uses personal
-
పసుపు ఆరోగ్యంపై ఇంతలా ప్రభావవంతంగా పనిచేస్తుందా?
పసుపుని వంటల్లో తప్పనిసరిగా వాడుతుంటాం. ఇది యాంటీ బయాటిక్‌లా పనిచేస్తుందని, దీని వల్ల ఎలాంటి వ్యాధులు దరి చేరవనేది అందరి నమ్మకం. ఇది మంచిదని తెలసుగానీ ఎంతలా ఆరోగ్యంపై ప్రభావవంతంగా పనిచేస్తుందనేది కచ్చితంగా తెలియదు. కానీ నిపుణులు ఈ పసుపుతో ఎన్ని రోగాలు నివారించొచ్చు అని నిర్థారించి మరి చెప్పుకొచ్చారు. ముఖ సౌందర్యం నుంచి వివిధ ఆరోగ్య సమస్యలను నివారించడం వరకు ఎంతలా ప్రభావవంతంగా ఉంటుందో వివరంగా తెలిపారు. అదెలోగో సవివరంగా నిపుణుల మాటల్లో తెలుసుకుందామా..!చైనీస్, మధ్య ప్రాచ్య వంటకాల్లో పసుపుకి సుదీర్ఘమైన చరిత్రను కలిగి ఉంది. దీన్ని ప్రతిరోజూ మన ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమంటే..మంటను నివారిస్తుంది...పసుపులో కర్కుమిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆయుర్వేద నిపుణుడు అనుపమ కిజక్కేవీట్టిల్ చెబుతున్నారు. ఎన్ఎఫ్-కే8 అనే అణువు శరీరంలోని వ్యక్తిగత కణాలలోని కేంద్రకం లేదా మెదడులోకి ప్రవేశించకుండా చేస్తుంది. తద్వారా మంటను ప్రేరేపించే జన్యువులు స్పందించకుండా నిరోధిస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్లు, గాయాలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లేదా టాక్సిన్స్ వంటి వాటి వల్ల వచ్చే మంటను ఇది తగ్గిస్తుంది. కేన్సర్‌కి చెక్..కేన్సర్‌ని పసుపు ప్రభావవంతంగా నిరోధించగలదని న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పేర్కొన్నారు పరిశోధకులు. అందుకోసం దాదాపు 12 వేల మందిపై పరిశోధన చేయగా 37% సానుకూల ఫలితాలను ఇచ్చింది. ఇది ప్రభావవంతమైన యాంటీ కేన్సర్ మందుగా పనిచేస్తుందని నిర్థారించారు. ముఖ్యంగా రోమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలిపారు. అలాగే ఆయా రోగులకు చేసే కీమోథెరపీ మెరుగ్గా పనిచేసేలా ఈ పసుపులో ఉండే కర్కుమిన్ సహాయపడుతుందని చెబుతున్నారు. డిప్రెషన్‌ని నివారిస్తుంది..పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తీవ్రమైన బాధ మెదడు మధ్య పరస్పర చర్యల కారణంగా మాంద్యంకి దారితీసి యాంటిడిప్రెసెంట్ థెరపీలకు స్పందిచలేని స్థితికి చేరుకునే విధంగా చేస్తుందని వెల్లడయ్యింది. అయితే పసుపులోని కర్కుమిన్ నిరాశను నిర్మూలించే శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుందని అధ్యయనంలో గుర్తించారు. అందుకోసం 60 మంది రోగులపై అధ్యయనం చేయగా..వారంతా డిప్రెషన్ ప్రభావం నుంచి మెరుగుపడినట్లు తేలింది. ఇక్కడ వారికి డిప్రెషన్‌కి సంబంధించిన మందులతో తోపాటు వెయ్యి మిల్లిగ్రాముల చొప్పున పసుపుని కూడా అందించారు. అందువల్లే సత్ఫలితాలను పొందగలిగారనేది గ్రహించాలి. మెదడు ఆరోగ్యానికి మంచిది..అల్జీమర్స్ వ్యాదిని నివారించడంలో పసుపు పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అందుకోసం పరిశోధకులు జంతువులపై జరిపిన అధ్యయనంలో తేలింది. జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడినట్లు తెలిపారు. ఆర్థరైటిస్ సమస్యలను తగ్గిస్తుంది..కీళ్ల వ్యాధులకు సంబంధించి 100 రకాలు ఉన్నాయి. ఇవన్నీ నొప్పి, వాపు, ధృఢత్వం, చలనశీలత కోల్పోవడం వంటి వాటికి దాతితీస్తాయి. పసుపు ఇలాంటి సమస్యలకు సమర్థవంతంగా చెక్‌పెడుతుంది. శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో రోజుకు మూడు సార్లు పసుపు సారం తీసుకుంటే..ఆర్థరైటిస్ లక్షణాలు తగ్గినట్లు గుర్తించారు. నొప్పులపై పసుపు చాల ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది..దీన్ని రోజూవారి ఆహారంలో భాగం చేసుకుంటే గుండె సంబంధిత ప్రమాదాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ పసుపు క్రమ రహిత హృదయస్పందనలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఆస్పిరిన్ మాదిరిగా పసుపు రక్తాన్ని పలుచబరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. వర్కౌట్ల వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తుంది..వ్యాయామాలు, పలు వర్కౌట్లు చేసేటప్పుడూ విపరీతమైన నొప్పులు వస్తాయి. వాటిని నివారించడంలో పసుపు బేషుగ్గా పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు విపరీతమైన వర్కౌట్లు చేసే 59 మంది వ్యక్తులకు ఈ పసుపుని ఇవ్వగా ఎనిమిది వారాల తర్వాత వారిలో వ్యాయామం తర్వాత నొప్పులు తగ్గినట్లు తేలింది. ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ లక్షణాలను కంట్రోల్ చేస్తుంది..ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ (పీఎంఎస్) అనేది ఒక మృగంలా ప్రవర్తించడం లేదా విచక్షణ రహితంగా ప్రవర్తించడం. ముఖ్యంగా మహిళలు ఋతుస్రావం సమయంలో ఈ లక్షణాలు తలెత్తుతుంటాయి. అలాంటి వారికి ఋతుస్రావం వచ్చే ఏడు రోజుల ముందు, ఆ తర్వాత వరకు ఈ పసుపుని సప్లిమెంట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. వారిలో తీవ్ర కోపంతో ప్రవర్తించే లక్షణాలు కంట్రోల్ అయ్యినట్లు గుర్తించారు పరిశోధకులు. కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది..శరీరంలోని కొలస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ప్రతిరోజూ 500 మిల్లిగ్రాముల మోతాదులో పసుపు తీసుకుంటే హెచ్‌డీఎల్ కొలస్ట్రాల్‌లో 33% పెరుగుదల, సీరం కొలస్ట్రాల్ దాదాపు 12% తగ్గినట్లు తేలింది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లక్షణాలను తగ్గిస్తుంది..పెద్ద ప్రేగులను ప్రభావితం చేసే వ్యాధి. దీనికారణంగా కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. వారికి ఈ పసుపు మాత్రలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి..మైగ్రేన్ తలనొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. నిపుణుల సలహా మేరకు తగు మోతాదులో తీసుకంటే ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు.స్కిన్ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది..మొటిమలు, మచ్చలను వంటి నివారిస్తుంది. చర్మ సంరక్షణలో పసుపు చాల కీలకపాత్ర పోషిస్తుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. బరువు అదుపులో ఉంటుంది..బరువుని తగ్గించడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. నాన్‌వెజ్, అన్నం, కూరల్లో ఈ పసుపుని ఉయోగించడం వల్ల బరువు అదుపులో ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.(చదవండి: పారిస్ ఒలింపిక్స్ 2024: టీమ్ ఇండియా దుస్తులను డిజైన్ చేసేదేవరంటే..!) -
ఇలాంటి ఫీచర్ కదా కోరుకునేది.. పర్సనల్ డీటైల్స్ ఎక్కడున్నా..
Google New Feature: రోజురోజుకి టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ వినియోగం మరింత విస్తరిస్తోంది. ప్రస్తుతం మనదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా అంతర్జాలం మరింత వేగం పుంజుకుంటోంది. ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్ లేని ఇల్లు లేదంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో.. మోసాలు కూడా అదే రీతిలో పుట్టుకొస్తున్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాతో లెక్కలేనన్ని మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టడానికి ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త టెక్నాలజీలు వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తున్నట్లు, అలాంటి వాటికి నిర్మూలించి, వినియోగదారులను అప్రమత్తం చేయడానికి గూగుల్ ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ ఫీచర్ ఇప్పుడు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఇది మిగిలిన అన్ని దేశాల్లో విస్తరించనుంది. నివేదికల ప్రకారం, గత ఏడాది సెప్టెంబర్‌లో గూగుల్ 'రిజల్ట్ అబౌట్ యూ' లాంచ్ చేసింది. ఈ ఫీచర్ అనతి కాలంలోనే మొబైల్, వెబ్సైట్ వంటి వాటిలో ప్రత్యక్షమైంది. ఆ ఫీచర్ ఇప్పుడు మరింత ఆధునికంగా మారింది. ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు ఎక్కడైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ తరువాత వాటిని తొలగించడానికి కూడా వీలుంటుంది. ఇదీ చదవండి: వ్యాపార సామ్రాజ్యంలో మహిళా సారధులు - ఏం చదువుకున్నారో తెలుసా? ఇప్పటి వరకు వినియోగదారులకు సంబంధించిన వివరాలను వెతుక్కోడానికి చాలా సమయం పట్టేది. కానీ త్వరలో రానున్న గూగుల్ కొత్త ఫీచర్ యూజర్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ వంటి వ్యక్తిగత వివరాలు కనిపించిన వెంటనే ఇస్తూ.. తొలగించుకోవడానికి సహకరిస్తుంది. ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! గూగుల్ కొత్త ఫీచర్ వల్ల వ్యక్తిగత వివరాలు సులభంగా తొలగించవచ్చు, కానీ అవసరమైన చోట కూడా ఈ వివరాలు తొలగిపోతాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ వినియోగదారుడు తప్పకుండా కొన్ని ఆప్షన్స్ ఎంచుకోవడం వల్ల అలాంటి సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. -
వారు ఆడిందే ‘ఆట’
జిల్లా క్రికెట్ అసోసియేషన్‌లో నాటౌట్ బ్యాట్స్మెన్లు ఏళ్లుగా ఒకే పదవిలో కొనసాగుతున్న పెద్దలు లోథా కమిటీ సిఫారసులూ బుట్టదాఖలు ఇష్టారాజ్యంగా ఏసీఏ నిధుల వినియోగం ఏకపక్ష సెలక్షన్స్‌తో నష్టపోతున్న ప్రతిభావంతులు జిల్లా క్రికెట్ అసోసియేషన్‌ను కొందరు పెద్దలు ఏళ్లుగా తిష్టవేశారు. ఆంధ్ర క్రికెట్ (ఏసీఏ) నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు. ప్రతిభను పక్కనపెట్టి తమకు అనుకూలమైన వారినే సెలక్షన్ చేస్తుండడంతో ప్రతిభావంతులు నష్టపోతున్నారు. జనవరి 1 నుంచి లోథా కమిటీ సిఫార్సులు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్చు ఇచ్చినా వారు మాత్రం తామెప్పటికీ నాటౌట్ బ్యాట్స్మెన్లమే నంటూ గ్రౌండ్ వీడడం లేదు. - అనంతపురం సప్తగిరి సర్కిల్: క్రికెట్... మనదేశంలో ఈ క్రీడ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. రంజీకి సెలక్టయినా అటు డబ్బు..ఇటు పేరు వస్తుంది. అందుకే క్రీడాకారులంతా క్రికెట్‌ను ఎంచుకుని తమ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటారు. క్రికెట్‌కు ఉన్న ఈ క్రేజ్ చూసే క్రీడా సంఘాలూ పుట్టుకువచ్చాయి. ఇపుడు అవే పెత్తనం చేస్తున్నాయి. తాము ఆడిందే ఆటగా నడుచుకుంటున్నాయి. క్రీనీడకు లోథా బ్రేక్ ఐపీఎల్ సందర్భంగా తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు దేశంలో ఏర్పాటు చేయబడిన కమిటీ లోథాకమిటీ క్రికెట్ అసోసియేషన్లకు సంబంధించి పలు సూచనలు చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టు కూడా ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి లోథా కమిటీ సిఫారసులు అమలు చేయాలని తీర్పు చెప్పింది. లోథా కమిటీ ఏం చెప్పిందంటే -ఒక వ్యక్తి రెండు సార్ల కంటే ఎక్కువగా అధ్యక్ష, కార్యదర్శి పదవిని చేపట్టడానికి వీల్లేదు. - ఏ పదవిలో అయినా ఆరేళ్ల మించి ఉండకూడదు. - క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఏ ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగిగా ఉండకూడదు కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)కు అనుబంధంగా పనిచేస్తున్న అనంతపురం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(ఏడీసీఏ) దీన్ని లోథా కమిటీ సిఫారసులు ఏమాత్రం లెక్కచేయడం లేదు. ప్రస్తుతం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాంచో ఫెర్రర్ 2004 నుంచి 12 ఏళ్లుగా ఆ పదిలో ఉన్నారు. ఆయనతోపాటు కార్యదర్శి పదవి కూడా ఇదే తీరుగా సాగుతుండగా ఈ ఏడాది మేలో నూతన కార్యదర్శిగా కేఎస్ షాహబుద్దీన్‌ను ఎంపిక చేశారు. దీంతోపాటు ఈ సంఘంలోని ఇతర సభ్యులు ఏళ్ల తరబడి అదే కేడెర్లో ఉంటూ తమ ఆధిపత్యాన్ని సాగిస్తున్నారు. దీంతో ప్రతిభ కలిగిన ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్‌కు దూరమవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఏడీసీఏలో చాలా మంది ఏళ్లుగా పాతుకుపోవడాన్ని జిల్లాలోని పలువురు సీనియర్ క్రికెటర్లు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. జిల్లాకు ప్రాతినిథ్యం వహించి... జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడిన చాలామంది సీనియర్ క్రీడాకారులు ఉన్నారనీ, వారిని కాదని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి ఆధిపత్యం చలాయించడం పట్ల వారు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా క్రికెట్ సంఘాన్ని ప్రక్షాళన చేసి... కొత్తవారిని తీసుకుంటే క్రికెటర్లకు మేలు జరుగుతుందని పలువురు సీనియర్ క్రికెట్ క్రీడాకారులు, క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. అంతా ఆర్డీటీ కనుసన్నల్లోనే... జిల్లాలో క్రికెట్‌కు సంబంధించిన ప్రతి అంశం ఆర్డీటీ సంస్థ కనుసన్నల్లో సాగుతోంది. ఏడీసీఏ కార్యాలయాన్ని ఆర్డీటీ ప్రధాన క్రీడా మైదానంలోనే ఏర్పాటు చేశారు. ఏసీఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆరుగురు కోచ్‌లు, ఒక ఫిట్నెస్ ట్రైనర్‌కు ఏసీఏ జీతాలను అందించినా... వారు మాత్రం ఆర్డీటీ కనుసన్నల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు ఆర్డీటీ సంస్థ తన సొంత నిధులను వెచ్చించి మరో 23 మందిని నియామకం చేసుకుని జీతాలు చెల్లిస్తోంది. జిల్లాలో ఎలాంటి సెలెక్షన్ నిర్వహించాలన్నా... క్రికెట్ సమావేశం నిర్వహించాలన్నా.... ఆర్డీటీ ఆధ్వర్యంలో సాగుతుంది. వారి ప్రమేయం లేకుండా ఎలాంటి చర్యలు జిల్లాలో తీసుకోలేని పరిస్థితి తలెత్తింది. ఏసీఏ అందించిన సామగ్రిని సైతం ఆర్డీటీ క్రీడా మైదానంలో వినియోగించుకుంటున్నారని సీనియర్ క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. స్టేడియం మంజురైనా... ధర్మవరం ప్రాంతంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి పదేళ్ల క్రితం నివేదిక అందించారు. దీనికి అప్పట్లో జిల్లా కలెక్టర్ స్థలాన్ని కూడా పరిశీలించారు. అన్ని తతంగాలు పూర్తయిన తర్వాత ఫైలు ఏసీఏకు చేరింది. అయితే జిల్లా క్రికెట్ సంఘం నుంచే ఫైలును పంపించాలని ఏసీఏ తనకు అందిన ఫైలును వెనక్కు పంపింది. కానీ జిల్లా క్రికెట్ సంఘం ధర్మవరం స్టేడియం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కొందరు పెద్దలు కావాలనే స్టేడియం నిర్మాణానికి అడ్డుపడ్డారని క్రికెటర్లు ఆరోపిస్తున్నారు.