సోనియాకు తీవ్ర జ్వరం.. రోడ్‌ షోకు బ్రేక్‌! | Sonia Gandhi Has High Fever, Roadshow In PM Modi Constituency Varanasi Halted | Sakshi
Sakshi News home page

సోనియాకు తీవ్ర జ్వరం.. రోడ్‌ షోకు బ్రేక్‌!

Published Tue, Aug 2 2016 7:08 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

సోనియాకు తీవ్ర జ్వరం.. రోడ్‌ షోకు బ్రేక్‌! - Sakshi

సోనియాకు తీవ్ర జ్వరం.. రోడ్‌ షోకు బ్రేక్‌!

వారణాసి: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వారణాసిలో తలపెట్టిన రోడ్డుషో అర్ధాంతరంగా ముగిసింది. ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో రోడ్డుషోను సగంలోనే రద్దు చేయాల్సి వచ్చింది. అస్వస్థతకు గురైన సోనియా వైద్యుల సలహాపై హుటాహుటిన ఢిల్లీ విమానంలో వెళ్లిపోయారు.

అంతకుముందు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సత్తా చాటే ఉద్దేశంతో సోనియా నేతృత్వంలో వారణాసిలో భారీ రోడ్డుషో నిర్వహించారు. అత్యంత అట్టహాసంగా వేలాదిమంది కార్యకర్తలతో ఈ రోడ్డుషో సాగింది. ఎస్‌వీయూలో నిలబడి పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ సోనియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని గంటలపాటు రోడ్డుషోలో పాల్గొన్న ఆమె.. రోడ్డుషో ముగిసిన అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే, రోడ్డు షో మరికాసేపట్లో ముగుస్తుందనగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్యులు ఆమెను పరీక్షించి తదుపరి కార్యక్రమాలు రద్దుచేసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో సోనియా అర్ధంతరంగా విమానంలో బయలుదేరారు. అయితే, ఆమె త్వరలోనే కోలుకొని పార్టీ ప్రచారంలో పునరుత్తేజంతో పాల్గొంటారని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement