vangirapu Srinatha Chari
-
జాతీయాలు
Die with one's boots on అర్థం: Die with one's boots on = To die while still active in one's work or while doing a job. వాక్య ప్రయోగం: The man worked hard all his life and died with his boots on when he had a heart attack at the factory అతడు జీవితకాలమంతా కష్టపడి పనిచేసి, దృఢంగా, యవ్వనంలో ఉన్నప్పుడే కర్మాగారంలో గుండెపోటుతో మరణించాడు. వివరణ: ఈ జాతీయం 19వ శతాబ్దం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. పశ్చిమ అమెరికాలో కౌబోయ్స్ మధ్య జరిగే యుద్ధంలో ప్రత్యర్థి బందీగా దొరికితే అతడిని కాల్చి చంపడమో, ఉరి తీయడమో చేసేవారు. సాధారణంగా కౌబోయ్స్ యుక్త వయస్కులై, యూనిఫాం, షూ ధరించి దృఢంగా ఉండేవారు. ‘యవ్వనంలోనే మరణించు’, ‘ఉద్యోగం చేస్తున్న యుక్తవయసులోనే చనిపోవు’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడతారు. I never want to retire - I'd rather die with my boots on అంటే ‘నాకు రిటైర్మెంటు ఇష్టం లేదు. బతికున్నంతకాలం పనిచేస్తూనే ఉండాలని ఉంది’ అని అర్థం. విస్తృతార్థంలో ఈ జాతీయాన్ని To die while actively occupied/ emp- loyed/ working or in the middle of some action అని చెప్పవచ్చు. - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి email: vschary@gmail.com -
ఒక వ్యక్తి జన్మదినం
In one's birthday suit అర్థం : In one's birthday suit = in complete nakedness; with no clothes on వాక్య ప్రయోగం: The cute little boy was lying in bed in his birthday suit. ముద్దుల చిన్నారి బాబు దిగంబరంగా (నగ్నంగా) పడక మీద పడుకుని ఉన్నాడు. వివరణ: ఈ జాతీయం ఇంగ్లండులో 18వ శతాబ్దంలో పుట్టింది. ఆ కాలంలో రాజును పుట్టిన రోజున అభినందించడానికి వెళ్లేవారు అందమైన దస్తులు ధరించేవారు. మామూలు దుస్తులు ధరిస్తే రాజును అవమానపరచినట్టుగా భావించేవారు. క్రమం గా ఈ జాతీయం పూర్తి వ్యతిరేకార్థాన్ని పొందింది. పదాలు, పదబంధాలు కాలక్రమేణా పూర్తి వ్యతిరేకార్థాన్ని పొందడాన్ని ఆంగ్లంలో The process of change of meaning అంటారు. ఒకప్పుడు ఆంగ్లంలో great అంటే very big (చాలా పెద్ద) అనే అర్థం ఉండేది. ఇప్పుడు eminent, distinguished (గొప్ప, ఖ్యాతిగాంచిన) అనే అర్థాలతో జట్ఛ్చ్టను వాడుతున్నారు. ‘దిగంబరంగా’, ‘నగ్నంగా’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడతాం. The patient was forced to be in his birthday suit for his medical exam అంటే వైద్య పరీక్ష కోసం రోగిని నగ్నంగా ఉండాలని బలవంతపెట్టాల్సి వచ్చిందని అర్థం. - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి email: vschary@gmail.com -
జాతీయం
Those three little words అర్థం: Those three little words = The words ''I love you'' వాక్య ప్రయోగం: After several months of dating the young man finally said those three little words to his girlfriend. ఎన్నో నెలల ప్రేమ వ్యవహారం తర్వాత చివరకు ఆ యువకుడు తన ప్రియురాలికి ‘ఐ లవ్ యూ’ అనే ప్రేమ మాటలు చెప్పాడు. వివరణ: మనలో చాలా మంది ప్రేమిస్తారు. ప్రేమించే వారిలో కుటుంబ సభ్యులు, భార్య లేదా భర్త, స్నేహితులు, ప్రియుడు లేదా ప్రియురాలు ఎవరైనా ఉండొచ్చు. ప్రియుడు, ప్రియురాలికి సంబంధించి sensuous/sensual love, platonic love అని రెండు రకాల ప్రేమ గురించి ఆంగ్లంలో ప్రస్తావిస్తారు. sens- uous/ sensual love శారీరక ఆకర్షణకు సంబంధించింది. ఇది ఇంద్రియాల స్పంద నకు లోనై ఉంటుంది. గ్రీకు తత్వవేత్త ప్లేటో platonic love ను ఇంద్రియాలకు అతీతమైందిగా నిర్వచించాడు. ‘ఐ లవ్ యూ(నేను నిన్ను ప్రేమిస్తున్నాను) అనే ఆ ప్రేమ మాటలు’, ‘ఐ లవ్ యూ అనే ఆ మూడు ఇంగ్లిషు ప్రేమ ముక్కలు’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడుతున్నాం. Almost in all movies, hero and heroine would eagerly wait for hearing those three little words from each other. అంటే దాదాపు అన్ని సినిమాల్లో కథానాయకుడు, కథా నాయకురాలు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే ఆ మూడు ప్రేమ మాటల్ని ఒకరి నుంచి ఒకరు వినడానికి ఉవ్విళ్లూరు తుంటారని అర్థం. - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి email: vschary@gmail.com