Die with one's boots on
అర్థం:
Die with one's boots on = To die while still active in one's work or while doing a job.
వాక్య ప్రయోగం:
The man worked hard all his life and died with his boots on when he had a heart attack at the factory
అతడు జీవితకాలమంతా కష్టపడి పనిచేసి, దృఢంగా, యవ్వనంలో ఉన్నప్పుడే కర్మాగారంలో గుండెపోటుతో మరణించాడు.
వివరణ:
ఈ జాతీయం 19వ శతాబ్దం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. పశ్చిమ అమెరికాలో కౌబోయ్స్ మధ్య జరిగే యుద్ధంలో ప్రత్యర్థి బందీగా దొరికితే అతడిని కాల్చి చంపడమో, ఉరి తీయడమో చేసేవారు. సాధారణంగా కౌబోయ్స్ యుక్త వయస్కులై, యూనిఫాం, షూ ధరించి దృఢంగా ఉండేవారు. ‘యవ్వనంలోనే మరణించు’,
‘ఉద్యోగం చేస్తున్న యుక్తవయసులోనే చనిపోవు’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడతారు. I never want to retire - I'd rather die with my boots on అంటే ‘నాకు రిటైర్మెంటు ఇష్టం లేదు. బతికున్నంతకాలం పనిచేస్తూనే ఉండాలని ఉంది’ అని అర్థం. విస్తృతార్థంలో ఈ జాతీయాన్ని To die while actively occupied/ emp- loyed/ working or in the middle of some action అని చెప్పవచ్చు.
- డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి
email: vschary@gmail.com
జాతీయాలు
Published Tue, Apr 29 2014 10:15 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement