vaikuntam queue complex
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు
సాక్షి, తిరుపతి: తిరుమలలలో స్వామివారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ కాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆగష్టు 31, 2023)న తిరుమల శ్రీవారిని 59, 808 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,618 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.6కోట్లుగా లెక్క తేలింది. అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చేస్తోంది టీటీడీ. ఇదీ చదవండి: సెప్టెంబర్ 18న తిరుమలకు సీఎం జగన్ -
శ్రీవారి భక్తురాలు మృతి
-
వెంకన్న దర్శనానికి వచ్చి భక్తురాలు మృతి
తిరుమల : తిరుమలలో వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు మృతి చెందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్ నెంబర్ 16లోని మరుగుదొడ్ల దగ్గర వృద్ధురాలు పడి ఉండటాన్ని గమనించిన విజిలెన్స్ అధికారులు ఆమెను హుటాహుటిన అశ్వని ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే వృద్ధురాలు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆమె మరణించిందని చెప్పారు. అయితే మృతికి కారణాలు ఏంటన్న విషయం మాత్రం ఇంకా నిర్ధారించలేదు. పోస్టుమార్టం చేస్తే గానీ కారణాలు తెలియవని అంటున్నారు. మృతురాలు తమిళనాడులోని ఆర్కాట్ జిల్లాకు చెందిన దేవికగా పోలీసులు గుర్తించారు. ఆమె అక్కడ పూలు అమ్ముకుని జీవిస్తుంటుందని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు . -
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో చిరువ్యాపారి మృతి
తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో శనివారం విషాదం చోటు చేసుకుంది. క్యూ కాంప్లెక్స్ నుంచి కిందపడి చిరువ్యాపారి గజేంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో చిరువ్యాపారులు అనుమతి లేకుండా వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు వైకుంఠం కాంప్లెక్స్‌లో శనివారం అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. దాంతో క్యూకాంప్లెక్స్‌లో వ్యాపారం చేసుకుంటున్న చిరువ్యాపారులు భయపడి నలుదిశలా పరుగులు తీశారు. ఆ క్రమంలో గజేంద్ర వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కిటికి నుంచి బయటకు దూకాడు. దాంతో గజేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిత్తూరు జిల్లా రామకుప్పంకు చెందినవాడని పోలీసులు తెలిపారు. ఆఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైకుంఠం క్యూకాంప్లెక్సులలో 108 అంగుళాల టీవీలు
తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్సులోని మొత్తం 32 కంపార్టుమెంట్లలో 108 అంగుళాల టీవీలను ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. అలాగే.. శని, ఆదివారాల్లో రద్దుచేయాలని తలపెట్టిన దివ్యదర్శనాన్ని యథాతథంగా కొనసాగించాలని కూడా నిర్ణయించింది. శుక్రవారం తిరుమలలో సమావేశమైన టీటీడీ పాలకమండలి ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. వేసవికాలంలో నీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తిరుపతి మున్సిపాలిటీ నుంచి రోజుకు ఏడు మిలియన్ గ్యాలన్ల నీళ్లను కొనుగోలు చేస్తారు. శ్రీవారి ప్రసాదం తయారుచేసే పోటులో 472 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని 2016 వరకు కొనసాగించడానికి ఆమోదించారు. కేజీ రూ. 42 చొప్పున 6. 32 కోట్ల కేజీల బియ్యం కొనుగోలుకు ఆమోదం తెలిపారు. శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాద నివారణకు 186 మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఏర్పాటును ఆమోదించారు. అలాగే, ఎంఎంపీసీ నుంచి 15 వేల శ్రీవారి వెండి డాలర్ల కొనుగోలుకు ఆమోదం తెలిపారు.