సాక్షి, విశాఖపట్నం : జిల్లా విద్యాశాఖాధికారి పోస్టుకోసం నలుగురు అధికారులు పోటీపడుతున్నారు. వీరిలో ఇద్దరు గతంలో జిల్లా విద్యాశాఖలో పనిచేసినవారే. మిగిలిన ఇద్దరు చెరో మంత్రిని పట్టుకుని పైరవీలు సాగిస్తున్నట్టు సమాచారం. దీంతో జిల్లా మంత్రులు తమ బల నిరూపణకు సిద్ధమవుతున్నారు. నెలాఖరుతో డీఈవో కొనుకు కృష్ణవేణి పదవీ విరమణ చేయనున్నారు. ఆస్థానాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన బుచ్చన్న ముందంజలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన డెప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు మంత్రి బాలరాజు అండగా ఉన్నట్టు తెలిసింది.
మరొకరు ఒంగోలు(ప్రకాశం జిల్లా) డీఈవో రాజేశ్వరరావు. ఇదే ప్రాంతానికి చెందినవారైన జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఈయన కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వీరి పేర్లను ఇద్దరు మంత్రులు ఇప్పటికే సీఎం పేషీకి సిఫారసు చేసినట్టు తెలిసింది. వీరితోపాటు గతంలో విశాఖ డీఈవోగా పనిచేసి ప్రస్తుతం పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు(ఆర్జేడీ)గా వ్యవహరిస్తున్న ఎం.ఆర్.ప్రసన్నకుమార్ ఎఫ్‌ఏసీగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కొన్నేళ్లపాటు జిల్లాలో ఉప విద్యాశాఖాధికారిగా పనిచేసి, పదోన్నతిపై అనంతపురం డీఈవోగా వెళ్లిన మధుసూదనరావు కూడా బదిలీపై జిల్లాకు వచ్చేందుకు పావులు కదుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
భలే డిమాండ్ : విశాఖ జిల్లా డీఈవో పోస్టు ఖాళీ అయిందంటే చాలు.. చాలా మంది ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. భారీ సంఖ్యలో ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు, డైట్, బీఈడీ కళాశాలలున్నాయి. వీటికి గుర్తింపు, ఏటా తనిఖీలు పేరిట ‘ఆదాయ’ వనరులు బోలెడు. దీంతో ఈ స్థానంలోకి వస్తే కాసుల వర్షమేనన్న వాదనలు ఉ న్నాయి. దీంతో ఈ స్థానానికి రూ.లక్షల్లో చెల్లించేందుకు కూడా కొందరు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం సమైక్యాం ధ్ర ఉద్యమ హోరు, ప్రభుత్వ పాలన దాదాపు స్తంభించినా.. విశాఖ డీఈవో పోస్టుకు మాత్రం నెల రోజుల ముందు ను ంచే ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. వీరి లో ఎవరికి ఆ అవకాశం దక్కుతుందో తెలియాలి. ఈ ప్రయత్నాలు కొలిక్కి వచ్చేలోగా ప్రస్తుతమున్న ఇద్దరు ఉప విద్యాశాఖాధికారుల్లో (బి.లింగేశ్వరరెడ్డి, సి.వి.రేణుక) సీనియార్టీ ఆధారంగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించనున్నారు.
డీఈవో పోస్టుకు డిమాండ్!
Published Fri, Aug 30 2013 4:49 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement