ఖమ్మం జిల్లాలో యువకుడు అనుమానాస్పద మృతి
ఖమ్మం అర్బన్ మండలంలోని పాండురంగాపురంలోని ఉపేంద్రచారి అనే యువకుడు గత అర్థరాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. తమ కుమారుడిని స్నేహితులే హతమార్చారని ఉపేంద్రచారి తల్లితండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే అతని మృతదేహన్ని పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నివేదిక వస్తే కాని ఏమి చేప్పలేమని పోలీసులు తెలిపారు. కాగా ఉపేంద్రచారి స్నేహితులను స్టేషన్కు పిలిపించి పోలీసులు విచారిస్తున్నారు.