ఒక వ్యక్తి జన్మదినం | In one's birthday suit | Sakshi
Sakshi News home page

ఒక వ్యక్తి జన్మదినం

Published Fri, Apr 25 2014 10:23 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఒక వ్యక్తి జన్మదినం - Sakshi

ఒక వ్యక్తి జన్మదినం

In one's birthday suit

 అర్థం :
 In one's birthday suit = in complete nakedness; with no clothes on
 
వాక్య ప్రయోగం:
The cute little boy was lying in bed in his birthday suit. ముద్దుల చిన్నారి బాబు దిగంబరంగా (నగ్నంగా) పడక మీద పడుకుని ఉన్నాడు.
 
 వివరణ:
ఈ జాతీయం ఇంగ్లండులో 18వ శతాబ్దంలో పుట్టింది. ఆ కాలంలో రాజును పుట్టిన రోజున అభినందించడానికి వెళ్లేవారు అందమైన దస్తులు ధరించేవారు. మామూలు దుస్తులు ధరిస్తే రాజును అవమానపరచినట్టుగా భావించేవారు. క్రమం గా ఈ జాతీయం పూర్తి వ్యతిరేకార్థాన్ని పొందింది. పదాలు, పదబంధాలు కాలక్రమేణా పూర్తి వ్యతిరేకార్థాన్ని పొందడాన్ని ఆంగ్లంలో The process of change of meaning అంటారు. ఒకప్పుడు ఆంగ్లంలో great అంటే very big (చాలా పెద్ద) అనే అర్థం ఉండేది. ఇప్పుడు eminent, distinguished (గొప్ప, ఖ్యాతిగాంచిన) అనే అర్థాలతో జట్ఛ్చ్టను వాడుతున్నారు. ‘దిగంబరంగా’, ‘నగ్నంగా’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడతాం. The patient was forced to be in his birthday suit for his medical exam అంటే వైద్య పరీక్ష కోసం రోగిని నగ్నంగా ఉండాలని బలవంతపెట్టాల్సి వచ్చిందని అర్థం.
     
     - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి
     email: vschary@gmail.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement