6 నెలల్లో 100 ఎకరాల అభివృద్ధి
⇔ షామీర్పేట, పటాన్చెరు, శంకర్‌పల్లిలో..
⇔ యూఎస్ఎం మై సిటీ ఎండీ నివాస్. కె
సాక్షి, హైదరాబాద్: పిల్లల చదువుకో లేక పెళ్లికో ఉపయోగపడుతుందనో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్లాట్లు కొనడం సాధారణం. అలా అని ఏదో ఒక చోట కొనడం కాదు.. అందుబాటు ధరల్లో, అభివృద్ధికి ఆస్కారముండే చోట, సమీప భవిష్యత్తులో రెట్టింపు ధర పలికే ప్రాంతాలను ఎంచుకోవాలని యూఎస్ఎం మై సిటీ ఎండీ నివాస్. కె సూచిస్తున్నారు. ఇతర డెవలపర్ల వెంచర్లు అనుమతులొచ్చాక ప్రారంభమైతే.. మా ప్రాజెక్ట్‌లు మాత్రం అనుమతులతో పాటూ వెంచర్ చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి ఆ తర్వాతే అభివృద్ధి, అమ్మకాల పనులు మొదలవుతాయని వివరించారు.
⇔ సామాన్య, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని సిటీతో కనెక్టివిటీ ఉండి అభివృద్ధికి ఆస్కారముండే ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో వెంచర్లను చేయడం మా ప్రత్యేకత. ఓపెన్ ప్లాట్లయితే కొనుగోలుదారులకు యాజమాన్య హక్కులూ ఉంటాయి. హైదరాబాద్– వరంగల్ హైవే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ముందే గ్రహించి 2013లో బీబీనగర్‌లో 25 ఎకరాల్లో మై సిటీ పేరిట తొలి ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. ఆ తర్వాత షామీర్పేట, ఆదిభట్ల వంటి పలు ప్రాంతాల్లో మొత్తం 10 వెంచర్లలో 300 ఎకరాలను అభివృద్ధి చేశాం. అన్నీ హెచ్ఎండీఏ అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లే.
⇔ వచ్చే 6 నెలల్లో 100 ఎకరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పలు వెంచర్లు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. శంకర్‌పల్లిలో 18 ఎకరాలు, పటాన్చెరులో 50 ఎకరాల్లో 2 వెంచర్లు, షామీర్పేట మార్గంలోని వర్గల్లో 30 ఎకరాల్లో మరో వెంచర్‌ను చేయనున్నాం.
⇔ ప్రస్తుతం బీబీనగర్‌లో 30 ఎకరాల్లో మై సిటీ ఫేజ్–2ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 150–300 గజాల్లో మొత్తం 350 ప్లాట్లుంటాయి. ధర గజం రూ.3,500. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్‌లైన్స్, బీటీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ వైర్లు, ప్లాంటేషన్ వంటి ఏర్పాట్లుంటాయి. వెంచర్ లొకేషన్ విషయానికొస్తే.. హైదరాబాద్–వరంగల్ హైవేకు రెండున్నర కి.మీ. దూరంలో, నిమ్స్, ఏయిమ్స్లకు దగ్గర్లో, రహేజా ఐటీ పార్క్, ఇన్ఫోసిస్ క్యాంపస్‌లకు 15 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలో ఉంది ఈ వెంచర్.
⇔ కరీంనగర్ జాతీయ రహదారిలో షామీర్పేటలోని సెలబ్రిటీ క్లబ్ ఎదురుగా 22 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. 200–300 గజాల ప్లాట్లుంటాయి. ధర గజం రూ.10 వేలు. రోడ్లు, విద్యుత్, మంచినీరు, మురుగునీటి వ్యవస్థ, పార్కు వంటి సదుపాయాలను కల్పిస్తాం. వెంచర్ లొకేషన్ చూస్తే.. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్, బిట్స్ పిలానీ, నల్సార్ లా వర్సిటీ, జెన్‌ప్యాక్ట్ సెజ్‌లకు చేరువలో ఉంది.