కలాం మృతిపై పార్లమెంటు సంతాపం, వాయిదా
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి పార్లమెంటు ఉభయ సభలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాయి. చివరిక్షణం వరకూ అలుపెరగని యోధునిలా దేశం కోసం పనిచేసిన ఆయన మృతిపై పార్లమెంటు ఘనంగా నివాళులర్పించింది. విపక్ష సభ్యులు ఆయన సేవలను కొనియాడుతూ, అబ్దుల్ కలాం అకాల మరణంపట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు. ఆయన ఆకస్మిక మృతికి సంతాపం తెలుపుతూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రవేశపెట్టిన తీర్మాన్నాన్ని లోక్సభ ఆమోదించింది. అనంత రెండు నిమిషాలు మౌనం పాటించింది. తర్వాత ఆయన మృతికి సంతాప సూచకంగా సభను ఈనెల 30వ తేదీ గురువారానికి వాయిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
అటు రాజ్యసభలో కూడా అబ్దుల్ కలాం మృతికి నివాళులర్పించింది. స్పీకర్ ప్రవేశపెట్టిన సంతాప తీర్మానం ఆమోదించిన అనంతరం రేపటికి (బుధవారం) వాయిదా పడింది.