Vaikunta Mukkoti Ekadasi
-
నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనం సోమవారం రాత్రి ఏకాంతసేవతో శాస్త్రోక్తంగా ముగియనుంది. నిన్న 64,665 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 20,845 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.34 కోట్లు ఆదాయం వచ్చింది. తిరుమలకు రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా దేశం మొత్తం నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక శ్రీవారికి వచ్చే ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. రోజుకు సగటున శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్లు దాటుతోంది. ఈ క్రమంలోనే 2023 ఏడాదిలో తిరుమల వేంకటేశ్వరుడికి వచ్చిన మొత్తం హుండీ ఆదాయం వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. 2023 సంవత్సరంలో శ్రీవారికి హుండి ద్వారా 1402 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారికి భారీగా నగదు, ఇతర విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం ప్రతీ నెల రూ.100 కోట్లకు పైగానే సమకూరుతూ వస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు. 2023 ఏడాదిలో ప్రతీ నెలా హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను దాటినట్లు అధికారులు తెలిపారు. నూతన సంవత్సరం నాడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న పలువురు ప్రముఖులు ► శారదాపీఠం ఉత్తరధికారి సాత్మానంద సరస్వతి ► తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ ► జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా ► సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి ► డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి ► మినిస్టర్ గుమ్మనూరు జయరాం ► ఏపీ లోక్ యుక్తజడ్జ్ జస్టీస్ లక్ష్మణ్ రెడ్డి ► మినిస్టర్ మెరుగు నాగార్జున ► తమిళనాడు మినిస్టర్ గాంధీ ► హీరో సుమన్ ► తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ► ఎంపీ మోపిదేవి వెంకటరమణ -
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం… ఉచిత టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు (ఫొటోలు)
-
కోటి పుణ్యాలకు నెలవైన రోజు ‘ముక్కోటి ఏకాదశి’: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ముక్కోటి దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించుకునే పవిత్రమైన రోజు, కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి. ఆ శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ముక్కోటి దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించుకునే పవిత్రమైన రోజు, కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి. ఆ శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. #VaikuntaEkadashi — YS Jagan Mohan Reddy (@ysjagan) January 13, 2022 -
ముక్కోటి ఏకాదశి.. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరుగుతున్నాయి. కరోనా విజృంభణతో పలు ఆలయాల్లో ఆలయ అధికారులు ఆంక్షలను కూడా విధించారు. విశాఖ: వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం అప్పన్న స్వామిని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు దైవం శ్రీవరహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. భక్తుల దర్శనార్థం వైకుంఠ ద్వారంలో గరుడ వాహనంపై జగదభిరాముడు కొలువు దీరారు. తెల్లవారు జామున 5 గంటల నుంచి సీతారామలక్ష్మణుల దర్శనం కోసం భక్తజనం పోటెత్తారు. గోవింద నామ స్మరణతో కోదండ రామాలయం మార్మోగుతోంది. భక్తుల సౌకర్యార్థం కోసం అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శన భాగ్యం చేసుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా: ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్తరద్వారం గుండా స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. గోవిందనామ స్మరణలతో శేషాచల కొండ మార్మోగుతోంది. సాధారణ భక్తులు, వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రూ.100, రూ.200, రూ.500 టిక్కెట్లపై ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా: నియోజకవర్గంలో ముక్కోటి ఏకాదశి మహా పర్వదినం సందర్భంగా వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భారీ క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. పల్లెపాలెం గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశాఖ నగరంలో వైష్ణవ దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. వైభవ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయం, పెందుర్తి వేంకటాద్రి దేవాలయం, శ్రీ భూ నీల సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయం, సింహాచలం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలను విద్యుత్ దీపాలు, ప్రత్యేకమైన పూలతో సుందరంగా అలంకరించారు.. ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారినుంచే నుంచే భక్తులు దేవాలయాలకు చేరుకున్నారు.. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో దేవాలయంలోకి అనుమతికి మస్కును తప్పనిసరి చేశారు. క్యూలైన్లో ఎక్కడికక్కడ శానిటైజేషన్ చేస్తున్నారు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అప్పన్న స్వామి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో ప్రత్యేకమైన పుష్పాలతో అందంగా అలంకరించారు.. భక్తులు తెల్లవారు జాము నుంచే అప్పన్న స్వామి దర్శించుకునేందుకు సింహాచలం కొండ పైకి చేరుకున్నారు.. విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి ఉత్తర ద్వారం ద్వార స్వామివారిని దర్శించుకున్నారు.. కరోనా బారినుండి ప్రజలందరిని రక్షించాలని అప్పన్న స్వామి కోరుకుంటున్నట్లు తెలిపారు. -
తిరుమలలో ముక్కోటి ఏకాదశి
-
వైభవంగా పర్ణశాల రామయ్య తెప్పోత్సవం
దుమ్ముగూడెం, న్యూస్‌లైన్: వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో శ్రీసీతారామచంద్రస్వామి వారికి వైభవంగా గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించారు. భద్రాచలంలో వైకుంఠ ముక్కోటి ఉత్సవాలను నిర్వహించే తరుణంలో పర్ణశాల లోనూ తెప్పోత్సవం నిర్వహించారు. సీతారామచంద్రస్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా మేళతాళాడు, బాణసంచా, భక్తుల సందడి మధ్య గ్రామ పురవీధుల మీదుగా గోదావరి ఒడ్డుకు తీసుకువచ్చారు. గోదావరి తీరంలో అప్పటికే సిద్ధంగా ఉన్న హంసవాహనంలో స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుత్ కాంతులతో ముచ్చటగొలిపే హంస వాహనంపై గోదావరిలో స్వామి వారిని మూడుసార్లు తిప్పారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన జయజయద్వానాలతో ఆ ప్రాంతం మార్మోగింది. గోదావరిలో విహరించిన స్వామి వారిని 6.30 నిమిషాల సమయంలో హంస వాహనం నుంచి స్నానఘట్టాల వరకు పల్లకిలో తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు ఎన్‌బీవీఎల్‌ఎన్ ఆచార్యులు, శ్యాసం కిరణ్‌కుమారాచార్యులు, కె విష్ణువర్ధనాచార్యులు, శ్రీమన్నారాయణాచార్యులు, కృష్ణమాచార్యులు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎస్సై సత్యనారాయణ సమక్షంలో స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ ఆశాలత, స్థానిక తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విశ్వనాథసుబ్రహ్మణ్యం, ఈఓఆర్డీ అల్లాడి నాగేశ్వరరావు, కార్యదర్శి నారాయణ, విద్యుత్ శాఖ, ఇరిగేషన్, వీఆర్వోలు, వైద్య, సాక్షరభారత్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు.