వ్యభిచారం ముఠా అరెస్టు
నాగోలు: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులుఅరెస్ట్ చేశారు. వివరాలు.. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బి.భాను (34) నాగోలు మమతానగర్ రోడ్ నంబర్-02 లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు.
నిర్వాహకురాలితో పాటు ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన యువతి (25) తో పాటు విటులు నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం ఆర్కేగూడంకు చెందిన చంద్రమౌళి(38), హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ దుర్గానగర్‌కు చెందిన బొక్కా రాఘవేందర్‌రెడ్డిలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 10 వేల నగదు, ఒక బైకు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.