'17 నుంచి 19 వరకు రాచకొండ ఉత్సవాలు'
సాక్షి, హైదరాబాద్: రాచకొండ గొప్పతనాన్ని చాటేందుకు రాచకొండ పర్యాటక ఉత్స వాలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. కొందరు యువకులు రాచప్ప సమితిగా ఏర్పడి ఉత్సవాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. సోమవారం రవీంద్రభారతిలో రాచకొండ ఉత్సవాల పోస్టర్ను కర్నె ఆవిష్కరించారు.
ఈ నెల 17, 18, 19 తేదీల్లో రాచకొండ శివాలయం వద్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 13, 14 శతాబ్దాల్లో రాచకొండను రాజధాని గా చేసుకుని పాలించిన రేచర్ల పద్మ నాయ కులు అద్భుత కట్టడాలు నిర్మించారని అన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.