బదిలీపై అసంతృప్తి, నాగాలాండ్ గవర్నర్ రాజీనామా
నాగాలాండ్: నాగాలాండ్ గవర్నర్ వాక్కోమ్ పురుషోత్తమన్ తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. మిజోరం గవర్నర్‌గా వ్యవహరిస్తున్న పురుషోత్తమన్‌ను నాగాలాండ్ గవర్నర్‌గా రాష్ట్రపతి బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా తనను సంప్రదించకుండా నాగాలాండ్‌కు బదిలీ చేయటంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పురుషోత్తమన్ వెల్లడించారు. నరేంద్ర మోడీ సర్కార్ అధికారం చేపట్టిన తరువాత దేశవ్యాప్తంగా గవర్నర్ల బదిలీలు జరిగాయి.