unsatisfied
-
సెంటిమెంటే అస్త్రం.. అతిరథ మహారథుల ప్రచారం!
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎన్నికలలో ఎట్టిపరిస్థితుల్లో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోన్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలను రంగంలోకి దింపుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయే కారణమనే సెంటిమెంటును అస్త్రంగా ప్రయోగించి ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. దీని అమలు కోసం అతిరథ మహారథులు రాష్ట్రానికి వస్తున్నారు.కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు, ఏఐసీసీ ట్రెజరర్ అహ్మద్ పటేల్ రంగప్రవేశం చేశారు. శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడిన బిక్షపతి యాదవ్ ఇంటికి అహ్మద్‌పటేల్ బుధవారం వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ట్రబుల్ షూటర్‌గా వెళ్లే కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన జైరాంరమేశ్ వరకు అందరూ క్యూ కట్టి హైదరాబాద్ వస్తున్నారు.వీరప్పమొయిలీ, జైపాల్లాంటి నేతలు దౌత్యం చేస్తుండగా, కుష్బూ, చిదంబరం, పృథ్వీరాజ్‌చౌహాన్, నారాయణస్వామిలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎన్నికల రంగంలో వేడి పెంచుతున్నారు. సర్దుకు పోండి.. మేం అండగా ఉంటాం ‘మహాకూటమి’కారణంగా కుదుర్చుకున్న పొత్తుల వల్ల నష్టపోతున్న స్థానాలు, పార్టీలో టికెట్లు ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించేందుకు ఏఐసీసీ పెద్ద కసరత్తే చేసింది.అభ్యర్థుల ఖరారుకు ముందే రాష్ట్రానికి చెందిన 15 మంది వరకు నేతలను ఢిల్లీకి పిలిపించి వార్‌రూంలో చర్చించిన పార్టీ అధిష్టానం... అభ్యర్థిత్వాల ఖరారు కోసం మరోమారు బృందాలను పంపింది. మొదటి దఫాలో కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్, పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి, ఆ రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావులు హైదరాబాద్‌కు వచ్చి అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. దాదాపు 25 మంది నేతలతో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సమావేశమై వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత బెట్టుగా ఉన్న మరికొందరిని దారిలోకి తెచ్చుకునేందుకు ఇద్దరు సీనియర్లకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పజెప్పింది. కేంద్ర మాజీ మంత్రులు వీరప్పమొయిలీ, ఎస్.జైపాల్‌రెడ్డిలు గత రెండురోజులుగా ఇదే పనిలో ఉన్నారు. ఇక బుధవారమే హైదరాబాద్ నగరానికి చేరుకున్న జైరాంరమేశ్ కూడా ఇదే పనిలో ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గ టికెట్ ఆశించిన తోటకూర జంగయ్యయాదవ్ వద్దకు కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, జెట్టి కుసుమకుమార్‌లతో కలపి బోడుప్పల్‌కు వెళ్లి మరీ జంగయ్యకు సర్దిచెప్పారు. ఈ చర్యలతో రెబెల్స్ బెడద అంతగా లేకుండా నివారించుకోగలిగారు. మరోవైపు శివకుమార్ గత మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు.ప్రచారం, వ్యూహాలు, అంతర్గత సమస్యలపై ఆయన టీపీసీసీ ముఖ్యులతో సమన్వయం చేస్తున్నట్టు తెలిసింది. దీనికి తోడు ఈనెల 23న జరగనున్న సోనియా, రాహుల్‌ల సభను జయప్రదం చేసేందుకు జైరాంరమేశ్ కూడా ఆయనకు తోడయ్యారు. ఇచ్చామన్న సెంటిమెంటుతో... పోయిన చోటే వెతుక్కోవాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సెంటిమెంట్‌ను మరోసారి తెలంగాణ ప్రజలకు గుర్తుకు తేవాలనే వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సోనియాగాంధీతో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పాల్గొననున్నారు. ఈ సభలోనే తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా సోనియాకు సన్మానం చేసేందుకు టీపీసీసీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన చిదంబరాన్నీ రంగంలోకి దింపారు. బుధవారమే హైదరాబాద్‌కు వచ్చిన ఆయన తెలంగాణ రాష్ట్రానికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని సెంటిమెంట్‌తో కొట్టే ప్రయత్నం చేశారు. చిదంబరంతో పాటుగా తెలంగాణ బిల్లును రూపొందించిన కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేశ్ కూడా హైదరాబాద్ వచ్చారు. వీరిద్దరితో ఎన్నికల ప్రచారం చేయించడం ద్వారా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేసే ప్రయత్నానికి వ్యూహాత్మకంగా శ్రీకారం చుట్టడం గమనార్హం. బిక్షపతి యాదవ్ ఇంటికి అహ్మద్ పటేల్ శేరిలింగం పల్లి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే బిక్షపతియాదవ్‌ను ఆయన ఇంటికి వెళ్లి ఏఐసీసీ కోశాధికారి అహ్మద్ పటేల్ అనునయించారు. ఆయనకు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఏమిస్తామన్నది ఇప్పుడు చెప్పడం ధర్మం కాదని అయితే బిక్షపతి యాదవ్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనేందుకు అంగీకరించారని అహ్మద్ పటేల్ విలేకరులకు తెలిపారు.పటేల్ వెంట పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్ రెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, మధుయాష్కి తదితరులు ఉన్నారు. మహిళా నేతలతో.. ప్రచారం కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా నేతలనూ రంగంలోకి దింపింది. రాష్ట్రానికి చెందిన స్టార్‌క్యాంపెయినర్ విజయశాంతికి తోడు తమిళనాడుకు చెందిన ఖుష్బూ సుందర్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జడ్చర్లలో రోడ్‌షో చేసిన ఖుష్బూ వచ్చే వారంలో మరిన్ని చోట్ల ప్రచారం చేయనున్నారు. ఈమెతో పాటు ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితాదేవ్ కూడా ఈసారి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. -
రసీదుల్లేవు..తూకాల్లేవు..అంతా అక్రమమే
-
బాబు గ్రాఫ్ పడిపోతుందా..?
-
దగాపడిన నేతన్న
- చేనేత రుణమాఫీ మాట మరచిన చంద్రన్న - జిల్లాలో 17 వేల మందికిపైగా ఎదురుచూపులు అమలాపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమానాలో రైతు రుణమాఫీ హామీ అమలు గందరగోళానికి దారి తీస్తే.. డ్వాక్రా రుణమాఫీ హామీ ప్రకటనలకే పరిమితమైంది. మరోపక్క అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా.. చేనేత రుణమాఫీ హామీ గురించి మాట వరసకైనా ప్రస్తావించకపోవడంపై నేతన్నల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంక్షోభంలో చిక్కుకున్న నేతన్నలకు చేయూతనిచ్చేందుకు.. రుణమాఫీ చేస్తానని ఎన్నికల వేళ చెప్పి.. వారి ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని పక్కన పెట్టడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1700 పైగా కుటుంబాలు నేతపై ఆధారపడి ఉన్నాయి. వీరిలో చాలామందికి పలు బ్యాంకుల్లో రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకూ రుణాలున్నాయి. చేనేత సహకార సంఘాల్లో అత్యధిక రుణాలున్నాయి. వారంతా రుణమాఫీ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులకు ఉన్న రూ.165 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మన జిల్లాలో కార్మికులకు రూ.10 కోట్ల వరకూ రుణమాఫీ జరగాల్సి ఉంది. ఇటీవల నూలు ధరలు పెరగడం, ఆ స్థాయిలో అమ్మకాలు లేక నష్టపోవడంతో నేతన్నలకు రోజు గడవడం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో నేతన్నలు రుణమాఫీపై ఆశలు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు అధికారం చేపట్టి ఎనిమిది నెలలు గడుస్తున్నా మాఫీ ఊసే లేకుండా పోయింది. రైతు రుణమాఫీ ఆరంభించి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తూ అన్నదాతలను, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ మహిళలను బుజ్జగించుకుంటూ వస్తున్న చంద్రబాబు, నేతన్నల రుణమాఫీపై మాత్రం నోరు మెదపడంలేదు. ఆయన తీరుపై నేతన్నలు మండిపడుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేతన్నలకు రూ.312 కోట్ల రుణమాఫీ ప్రకటించారు. ఆయన హఠాన్మరణంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై వాయిదాలు మొదలు పెట్టింది. తొలుత రోశయ్య, తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి మాఫీపై దాటవేత ధోరణి అవలంబించారు. నేతన్నల ఆగ్రహం చవిచూడాల్సి రావడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.169 కోట్లు మాఫీ చేశారు. ఇంకా రూ.143 కోట్లు చేయాల్సి ఉంది. దీంతో సంబంధం లేకుండానే రాష్ర్ట విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని నేత కార్మికులకు రూ.165 కోట్ల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ హామీని విస్మరిస్తున్నారని నేతన్నలు విమర్శిస్తున్నారు. సంఘాల రుణాలూ మాఫీ చేయాల్సిందే.. చేనేత కార్మికులే కాకుండా చేనేత సహకార సంఘాలు సైతం అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. జిల్లాలో 50 వరకూ సహకార సంఘాలుండగా కేవలం పది పన్నెండు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. మిగిలిన సంఘాలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. వీటి నష్టాలు రూ.12 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. వీటిని కూడా మాఫీ చేస్తేనే కానీ చేనేత బతికి బట్టకట్టలేదని నేతన్నలు చెబుతున్నారు. సంపూర్ణ మాఫీతోనే పూర్వ వైభవం చేనేత కార్మికుల రుణాలే కాదు.. చేనేత సహకార సంఘాల అప్పులను సైతం చంద్రబాబు ప్రభుత్వం మాఫీ చేస్తేనే పూర్వ వైభవం వస్తుంది. లేకుంటే ఈ రంగం మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదముంది. గతంలో అప్కో రెండేళ్లపాటు బకాయిలు చెల్లించలేదు. అప్పటినుంచీ సంఘాలు అప్పుల్లో కూరుకుపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం వీటికి పునరుజ్జీవం ఇవ్వాల్సి ఉంది. - దొంతంశెట్టి విరూపాక్షం, చేనేత సహకార సంఘాల రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు, హసన్‌బాద తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలి రాజధాని నిర్మాణానికి సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టుగానే.. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు చంద్రబాబు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ విద్యుత్ మగ్గాలకు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు. రేషన్ కార్డుదారులకు చీర, ధోవతి ఏటా అందిస్తున్నారు. దీంతో కార్మికుడికి పని దొరుకుతోంది. నేతన్నల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్ల వరకూ మంజూరు చేసి ఖర్చు చేస్తోంది. - కటకం గణపతిరావు, చేనేత సహకార సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, బండారులంక -
మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం!
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...మంత్రుల తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆయన మంత్రులకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తున్నా మంత్రులు పట్టించుకోవటం లేదని చంద్రబాబు ఆగ్రహించినట్లు సమాచారం. 'మీలో ఎవరైనా జిల్లాల్లో రివ్యూలు చేశారా? అని ఆయన ప్రశ్నించారని, శాఖాపరమైన సమీక్షలు కూడా చేయడం లేదని, తాను చెప్పినా అమలు చేయటం లేదని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం లేదని ప్రజలు అనుకుంటున్నారని' చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది. మంత్రులు జిల్లాల్లో ఉంటే..ప్రజలకు నమ్మకం కలుగుతుందని, సొంతపనుల కోసం మంత్రులంతా హైదరాబాద్‌లో ఉండిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.