జాతీయం
Those three little words
అర్థం:
Those three little words = The words ''I love you''
వాక్య ప్రయోగం:
After several months of dating the young man finally said those three little words to his girlfriend.
ఎన్నో నెలల ప్రేమ వ్యవహారం తర్వాత చివరకు ఆ యువకుడు తన ప్రియురాలికి ‘ఐ లవ్ యూ’ అనే ప్రేమ మాటలు చెప్పాడు.
వివరణ:
మనలో చాలా మంది ప్రేమిస్తారు. ప్రేమించే వారిలో కుటుంబ సభ్యులు, భార్య లేదా భర్త, స్నేహితులు, ప్రియుడు లేదా ప్రియురాలు ఎవరైనా ఉండొచ్చు. ప్రియుడు, ప్రియురాలికి సంబంధించి sensuous/sensual love, platonic love అని రెండు రకాల ప్రేమ గురించి ఆంగ్లంలో ప్రస్తావిస్తారు. sens- uous/ sensual love శారీరక ఆకర్షణకు సంబంధించింది.
ఇది ఇంద్రియాల స్పంద నకు లోనై ఉంటుంది. గ్రీకు తత్వవేత్త ప్లేటో platonic love ను ఇంద్రియాలకు అతీతమైందిగా నిర్వచించాడు. ‘ఐ లవ్ యూ(నేను నిన్ను ప్రేమిస్తున్నాను) అనే ఆ ప్రేమ మాటలు’, ‘ఐ లవ్ యూ అనే ఆ మూడు ఇంగ్లిషు ప్రేమ ముక్కలు’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడుతున్నాం. Almost in all movies, hero and heroine would eagerly wait for hearing those three little words from each other. అంటే దాదాపు అన్ని సినిమాల్లో కథానాయకుడు, కథా నాయకురాలు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే ఆ మూడు ప్రేమ మాటల్ని ఒకరి నుంచి ఒకరు వినడానికి ఉవ్విళ్లూరు తుంటారని అర్థం.
- డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి
email: vschary@gmail.com