vajrakaruru
-
వజ్రాల కోసం పొలాల జల్లెడ
ఒక్కటి...ఒక్కటంటే ఒక్కటి దొరికితే జీవితమే మారిపోతుంది. అందుకే జనమంతా ఆ ఒక్కటి కోసం ఎర్రనేలలను జల్లెడ పడుతున్నారు. మిరిమిట్లు గొలిపే వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఏటా లాగే ఈ సారి కూడా తొలకరి పలకరించగానే వజ్రకరూరు ప్రాంతంలో వజ్రాల వేట ప్రారంభమైంది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం తరలిరావడంతో పొలాలన్నీ జనంతో నిండిపోయాయి. సాక్షి, వజ్రకరూరు: వజ్రాలకు పేరుగాంచింది...వజ్రకరూరు. అందుకే ఏటా తొలకరి వర్షాలు కురవగానే ఇక్కడ ఆశల వేట ప్రారంభమవుతుంది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా పొలాల్లో వజ్రాల వెతుకులాటలో నిమగ్నమవుతుంటారు. దొరికిన వారి జీవితాలే మారిపోగా...ఎప్పటికైనా అదృష్టం తలుపుతట్టకపోతుందా...ఓ రంగురాయి తమ జీవితం మార్చకపోతుందా అని ఏళ్లుగా వెతులాడే వారే ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడి వజ్రాలకు భారీ డిమాండ్ వజ్రకరూరు ప్రాంతంలో లభించే వజ్రాలకు మార్కెట్లో భారీ రేటు పలుకుతోంది. ఇక్కడి పొలాల్లో ఏటా 10 నుంచి 20 వరకు వజ్రాలు దొరుకుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల వజ్రకరూరు పరిసర ప్రాంతంలో మోస్తరు జల్లులు కురిశాయి. దీంతో వారం రోజులుగా ఉదయాన్నే స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వజ్రకరూరు పరిసర ప్రాంతంలోని పొలాలకు చేరుకుని వజ్రాలకోసం వెతుకులాటలో నిమగ్నమవుతున్నారు. పొలాల్లో విత్తనం వేసేంతవరకు ఈ వజ్రాల వేట కొనసాగుతుందని ఇక్కడి వారు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనే అన్వేషణ వర్షం కురిసినప్పుడు పైభాగంలోనుంచి నీరుకిందకు ప్రవహిస్తూ ఒక ప్రాంతంలోనికి చేరి...అక్కడే ఇంకిపోతుంది. ఈ క్రమంలో నీటి వెంట వజ్రాలు వస్తాయని ఇక్కడి వారి నమ్మకం. అందుకే పొలాల్లోని లోతట్టు ప్రాంతాల్లోనే వజ్రాల అన్వేషణ ఎక్కువగా జరుగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు ఇక్కడ ఎవరికైనా వజ్రం లభిస్తే గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయిస్తారు. లేదంటే వజ్రకరూరు పరిసరాల్లోనే తిష్టవేసిన వ్యాపారులకు అమ్ముకుంటారు. ఇలా కొనుగోలు చేసిన వజ్రాలను వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అత్యధిక ధరకు అమ్ముకుంటుంటారు. గత ఏడాది కూడా ఈప్రాంతంలో రూ.లక్షలు విలువచేసే వజ్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. -

పదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం
వజ్రకరూరు : గొర్రెలు మేపడానికి పొలానికెళ్లిన అవ్వకు భోజనం ఇచ్చేందుకు వెళ్లిన ఓ బాలిక (10)పై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన శనివారం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్దతండాలో చోటుచేసుకోగా.. ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వెంకటాంపల్లి పెద్దతండాకు చెందిన పదేళ్ల బాలిక శనివారం ఉదయం పొలంలో గొర్రెలు మేపేందుకు వెళ్లిన అవ్వకు భోజనం ఇచ్చేందుకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. మార్గమధ్యలోనే అదే గ్రామానికి చెందిన డాక్యానాయక్ అనే యువకుడు బాలికను అడ్డగించి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. బాలిక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం డాక్యానాయక్ అక్కడి నుంచి పారిపోయాడు. అటువైపు వెళుతున్న కొందరు గొర్రెలకాపరులు బాలికను గమనించి వెంటనే గ్రామస్తులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. బాలికను ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గుంతకల్లు డీఎస్పీ ఖాసీంసాబ్, వజ్రకరూరు ఎస్ఐ ఇబ్రహీం, మహిళా ఏఎస్ఐ మంజుల తదితరులు ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం గ్రామంలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వజ్ర వంకర్లు!
వజ్రకరూరు వాటర్‌షెడ్‌లో చీకటి కోణం - ఎస్సీ, ఎస్టీలకు రుణాల పేరిట టోకరా - రూ.అరకోటి నిధులతో ఇష్టారాజ్యం - రూ.10లక్షలకు రికార్డులే కరువు - క్షేత్ర స్థాయిలో కనిపించని యూనిట్లు - సభ్యులకు తెలియకుండా నేతల నాటకం అనంతపురం టౌన్ : ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతుల పెంపు లక్ష్యంగా సమగ్ర వాటర్‌షెడ్ యాజమాన్య కార్యక్రమాలు చేపట్టాలి. ఆస్తులు లేని వ్యక్తుల జీవనోపాధికి ప్రత్యేకంగా వాటర్షెడ్కు కేటాయించిన నిధుల్లోంచి 9 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ వజ్రకరూరు వాటర్‌షెడ్ పరిధిలోని గ్రామాల్లో రుణాల మంజూరు, యూనిట్ల ఏర్పాటులో అధికార పార్టీ నేతలు, వాటర్‌షెడ్ అధికారులు మాయాలోకాన్ని సృష్టించారు. లైవ్లీ హుడ్(ఎల్‌హెచ్)కు రూ.49.33 లక్షలు కేటాయించగా ఈ మొత్తం ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నా.. యూనిట్ల ఏర్పాటులో మతలబు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎక్కడికక్కడ బినామీ పేర్లతో నిధులు బొక్కేశారు. రూ.10 లక్షల ఖర్చుకు కనీస రికార్డులు కూడా లేని దుస్థితి. బోడిసానిపల్లి పరిధిలో 28 మందికి గొర్రెలు, మేకలు, ఎనుములు, ఎద్దుల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.10వేల నుంచి రూ.25 వేల వరకు రుణాలను మహిళా సంఘాల్లోని సభ్యులకు ఇచ్చినట్లు చూపించారు. ఇక్కడ తులసీభవాని సంఘానికి చెందిన కమలమ్మకు వ్యవసాయ అవసరాల కోసం రూ.15 వేలు మంజూరు చేసినట్లు చూపి తీసిన ఫొటోనే మరో గ్రామంలోని లబ్ధిదారుల జాబితాలో ఉంచారు. యూనిట్లతో కలిసి తీసిన ఒకే ఫొటోను ఆరేడుగురు పేర్లతో రుణం మంజూరు చేసినట్లు అప్లోడ్ చేశారు. తట్రకల్లు పరిధిలో 61 మంది బోర్వెల్, దుస్తుల దుకాణం, గొర్రెలు, ఎనుముల కోసం మంజూరు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఆంజనేయస్వామి, ఇందిర, చరిత, ఝాన్సీ, మదర్‌థెరిస్సా, ప్రియాంక, స్వర్ణ, విజయ తదితర సంఘాల్లోని సభ్యులకు రుణం ఇచ్చినట్లు చూపుతున్నా.. చాలా వరకు అవి అందని పరిస్థితి. గంజికుంట పరిధిలో 57 మందికి రుణాలు మంజూరు చేసినట్లు పేర్కొనగా.. అంజినమ్మ పేరుతోనే నాలుగైదు రుణాలు ఉన్నాయి. 620844667487 ఆధార్ నంబర్ అంజినమ్మదిగా పేర్కొంటూ.. అదే ఆధార్ నంబర్‌పై మంగమ్మ అనే మహిళకు రుణం మంజూరు చేసినట్లు చూపి నిధులు మింగేశారు. నల్లబోతుల అనే మహిళ పేరుతో నాలుగు లోన్లు ఇచ్చి ఒకచోట శాంతి సంఘం, మరోచోట ఇందిరా సంఘానికి చెందిన మహిళగా పేర్కొన్నారు. ఎన్‌ఎన్‌పీ తండాలో తొమ్మిది మందికి ఇవ్వగా ఇక్కడా అదే పరిస్థితి. ఇక్కడికి కేటాయించిన నిధులను తట్రకల్లులోని సభ్యులకు ఇచ్చినట్లు చూపి నిధులు భోంచేశారు. రాగులపాడులో 12 మందికి మంజూరు చేశామనే లెక్కల్లో చాలా వరకు కూడా బోగస్‌వే. వజ్రకరూరులో 42 మందికి రుణాలిచ్చినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఆశాజ్యోతి సంఘంలోని ఎన్.జ్యోతికి రూ.25 వేలను వ్యవసాయ పనుల కోసం మంజూరు చేశామని పేర్కొంటూ తీసిన ఫొటోనే అదే సంఘంలోని శాంతమ్మకు రూ.25 వేలు మంజూరు చేసినట్లు చూపారు. శాంతి సంఘానికి చెందిన మద్దికెరికి గొర్రెల కోసం రూ.14 వేలు రుణం.. లక్ష్మిసువర్ణ సంఘానికి చెందిన విమలమ్మకు ఆటో, జీపు, ట్రాలీ రిపేరి షాప్ కోసం రూ.25 వేలు రుణం ఇచ్చినట్లు చెప్పినా ఫొటో మాత్రం గొర్రెలది చూపడం గమనార్హం. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. తవ్విన కొద్దీ అక్రమాల బాగోతం వెలుగు చూస్తోంది. రుణం మంజూరు చేసినట్లు అధికారులు చూపుతున్న జాబితాలోని కొందరికి ‘సాక్షి’ ఫోన్ చేయగా అసలు తమకెలాంటి రుణాలు అందలేదని పేర్కొన్నారు. నా కోడలు పేరుతో రుణం ఇచ్చారంట మూడేళ్లుగా నా కొడుకు ఆదినారాయణ, కోడలు లక్ష్మిలు బెంగళూరులో ఉంటున్నారు. ఇటీవల సామాజిక తనిఖీ బృందం అధికారులు వచ్చి నా కోడలు పేరు మీద రుణం మంజూరైందని చెప్పారు. అప్పటి వరకు నాకా విషయమే తెలీదు. ఇదే విషయాన్ని వారికి రాసిచ్చాను. – మస్తానమ్మ, తట్రకల్లు నా పేరు మీద మంజూరైందట మొన్నామధ్య అధికారులు వచ్చి నా పేరుతో రుణం మంజూరైంది కదా అని అడిగారు. ఒక్కసారిగా షాక్ అయ్యా. నాకు తెలియకుండా ఎలా మంజూరు చేశారో అర్థం కాలేదు. ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారో తెలీదు. నా ప్రమేయం లేకుండా ఎలా మంజూరు చేశారో. – శాంతమ్మ, తట్రకల్లు రికార్డుల్లో ఉందంట సామాజిక తనిఖీ జరిగే సమయంలో నా పేరుతో రుణం మంజూరైందని అధికారులు చెప్పగానే ఆశ్చర్యపోయాను. రికార్డుల్లో ఉందని వాళ్లు చెప్పారు. నేనెలాంటి రుణం తీసుకోలేదు.. ఎవరూ ఇవ్వలేదని చెప్పా. – శాంతి, తట్రకల్లు -
జిల్లాలో తేలికపాటి వర్షం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఆదివారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. వజ్రకరూరులో 27.2 మి.మీ, ఓడీ చెరువు 17.6 మి.మీ, గుంతకల్లు 14 మి.మీ నమోదు కాగా నల్లమాడ, నల్లచెరువు, తనకల్లు, అమడగూరు, తాడిపత్రి, యాడికి, గుత్తి, పెద్దపప్పూరు తదితర 30 మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 58.7 మి.మీ. నమోదైంది. అరకొర పదునులోనే చాలా ప్రాంతాల్లో రైతులు ఏరువాక కొనసాగిస్తున్నారు. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
ఉపాధి పనుల కల్పనలో నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజం వజ్రకరూరు : ప్రజలచేత ఎన్నిౖకెన సర్పంచులను డమ్మీలను చేస్తూ గ్రామసభల నిర్వహణను జన్మభూమి కమిటీలకు అప్పగించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఉరవకొండ మండలం వ్యాసాపురంలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటన్నింటినీ పక్కనపెట్టి కలెక్టర్ల సమావేశంలో ఊకదంపుడు ఉపన్యాసాలకు ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు. రాజ్యాంగం ద్వారా సర్పంచులకు కల్పించిన అధికారాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా కాలరాస్తోందని విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ పథకం నిధులు పుష్కలంగా ఉన్నా కూలీలకు పనులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులు, ఇ¯ŒSపుట్ సబ్సిడీ మంజూరులో తాత్సారం చేస్తోందన్నారు. టీడీపీ పాలనలో మహిళా సంఘాలు నిర్వీర్యమైపోయాయన్నారు. కరువు ఉపశమన చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమైందన్నారు. ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉరవకొండ మండల అధ్యక్షుడు వెలిగొండ నరసింహులు, జెడ్పీటీసీ తిప్పయ్య, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్రకార్యదర్శి బసవరాజు తదితరులు పాల్గొన్నారు.