Vaaradhi
-
కృష్ణమ్మకు అడ్డుకట్ట
ఎగువ ప్రాంతాల్లో జోరుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తూ ప్రాజెక్టులను నింపుతూ ముందుకు ఉరకలెత్తుతున్న వేళ నీటి ప్రవాహానికి అధికారులు అడ్డుకట్ట వేస్తున్నారు. కనకదుర్గ వారధి వద్ద కృష్ణానదిలో దిగువకు నీరు వెళ్లకుండా క్రాస్‌బండ్ (అడ్డుకట్ట) నిర్మిస్తున్నారు. విజయవాడ పరిధిలోని నదిలో నీరు పుష్కలంగా నిలిచేలా చేపట్టిన ఈ చర్యల వల్ల దిగువున్న ఘాట్లకు నీరు అందని పరిస్థితి నెలకొంది. ఫలితంగా పవిత్ర స్నానానికి భంగం వాటిల్లనుంది. సాక్షి, అమరావతి : పవిత్ర కృష్ణా పుష్కరాలు మరికొద్ది గంటల్లోనే ప్రారంభంకానున్నాయి. కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు సన్నద్ధమవుతున్నారు. అయితే పవిత్ర పుష్కర స్నానానికి భంగం వాటిల్లేలా అధికారులు చర్యలు చేపట్టారు. కొద్దిరోజులుగా ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా నదికి భారీగా నీరు చేరుతోంది. ఎగువనున్న జలాశయాలు నీటితో తొణికిసలాడుతున్నాయి. అయితే కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ నుంచి వదిలే నీరు కిందికి వెళ్లకుండా ఉండేందుకు కనకదుర్గ వారధి వద్ద అధికారులు క్రాస్‌బండ్ నిర్మిస్తున్నారు. నదిలో నీట్టిమట్టం పెరగే క్రమంలో అడుకట్ట వేయడం అనాలోచిత చర్యని భక్తులు పేర్కొంటున్నారు. నీరు ఉందని చూపేందుకే.. కృష్ణానదిలో పవిత్ర స్నానాలకు ఆశించినస్థాయిలో నీరు కనిపించడం లేదనే ఉద్దేశంతోనే అడ్డుకట్ట నిర్మిస్తున్నామని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. అడ్డుకట్ట కారణంగా విజయవాడ పరిధిలోని ఘాట్లు నీటితో కళకళలాడుతాయని వారు భావిస్తున్నారు. పుష్కరాలకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 153 పుష్కర ఘాట్లు సిద్ధమవుతున్నాయి. 12 రోజులపాటు జరుగనున్న కృష్ణా పుష్కరాల్లో పవిత్ర స్నానాల కోసం వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తులు స్నానాలు ఆచరించేందుకు సరిపడా నీటిని నిల్వ చేసే పనిలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. ఆరడుగుల ఎత్తున అడ్డుకట్ట ప్రకాశం బ్యారేజీ నుంచి వదిలే నీరు దుగువకు ప్రవహించకుండా కనకదుర్గ వారధి వద్ద అడ్డుకట్ట వేస్తున్నారు. యంత్రాల సాయంతో నాలుగురోజులుగా ఈ తంతు కొనసాగుతోంది. పది పొక్లెయిన్లు, జేసీబీలతో నదిలో ఇసుకను తోడి 1200 మీటర్ల వెడల్పున ఆరడుగుల ఎత్తున అడ్డుకట్ట నిర్మిస్తున్నారు. నీటి ప్రవాహానికి ఈ కట్టకు గండిపడకుండా ఇసుక బస్తాలతో పటిష్టంచేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజ్‌లో ఉన్న నీటిని కిందికి వదిలితే 12 రోజుల పుష్కర స్నానాలకు సరిపోదనే ఉద్దేశంతోనే అడ్డుకట్ట ఏర్పాటుచేçస్తున్నారని తెలుస్తోంది. కలుషిత నీటిలో స్నానాలు ఎలా? ప్రభుత్వం చర్య పవిత్ర స్నానానికి భంగం వాటిల్లే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. నదిలో నీరు ప్రవహిస్తుంటే అందులో స్నానం చేయడం ఆరోగ్యకరమని, అడ్డుకట్ట వేస్తే నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దుర్గాఘాట్, కృష్ణవేణి ఘాట్, సీతానగరం ఘాట్ వద్ద రోజుకు 3 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసే అవకాశం ఉంది. మొదటి సారి స్నానం చేసే భక్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాకపోయినా.. ఆ తరువాత పవిత్ర స్నానాలు చేయదలచిన భక్తులు మాత్రం కలుషిత నీటిలోనే చేయాల్సి ఉంటుంది. కలుషిత నీటిలో స్నానాలు చేసిన భక్తుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కింది భాగంలో ఉన్న ఘాట్లకు నీరెలా? ప్రకాశం బ్యారేజీ కింది భాగంలో ఉన్న కృష్ణా, సీతానగరం ఘాట్ కాకుండా సుమారు 30 పుష్కర ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్ల వద్ద రోజుకు కనీసం అంటే 50 వేల మంది భక్తులు పవిత్రస్నానాలు చేసే అవకాశం ఉందిని అధికారుల అంచనా. కనకదుర్గ వారధి వద్ద నీటికి అడ్డుకట్ట వేయటంతో కింది భాగంలో ఉన్న 30 ఘాట్లకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. నీరు లేకుంటే ఆ ఘాట్లకు వెళ్లే భక్తుల పవిత్ర స్నానాలు ప్రశ్నార్థకంగా మారతాయి. అలాంటప్పుడు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ఘాట్లు ఏర్పాటు చేయటం ఎందుకని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. -
’వారధి ’టీంతో చిట్ చాట్
-
ఆ ప్రేమకు వారధి ఎవరు..?
ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగే ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం - ‘వారధి’. క్రాంతి, శ్రీదివ్య, హేమంత్ ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రాన్ని కాస్మిక్ ఇమాజినేషన్స్ పతాకంపై వివేకానంద వర్మ నిర్మిస్తున్నారు. సతీష్ కార్తికేయ దర్శకుడు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈ చిత్రం ఈ నెలాఖరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘నలుగురి బాధలో సంతోషాన్ని వెతుక్కునే హీరోకూ, నలుగురూ బాగుండాలనే హీరోయిన్‌కీ మధ్య ప్రేమకథ ఎలా నడిచిందనేది ఆసక్తికరమైన అంశం’’ అని పేర్కొన్నారు. సతీష్ కార్తికేయ మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా నాకు ఇది తొలి చిత్రం. కథ, కథనాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అందుకు తగ్గట్లే హేమంత్, శ్రీదివ్య, క్రాంతి చాలా చ క్కగా నటించారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ గొర్తి, సాహిత్యం: చైతన్య వర్మ, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్. -
వారధి మూవీ స్టిల్స్
-
'వారధి' మూవీ ట్రైలర్ లాంచ్..!
-
ప్రణయ వారధి
‘మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు’ చిత్రంలో జంటగా నటించిన క్రాంతి, శ్రీదివ్యలు గుర్తున్నారు కదా! నూతన దర్శకుడు రామరాజు దర్శకత్వం వహించిన ఆ చిత్రం మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసలు పొందింది. మళ్లీ ఈ జంట కలిసి ‘వారధి’ అనే సినిమా చేస్తున్నారు. వీరితో పాటు హేమంత్ కూడా ఇందులో ముఖ్యపాత్రధారి. కాస్మిక్ ఇమాజినేషన్స్ పతాకంపై వివేకానందవర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సతీష్ కార్తికేయ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ముక్కోణపు ప్రేమకథను దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారు. త్వరలో పాటలను, ఫిబ్రవరి రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ గొర్తి.