Uttar Pradesh Assembly Polls 2017
-
సోనియాజీకి అస్వస్థత.. మోదీ ట్వీట్
-
సోనియాజీకి అస్వస్థత.. మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: వారణాసి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియగాంధీ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆమె అర్ధంతరంగా తన రోడ్డుషోను రద్దు చేసుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ విషయం తెలియగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్లో స్పందించారు. ‘సోనియా అనారోగ్యంగా ఉన్నారని తెలిసింది. ఆమె త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను’అని మోదీ ట్వీట్ చేశారు. నరేంద్రమోదీ నియోజకవర్గమైన వారణాసి ప్రధాన టార్గెట్‌గా సోనియాగాంధీ మంగళవారం యూపీలో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వారణాసిలో ఆమె భారీ రోడ్డుషో చేపట్టారు. తద్వారా యూపీలో తమ బలాన్ని చాటే ప్రయత్నం చేశారు. ఇప్పటికే యూపీ సీఎం అభ్యర్థిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల కోసం ప్రియాంకగాంధీతోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
సోనియాకు తీవ్ర జ్వరం.. రోడ్ షోకు బ్రేక్!
వారణాసి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వారణాసిలో తలపెట్టిన రోడ్డుషో అర్ధాంతరంగా ముగిసింది. ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో రోడ్డుషోను సగంలోనే రద్దు చేయాల్సి వచ్చింది. అస్వస్థతకు గురైన సోనియా వైద్యుల సలహాపై హుటాహుటిన ఢిల్లీ విమానంలో వెళ్లిపోయారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సత్తా చాటే ఉద్దేశంతో సోనియా నేతృత్వంలో వారణాసిలో భారీ రోడ్డుషో నిర్వహించారు. అత్యంత అట్టహాసంగా వేలాదిమంది కార్యకర్తలతో ఈ రోడ్డుషో సాగింది. ఎస్వీయూలో నిలబడి పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ సోనియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని గంటలపాటు రోడ్డుషోలో పాల్గొన్న ఆమె.. రోడ్డుషో ముగిసిన అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే, రోడ్డు షో మరికాసేపట్లో ముగుస్తుందనగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్యులు ఆమెను పరీక్షించి తదుపరి కార్యక్రమాలు రద్దుచేసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో సోనియా అర్ధంతరంగా విమానంలో బయలుదేరారు. అయితే, ఆమె త్వరలోనే కోలుకొని పార్టీ ప్రచారంలో పునరుత్తేజంతో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. -
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప..!?
వారణాసి: వరుస ఎదురుదెబ్బల నడుమ గత వైభవం కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది. అందరి కన్నా ముందే పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రచారభేరిని మోగిస్తున్న ఆ పార్టీ యూపీ గడ్డపై సత్తా చాటాలని తాపత్రయపడుతోంది. అయితే, ఇదంతా ఆషామాషి విషయం కాదని హస్తం నేతలే అంగీకరిస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప యూపీ ఎన్నికల్లో తాము గట్టెక్కలేమని యూపీ పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ కుండబద్ధలు కొట్టారు. అయితే, ఆ అద్భుతం మంగళవారం వారణాసిలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రోడ్డుషోతో ప్రారంభమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ నియోజకవర్గమైన వారణాసి ప్రధాన టార్గెట్‌గా సోనియాగాంధీ మంగళవారం ప్రచార శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఇందులో భాగంగా వారణాసిలో ఆమె రోడ్డుషోలో పాల్గొంటున్నారు. 6.4 కిలోమీటర్ల దూరంపాటు ఈ బైక్ ర్యాలీ.. రోడ్డుషో జరగనుంది. అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో సోనియా ప్రసంగిస్తారు. ఈ రోడ్డు, బహిరంగ సభ ద్వారా తమ బలాన్ని చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే యూపీ సీఎం అభ్యర్థిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల కోసం ప్రియాంకగాంధీతోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.