Vanchana Pai Garjana meeting
-
కాకినాడ : వంచనపై గర్జన
-
తాన అంటే ఎల్లో మీడియా తందాన అంటోంది
కాకినాడ: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాన అంటే ఎల్లో మీడియా తందాన అంటోందని వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాక్యానించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వంచనపై గర్జన దీక్షలో మాట్లాడుతూ...నాలుగేళ్లు చంద్రబాబు బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు కాంగ్రెస్‌తో జత కట్టారని తీవ్రంగా విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు వంచన చేస్తూనే ఉన్నారని అన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్రానికి చెడ్డ రోజులు మొదలయ్యాయని చెప్పారు. దేశంలోనే నెంబర్ వన్‌గా ఎదుగుతున్న రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని దుయ్యబట్టారు. తనకు ఏది అవసరమో చంద్రబాబు అదే చేస్తారు కానీ పేద ప్రజల పరిస్థితిని పట్టించుకోరని తెలిపారు. ప్రజలు గమనించకపోతే మళ్లీ మోసపోతామని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చంద్రబాబుకు రాజకీయ విలువలు లేవని, బీజేపీ, పవన్‌తో కలిసి అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీయే మిన్న అని పలుసార్లు చంద్రబాబు అన్న మాటలను గుర్తు చేశారు. వైఎస్ జగన్‌కు వస్తోన్న ఆదరణ చూసి బాబు యూటర్న్ తీసుకున్నారని వెల్లడించారు. చంద్రబాబు వల్ల రాష్ట్రం అప్పులపాలైందని వ్యాక్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు పదవులను తృణప్రాయంగా త్యాగం చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యింటే ఈపాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్‌పై హత్యాయత్నానికి బాబు కుట్ర: వైవీ సుబ్బారెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వస్తోన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక జగన్‌ను అంతమొందించాలని బాబు కుట్ర పన్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వంచనపై గర్జన దీక్షలో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. ప్రతిరంగంలోనూ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం విషయంలో హామీలిచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనతో ఏపీ చాలా నష్టపోయింది.. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని భావించి వైఎస్సార్సీపీ పోరాడుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేశామని, పార్లమెంటు లోపల, బయటా కూడా పోరాటాలు చేశామని చెప్పారు. ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులో 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి గుర్తు చేశారు. చివరకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షలు చేశామని వెల్లడించారు. హోదా వచ్చేవరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. జగన్‌కు వస్తోన్న ఆదరణ చూసి బాబు మళ్లీ యూటర్న్ తీసుకున్నారని అన్నారు. ధర్మపోరాట దీక్ష పేరుతో బాబు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు డ్రామాకు తెరలేపారని వ్యాక్యానించారు. -
రాజధానిలో అన్నీ తాత్కాలికమే: ఆనం
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, సోనియా ఇటలీ దెయ్యం అని గత ఎన్నికల సమయంలో చెప్పి ఇప్పుడదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాకినాడలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆనం మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు కూడా మాయమాటలు చెబుతూ మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. చంద్రబాబుతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజధానిలో శాశ్వత భవనాలు ఉండవు..అన్నీ తాత్కాలికమేనని, తాత్కాలిక రాజధానితో రాజధాని లేకుండా బాబు తీర్చిదిద్దారని తీవ్రంగా మండిపడ్డారు. కనీసం పోస్టల్ పిన్‌కోడ్ కూడా తెచ్చుకోలేని పరిస్థితికి బాబు తెచ్చారని విమర్శించారు. బీజేపీతో ఉన్నన్ని రోజులూ నవ నిర్మాణ దీక్షలు..ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి మరో పోరాటం అంటూ మోసానికి తెరలేపారని అన్నారు. బాబు విద్యార్ధి దశ నుంచే వంచన చేస్తూ వచ్చారని, రాజకీయాల్లో ఆనాడు కాంగ్రెస్‌ను వంచించారని వ్యాక్యానించారు. అధికారం ఇచ్చిన ముఖ్యమంత్రులను, చేరదీసి కుటుంబంలో సభ్యుడిగా చేసుకున్న ఎన్టీఆర్‌ను కూడా వంచించారని ఆరోపించారు. ఏపీని విభజించండి అభ్యంతరం లేదని కాంగ్రెస్‌కు లేఖ ఇచ్చి, మళ్లీ ప్రజల వద్దకు వచ్చి రెండు కళ్ల సిద్ధామంతమంటూ డ్రామాలాడారని తీవ్రంగా దుయ్యబట్టారు. వైఎస్ జగనే లక్ష్యంగా బాబు పాలన: మోపిదేవి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డే లక్ష్యంగా చంద్రబాబు పాలన చేశారు తప్పితే పేద ప్రజల పరిస్థితి మెరుగుపడేందుకు ఏనాడూ చేయలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అధోగతిపాలు చేశారని, ఏపీ పరువు ప్రతిష్టలను చంద్రబాబు దిగజార్చారని మండిపడ్డారు. రైతులు, యువత, మహిళలను ఏ మాత్రం కూడా చంద్రబాబు పట్టించుకోలేదని, బీజేపీతో కలిసున్నన్ని రోజులూ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనే తేలేదని అన్నారు. హోదాను అవహేళన చేసింది బాబే: వర ప్రసాద్ ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదాపై పోరాడదామని పిలుపునిచ్చినపుడు హోదాను చంద్రబాబు అవహేళన చేశారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వర ప్రసాద్ గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా అంటున్నారని మండిపడ్డారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాం..రాజీనామాలు చేసి ఢిల్లీలో వారం రోజుల పాటు ఆమరణ దీక్షలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తుంది వైఎస్సార్సీపీయేనని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో అంశాలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. ఏపీ విభజనకు బాబే కారణం: రౌతు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్సీపీ నేత రౌతు సూర్యప్రకాశ రావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల డబ్బు కాజేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనేత వైఎస్సాఆర్ ఒక్కరేనని కొనియాడారు. -
పవన్ తాను చిరంజీవి తమ్ముడినని చెప్పుకోలేక..
కాకినాడ: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తాను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడినని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.శుక్రవారం కాకినాడలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో అనిల్ కుమార్ మాట్లాడుతూ..ఓట్ల కోసమే తాను కానిస్టేబుల్ కుమారుడినని పవన్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. చిరంజీవి పేరు చెప్పుకోలేని పవన్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రతి సభలోనూ కులాన్ని ప్రస్తావించే నాయకుడే పవన్ కల్యాణ్ అని తీవ్రంగా దుయ్యబట్టారు. పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. వైఎస్ జగనే లక్ష్యంగా టీడీపీ, కాంగ్రెస్, జనసేనలు పని చేస్తున్నాయని, ప్రజలు జాగరూకతతో వచ్చే ఎన్నికల్లో ఓట్లేయాలని కోరారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది వైఎస్సార్, ఎన్టీఆర్‌లేనని చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తమ పప్పులుడకవని టీడీపీ, కాంగ్రెస్‌లతో పాటు జనసేనలు లోపాయకారిగా జతకట్టాయని ఆరోపించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే హుందాగా నడుచుకుంటూ వెళ్లిన సంగతి గుర్తు చేశారు. వైఎస్ జగన్ పేరు వింటేనే చంద్రబాబు వణికిపోతున్నారని, దొంగకూటమిని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఒక్క అవకాశం వైఎస్ జగన్‌కు ఇస్తే తండ్రిని మించిన పాలన అందిస్తారని అన్నారు. బాబు పాలనలో దళితులపై దాడులు: మేరుగ చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగాయని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. వంచనపై గర్జన దీక్షలో మాట్లాడుతూ..దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి బాబు మర్చిపోయారని, వైఎస్సార్ హయాంలోనే దళితులకు లాభం జరిగిందని అన్నారు. వైఎస్ జగన్‌తోనే దళిత సంక్షేమం సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దళితులపై బాబుకు విశ్వాసం లేదని, దళిత కాలనీలకు బాబు వచ్చినప్పుడు నిలదీయాలని పిలుపునిచ్చారు. దేశంలోని కానీ, రాష్ట్రంలో కానీ చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని, మీడియాను అడ్డం పెట్టుకుని 2019లో బాబు ఎన్నికలకు వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హోదాపై అనేక యూటర్న్లు తీసుకున్నది చంద్రబాబేనని, హోదా ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై చంద్రబాబు కేసులు పెట్టించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి నిజంగా పోరాడుతున్నది వైఎస్ జగన్ మాత్రమేనని చెప్పారు. నిరుద్యోగులకు బాబు రూ.2 లక్షల కోట్లు బాకీ: జక్కంపూడి నాలుగేళ్ల పాలనలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు దొరికిన కాడికి దోచుకున్నారని వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజా ఆరోపించారు. అధికారంలోకి రాగానే కొన్ని వేల ఉద్యోగాలు పీకేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి అందరి ఉద్యోగాలు పీకేయించి లోకేష్ మాత్రం జాబు ఇప్పించారని తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారని, నిరుద్యోగులకు రూ.2 లక్షల కోట్లు బాబు బాకీ పడ్డారని వెల్లడించారు.