విలువలను పెంపొందించే సినిమాలు అవసరం
నీతి నిజాయితీలను పెంపొందించే చిత్రం‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’
దర్శకుడు ఆర్.నారాయణమూర్తి
మధురపూడి :
మానవ విలువలను పెంపొందించే సినిమాలు సమాజాభివృద్ధికి దోహదపడతాయని ప్రముఖ సినీ కథానాయకుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. సోమవారం హైదరాబాద్ వెళ్లేందుకు రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన ఆయన ఉదయం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మానవ విలువలు ఆర్థిక విలువలను అధిగమిస్తాయన్నారు. ఈనెల 14న విడుదలైన హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా నీతి, నిజాయితీలకు ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. వెంకట్రామయ్య అవినీతిపై నిరంతరం పోరాడి విజయం సాధిస్తాడన్నారు. పై అధికారుల తప్పుడు నిర్ణయాలను, ఆర్థిక సమస్యలు చేధించడమే ఇతివృత్తంగా తీసుకున్నట్టు చెప్పారు. వ్యవస్థపరంగా, రాజకీయపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎలా అ«ధిగమిస్తాడనేది సారాంశంగా నిలుస్తుందని, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తుందన్నారు. సినిమాలో ప్రముఖ సినీనటి జయసుధ కథానాయికగా నటించగా, దర్శకనిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సినిమాను అద్భుతంగా రూపొందించారన్నారు.
నదులు అనుసంధానం కావాలి
ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కె.ఎల్.రావు చెప్పినట్టు గంగ నుంచి గోదావరి వరకు నదులు అనుసంధానం ద్వారా దే శం సస్యశ్యామలం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గో దావరి, కృష్ణ, పెన్న నదులను అనుసంధానం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి, ఏలేరు, నాగవళి, గోస్తని నదులను అనుసంధానం చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్య లు చేపట్టాలన్నారు. ముందుగా ఎయిర్‌పోర్టు రోడ్డులో ఆయన వాకింగ్ చేసి హల్చల్సృష్టించారు. ఆదివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన సోమవారం ఉదయం స్పైస్‌జెట్ విమానంలో హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. ఆయనకు బూరుగుపూడి మాజీ సర్పంచ్ కంటే వీరవెంకటసత్యనారాయణ వీడ్కోలు తెలిపారు.