగా చేసిన పరిశోధనా ఫలితాలు అంటున్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ పడోవాకు చెందిన శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనల్లో దంపతుల్లో.. భార్య మరణిస్తే భర్తను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుందనీ, అదే భర్త మరణం భార్యపై ఒత్తిడిని తగ్గిస్తుందని తేలింది. భార్య ఇంట్లో పనులను సరిదిద్దుకుంటూ.. బాగోగులు చూస్తుండటం వల్ల భార్య మరణం భర్తకు శాపంగా తోస్తుందనీ, అదే విధంగా భర్త మరణానంతరం భార్యపై పనిభారం ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల ఆమె ఒత్తిడికి లోనుకాదని పరిశోధకులు వివరించారు.
దాదాపు 733 మంది ఇటలీకు చెందిన పురుషులు, 1154 మంది మహిళలపై నాలుగున్నరేళ్ల పాటు చేసిన పరిశోధనల్లో భర్త ఉన్న మహిళల కన్నా భర్త మరణించిన వారికి 23 శాతం ఒత్తిడి తగ్గినట్లు వెల్లడైంది.