Vanijya Utsav 2021
-
తొలి ‘హైబ్రిడ్ స్టేట్’ దిశగా ఏపీ అడుగులు
విజయవాడలో సెప్టెంబర్ 21–22న జరిగిన ‘ఏ.పి. వాణిజ్య ఉత్సవ్ –2021’ చూశాక, ఇది మునుపటి ‘పెట్టుబడుల సదస్సు’ వంటిది కాదని స్పష్టం అయింది. దీని లక్ష్యం అంతకంటే విస్తృతమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి ప్రాంతీయ పార్టీ పెట్టిన తర్వాత– భారత ప్రభుత్వం చేసిన ఉమ్మడి రాష్ట్రవిభజన, రాజకీయంగానే కాదు, ‘ఏరియా స్పెసిఫిక్’ దృష్టితో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు సరిగ్గా కుదిరింది. ప్రతిపక్ష నాయకుడిగా తొలి ఐదేళ్ళ మధ్యలో ‘అసెంబ్లీ’ నుంచి బయటకు వచ్చి, చేసిన పాదయాత్ర వల్ల ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించడానికి అది అన్నివిధాల అమిరింది. అందుకే, 2019 ఎన్నికల్లో కేవలం 4 పేజీల ‘మేనిఫెస్టో’తో ప్రజల్లోకి రావడం సాధ్యమయింది. అలా ఆయన తన ‘టీమ్’తో చేసిన ‘హోమ్ వర్క్’ ఎటువంటిదో, ఇప్పుడు అర్థమవుతున్నది. ఇప్పటివరకు విధాన నిర్ణేతలు లేదా అత్యున్నత స్థాయి పరిపాలన వర్గాల్లో పరిమిత స్థాయిలో అమలైన కలుపుకు పోయే (‘కన్వర్ జెన్స్’) విధానాన్ని, విస్తృత స్థాయిలో అమలు చేయడానికి జగన్ సిద్ధమయ్యారు. ఇక్కడ రెండు కీలకమైన అంశాలు వున్నాయి. మొదటిది – ఇది ఇంకా కుదురుకుంటున్న దశలోనే ఉన్న విభజిత ఏపీకి తొలి దశాబ్ది. రెండు– ప్రభుత్వాధినేతగా వైఎస్ జగన్‌ది తొలి అనుభవం. అయినా ‘లీడర్’గా జగన్ తొలి దశాబ్దిలోనే ‘హైబ్రిడ్ గ్రోత్ మోడల్’ చేయడానికి తీసుకున్నది సాహసోపేతమైన ‘లైన్.’ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వ విధానాల్ని ‘బ్యురోక్రసీ’ అమలు చేయడం తెలిసిందే. అయితే, అందులో ఏదైనా, ‘తొలి ప్రయోగం’ ఉన్నప్పుడు, అధికారులు కూడా ‘కెరియర్’పరంగా తమని తాము నిరూపించుకోవడానికి, దాన్ని సవాలుగా స్వీకరిస్తారు. అయినా గడచిన పాతికేళ్ళుగా ‘మార్కెట్ ఎకానమీ’లో ‘ఇ–గవర్నెస్’ ఆఫీస్ విధానంలో పనిచేస్తున్న అధికారులకు ‘కన్వర్జెన్స్’ గురించి సాకల్యంగా తెలుసు. అందుకే, వారు విజయవాడ ‘వాణిజ్య ఉత్సవ్’ వేదికపైన వున్న ‘పరిశ్రమల’ పక్కన ‘వ్యవసాయాన్ని’ అవలీలగా కూర్చోబెట్టి, రెండింటినీ ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖతో ఒకటిగా చేయగలిగారు! నిజానికి ఈ ‘కన్వర్జెన్స్’ అభివృద్ధి విధానం మరీ కొత్తదేమీ కాదు. రాష్ట్ర విభజనకు పదేళ్ళ ముందు ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ అధ్యక్షుడు లావూస్ శ్వాబ్ 2004 ఫిబ్రవరి 10న హైదరాబాద్ వచ్చినప్పుడు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రస్తుత ఆర్థికస్థితి నుంచి తదుపరి దశకు కాకుండా, రెండుమూడు దశలు అవతలకు దూకే– ‘లీఫ్ ఫ్రాగ్’ అభివృద్ధి విధానాన్ని సూచించాడు. కానీ, అప్పటికి ‘విజన్–2020’ అంటూ ‘షో కేసింగ్’ తో కాలక్షేపంచేసే నాయకత్వాల్లో ఇవేవీ కార్యాచరణ వైపుగా కదలలేదు. మళ్ళీ ‘సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ డైరెక్టర్ ఎరోల్ ఒబెక్, ప్రొఫెసర్ విలియం ఏ. కార్టర్ 2020 ఏప్రిల్ 10న రాసిన పరిశోధనా వ్యాసం– ‘ది నీడ్ ఫర్ లీఫ్ ఫ్రాగ్ స్ట్రాటజీ’లో ‘ఈ ప్రక్రియ ఆదాయాల పరంగా అంతరాన్ని తగ్గిస్తుందని, పౌరులకు కొత్త సంపదను అందిస్తుందం’టున్నారు. ‘లీఫ్ ఫ్రాగ్’ అభివృద్ధి నమూనాకు పరిపాలనా వ్యవస్థలో వేర్వేరు శాఖల మధ్య ‘కన్వర్జెన్స్’ తొలిమెట్టు. ఈ నేపధ్యంలో విజయవాడ ‘వాణిజ్య ఉత్సవ్’ను చూసినప్పుడు, మనవంటి వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో– ఆహార పంటలు, వాణిజ్య పంటలు, పాడి, మత్స్యసంపద, మాంసం, గుడ్లు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ‘పరిశ్రమలు–వాణిజ్యం’ రంగంతో అనుసంధానం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం. అందుకోసం కొత్తగా ఆగస్టులో ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖను ఏర్పాటుచేసింది. ఈ శాఖ తొలి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ‘వాణిజ్య ఉత్సవ్’ వేదికపై ఉంటే, చీఫ్ సెక్రటరీ ఆహ్వానంతో సదస్సు ప్రారంభం, సీఎం పక్కన మంత్రులు, కార్యదర్శులు ఉండగా, వాణిజ్య వర్గాల ప్రతినిధులు వేదికముందు వరుసలో కనిపించడం, ఈ మొత్తం ‘దృశ్యం’ ఈ ప్రభుత్వం మునుపటిలా ‘ప్రైవేట్ ప్లేయర్స్’ కోసం కాదనే సందేశం ఇచ్చినట్లయింది. గతవారం నెల్లూరులో పర్యటించిన కేంద్ర మత్స్య శాఖ స్టేట్ మంత్రి డా. ఎల్. మురుగన్ కేంద్రం కొత్తగా మత్స్యశాఖను పెట్టినట్టు చెప్పారు. మనవద్ద కొత్తదైన ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖ వ్యవసాయ అనుబంధ రంగాలకు ‘స్పోక్స్ అండ్ హబ్’ తరహాలో ఇకముందు ‘వాణిజ్య’ వసతి కల్పించనుంది. అయితే, దీని ముందస్తు సంసిద్ధత కోసం గత ఏడాది జూన్ 6న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో సీఎం జగన్ జరిపిన సమావేశం కీలకమైనది. చేపలు, రొయ్యల్లో ‘యాంటి బయాటిక్స్’ ‘హెవీ మెటల్స్’ లేకుండా తనిఖీ చేయడానికి ఈ ఏడాది జూలైలో 14 ‘ఆక్వా ల్యాబ్స్’ ఏర్పాటు ఈ దిశలో మరో ముందడుగు. ఈ ‘నెట్వర్క్’ అమలు కోసం పెట్టినవే –‘ఆర్బీకే’లు. సముద్ర ఎగుమతుల్లో 2020–21లో 16 బిలియన్ డాలర్లతో 4వ స్థానంలో వున్న ఏపీ దాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే, అందుకోసం ‘లీఫ్ ఫ్రాగ్’ మోడల్‌తో వైఎస్ జగన్ ప్రభుత్వం ‘హైబ్రిడ్ స్టేట్’ దిశగా వేస్తున్న అడుగులు ఇండియాకు కొత్తవి. జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అన్ని ప్రాంతాల సుస్థిరాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలు పారిశ్రామికంగా సుస్థిరమైన వృద్ధిని సాధించే విధంగా ప్రాంతాల వారీగా, రంగాల వారీగా ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే వెనుకబడిన ప్రాంతమైన వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్టు తెలిపారు. విజయవాడలో రెండు రోజులపాటు నిర్వహించిన వాణిజ్య ఉత్సవ్ మంగళవారం ఘనంగా ముగిసింది. అంతకుముందు రాష్ట్రంలో ఎగుమతులు అవకాశాలు, విధానాలు అనే అంశంపై కరికాల వలవన్ మాట్లాడుతూ.. రాష్ట్రమంతా సుస్థిరమైన సమ్మిళిత వృద్ధి సాధించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు ప్రభుత్వం జీవిత కాలం చేయూత అందిస్తుందన్నారు. ఇందుకోసం సింగపూర్ తరహాలో వైఎస్సార్ ఏపీ వన్ పేరుతో సేవలు అందించనున్నామని, ఇది డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కేవలం సులభతర వాణిజ్య అవకాశాలే కాకుండా ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు నిర్వహణ వ్యయం భారీగా తగ్గించే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వస్తువుల ఉత్పత్తి ధరలో సరుకు రవాణా వ్యయం 13 శాతంగా ఉందని, దీన్ని 8 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పటిష్ట ప్రణాళికలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధితోపాటు గోడౌన్లు, లాజిస్టిక్ సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. తిరుపతి ఎయిర్ పోర్టులో కార్గో సేవలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు దగదర్తిలో కార్గో కోసం ప్రత్యేకంగా విమానాశ్రయం అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రం నుంచి వెళ్తున్న మూడ కారిడార్లలో అన్ని మౌలిక వసతులతో నోడ్లను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. విశాఖ సెజ్ జోనల్ కమిషనర్ ఎ.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. క్లిష్ట సమయంలో కూడా వీసెజ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందన్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో సెప్టెంబర్ 20 నాటికి గతేడాదితో పోలిస్తే ఎగుమతులు 26 శాతం పెరిగి రూ.53,410 కోట్లకు చేరినట్టు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు కృష్ణ జీవీ గిరి మాట్లాడుతూ.. ఎగుమతుల్లో 90 శాతం పోర్టుల ద్వారానే జరుగుతున్నాయని, అందుకోసమే కొత్త పోర్టుల నిర్మాణంతో పాటు, పోర్టు ఆథారిత పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్టులు అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. మెడ్‌టెక్ జోన్ సీఈవో, ఎండీ జితేంద్రశర్మ మాట్లాడుతూ మెడికల్ టెక్నాలజీ రంగంలో ఎగుమతులకు అపార అవకశాలున్నాయన్నారు. సదస్సు విజయవంతం రెండు రోజుల పాటు నిర్వహించిన వాణిజ్య ఉత్సవ్ విజయవంతమైందని పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సదస్సులలో 650 మందికిపైగా ఎగుమతి దారులు పాల్గొన్నారని, 29కి పైగా సంస్థలు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాయని, 15కు పైగా ఎగుమతిదారుల సంఘాలు, వివిధ దేశాల రాయబారులు పత్యక్షంగాను, పరోక్షంగాను పాల్గొన్నారని వివరించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ స్టాల్స్‌కు అవార్డుల్లు ప్రకటించారు. అత్యధిక మందిని ఆకట్టుకున్న ఎంపెడా స్టాల్ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆర్కే హెయిర్ ప్రొడక్ట్స్, ఎంఐజే పార్క్, టెక్సోప్రోసిల్ నిలిచాయి. ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేసిన వారిని జ్ఞాపికలతో సత్కరించారు. -
ఏపీలో ఎగుమతుల పామర్ధ్యం రెట్టీంపు చేయీలన్న లక్ష్యంతో కార్యక్రమం
-
పెట్టుబడులతో వచ్చే వారికి స్వాగతం: కన్నబాబు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతాము అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎగుమతుల అవకాశాలపై ఆయన చర్చించారు. విజయవాడలో జరుగుతున్న వాణిజ్య ఉత్సవం కార్యక్రమం రెండురోజులో భాగంగా బుధవారం కన్నబాబు ప్రసంగించారు. సీఎం జగన్ పారిశ్రామికాభివృద్ధి కోసం సులభతరమైన పాలసీలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నాం అన్నారు కన్నబాబు. (చదవండి: పెట్టుబడులు పెట్టండి.. రాష్ట్రంతో పాటు మీరూ వృద్ధి చెందండి: సీఎం జగన్) ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయానికి , అనుబంధ రంగాల పరిశ్రమల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎం జగన్ సమర్ధవంతమైన పాలనలో కోవిడ్ సమయంలోనూ ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. దేశం మొత్తం ఎగుమతుల్లో 5.8% వాటాతో ఎగుమతుల్లో 4వ ర్యాంకులో ఏపీ నిలిచింది. 2020-21లో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 172 మిలియన్ టన్నుల ఎగుమతులు జరిగాయి. ఫుడ్ ప్రోసెసింగ్ క్లస్టరులను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూరుస్తున్నాం’’ అని కన్నబాబు తెలిపారు. చదవండి: పారిశ్రామికవేత్తలకు అవార్డులతో ముఖ్యమంత్రి సత్కారం -
రెండో రోజు వాణిజ్య ఉత్సవం
-
రాష్ట్ర జీడీపీలో ఎగుమతుల వాటా 12%
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఎగుమతుల వాటాను పెంచే విధంగా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం దేశ జీడీపీలో ఎగుమతుల వాటా 20% ఉంటే రాష్ట్ర జీడీపీ (జీఎస్డీపీ)లో ఇది 12 శాతానికి పరిమితమైందని తెలిపారు. దీన్ని పెంచేందుకు 10 ఏళ్లకాలానికి ప్రణాళిక తయారు చేసినట్లు చెప్పారు. వాణిజ్య ఉత్సవ్‌లో భాగంగా మంగళవారం రాష్ట్రంలో ఎగుమతుల అవకాశాలను వెల్లడించేలా ‘స్థానికంగా ఉత్పత్తి– అంతర్జాతీయంగా విక్రయం’ అంశంపై వివిధ దేశాల రాయబార ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 300 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశ ఎగుమతులను 2025 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం చేరుకోవాలంటే ఏటా దేశ ఎగుమతుల్లో 36 శాతం వృద్ధి నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎగుమతులు ప్రస్తుత 16.8 బిలియన్ డాలర్ల నుంచి 22.4 బిలియన్ డాలర్లకు చేరతాయని తెలిపారు. అలాగే 2030 నాటికి రాష్ట్ర ఎగుమతులను రెట్టింపు చేయాలన్న లక్ష్యం చేరుకోవాలంటే ఏటా 8% వృద్ధిని నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. 10 ఏళ్ల కాలానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని రెండు, మూడేళ్లకు ఒకసారి సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. -
రాజకీయ నేతలకు భిన్నంగా విద్యకు సీఎం జగన్ ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: విద్యారంగంలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ‘సయంట్’వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్ మోహన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం విజయవాడలో మొదలైన ‘వాణిజ్య ఉత్సవ్’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాధారణంగా రాజకీయ నాయకులు విద్యారంగాన్ని పట్టించుకోరని, సీఎం జగన్ దీనికి భిన్నంగా కీలక సంస్కరణలు చేపట్టారని ప్రశంసించారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా తొలిదశలో 15,000కిపైగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించడం, అమ్మ ఒడి, విద్యా కానుక లాంటి కార్యక్రమాల అమలు, 26 స్కిల్ కాలేజీలు, 2 స్కిల్ వర్సిటీల ఏర్పాటు లాంటి చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. పరిశోధనలకు నిధులివ్వాలి.. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ప్రతి ఎనిమిది ఉద్యోగాలకు ఒకరు మాత్రమే అందుబాటులో ఉన్నారని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని స్కిల్ కాలేజీలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని మోహన్‌రెడ్డి కోరారు. ప్రభుత్వం విద్యారంగంలో తెస్తున్న సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు దీర్ఘకాలంలో మేలు జరుగుతుందని చెప్పారు. కేవలం చదువుపైనే కాకుండా ఉపాధి కల్పన దిశగా నవతరం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు పరిశోధన రంగానికి భారీగా నిధులు కేటాయించాలన్నారు. కొత్త పారిశ్రామికవేత్తలు రావడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వసతుల కల్పనలో రాష్ట్రం ముందంజ రాష్ట్రంలో 19 భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులున్నాయని, సుదీర్ఘ తీర ప్రాంతం వల్ల పలు దేశాలకు వేగంగా ఎగుమతులు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి వ్యయాన్ని తగ్గించడంతో పాటు నష్ట భయాన్ని నివారించేలా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. 600 మందికిపైగా పాల్గొంటున్న ఈ ఎక్స్పోర్ట్ కాన్క్లేవ్ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం ముందంజలో ఉందని, కోవిడ్ ఇబ్బందులున్నా ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. -
పారిశ్రామికవేత్తలకు అవార్డులతో ముఖ్యమంత్రి సత్కారం
సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో రాష్ట్రంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది పారిశ్రామికవేత్తలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించారు. రెండేళ్లలో రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడులు, నమోదు చేసిన వ్యాపార పరిమాణం, ఉద్యోగాల కల్పన ఆధారంగా ఇండస్ట్రీ చాంపియన్లుగా ఎనిమిది మందిని, ఎగుమతుల్లో కీలక భాగస్వామ్యం వహించిన ఏడుగురు ఎగుమతిదారులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ ఎంపిక చేసింది. విజయవాడలో మంగళవారం జరిగిన వాణిజ్య ఉత్సవ్‌లో వీరిని మెమెంటో, శాలువా, పుష్పగుచ్ఛాలతో ముఖ్యమంత్రి సత్కరించారు. ఇండస్ట్రీ చాంపియన్ అవార్డులు అందుకున్నవారు 1. పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సయంట్ లిమిటెడ్ 2. కబ్ డంగ్ లే, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3. అనిల్ చలమశెట్టి, ఎండీ, గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ 4. అవినాష్‌చంద్ రాయ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అదాని ఇంటర్నేషనల్ 5. ఇషాన్‌రెడ్డి ఆళ్ల, ప్రమోటర్ డైరెక్టర్, రామ్కీ గ్రూపు 6. సి.వి.రాజులు, వైస్ ప్రెసిడెంట్, ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 7. కె.మదన్‌మోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అరబిందో ఫార్మా 8. జోష్ ఫగ్లర్, ఎండీ, రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా లిమిటెడ్ ఎక్స్పోర్ట్ అవార్డులు అందుకున్నవారు 1. సి.శరవణన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బ్రాండిక్స్ ఇండియా అప్పరెల్ ప్రైవేట్ లిమిటెడ్ 2. లీ మి తేస్, జనరల్ మేనేజర్, అపాచీ ఫుట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3. బి.వి.కృష్ణారావు, ఎండీ, పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4. వంకా రాజకుమారి, ఎండీ, ఇండియన్ హైర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5. పాండవ ప్రసాద్, జీఎం, ఎస్ఎన్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ 6. సింగలూరి శారదాదేవి, పార్టనర్, ఆర్వీ కార్ప్ 7. కె.శ్రీనివాసరావు, ఎండీ, అమరావతి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ -
పెట్టుబడులు పెట్టండి.. రాష్ట్రంతో పాటు మీరూ వృద్ధి చెందండి: సీఎం జగన్
ఈ కష్టకాలంలో పారిశ్రామికవేత్తలు చూపి స్తున్న అంకితభావానికి, ఎగుమతి దారులు, వాణిజ్య మండళ్లు, శ్రమిస్తున్న కార్మికులందరికీ అభినందనలు. పారిశ్రామికవేత్తల్లో ఈ వాణిజ్య ఉత్సవ్ మరింత నమ్మకాన్ని కల్పిస్తుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా రాష్ట్రంతోపాటు అభివృద్ధి చెందేలా మరింత మందిని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందుబాటులో ఉంటాం. సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. మేం చేయాల్సినవి ఏమైనా ఉంటే సూచనలు చేయండి. కచ్చితంగా నెరవేరుస్తాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఎగుమతులు క్షీణించినప్పటికీ రాష్ట్ర ఎగుమతుల్లో మాత్రం వృద్ధి నమోదైందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సరైన మౌలిక వసతులు, చక్కటి విధానాలు అమలు చేస్తే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోగలమనేందుకు ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో నమోదవుతున్న వృద్ధి, జీడీపీ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎగుమతులు 330 బిలియన్ డాలర్ల నుంచి 290 బిలియన్ డాలర్లకు పడిపోగా అదే సమయంలో రాష్ట్ర ఎగుమతులు 14.1 బిలియన్ డాలర్ల నుంచి 16.8 బిలియన్ డాలర్లకు పెరిగాయని వివరించారు. 2020–21లో దేశ జీడీపీ 7.3 శాతం క్షీణించగా రాష్ట్ర జీఎస్డీపీ క్షీణత 2.58 శాతానికే పరిమితమైందన్నారు. ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో 5.8 శాతంగా ఉన్న రాష్ట్ర వాటాను 2030 నాటికి పది శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుని సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రెండు రోజుల ట్రేడ్ కార్నివాల్ ‘వాణిజ్య ఉత్సవ్’ను మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించి మాట్లాడారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్రంతో పాటు మీరు కూడా (పారిశ్రామికవేత్తలు) అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికను విడుదల చేయడంతో పాటు ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్పోర్ట్ ట్రేడ్ పోర్టల్, వైఎస్సార్ ఏపీ వన్ బిజినెస్ అడ్వైజరీ సర్వీసులను బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగం వివరాలివీ.. వాణిజ్య ఉత్సవ్–2021ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారం రోజులు మీతోనే... ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వచ్చిన వివిధ దేశాల దౌత్యాధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎగుమతి దారులు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిళ్ల సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రివర్గ సహచరులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇతర భాగస్వాములందరికీ స్వాగతం. విజయవాడలో రెండు రోజులపాటు వాణిజ్య ఉత్సవ్ అనంతరం నాలుగు రోజులపాటు జిల్లాల్లో కూడా జరుగుతాయి. వారం రోజులపాటు వాణిజ్య వర్గాలు, ప్రభుత్వం కలసి మెలసి పనిచేస్తాయి. సంక్లిష్ట సమయం.. గత రెండేళ్లలో పెను సవాళ్లను ఎదుర్కొన్నాం. తొలి ఏడాది మాంద్యం కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటే రెండో సంవత్సరం కోవిడ్ విపత్తును చూశాం. దీనివల్ల దేశవ్యాప్తంగా రెవెన్యూ వసూళ్లు 3.38 శాతం పడిపోయాయి. 2018–19లో దేశం మొత్తం రెవిన్యూ వసూళ్లు రూ.20,80,465 కోట్లు ఉంటే 2019–2020లో రూ.20,10,059 కోట్లకు పడిపోయాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 4 శాతానికి పడిపోయింది. 2020–21లో మరింత క్షీణించి 7.3 శాతానికి పడిపోయింది. దేశ ఎగుమతులు 330 బిలియన్ డాలర్ల నుంచి 290 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఎగుమతుల రంగానికి ఇది అత్యంత సంక్లిష్ట సమయం. 9 నుంచి 4కి ఎగబాకిన ర్యాంకు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రం ఎగుమతులు 19.4 శాతం వృద్ధి చెందాయి. రాష్ట్ర ఎగుమతులు 14.1 బిలియన్ డాలర్ల నుంచి 16.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇందులో సముద్రపు ఉత్పత్తులు 15 శాతం ఉండగా షిప్స్, బోట్ల నిర్మాణ రంగం 8.5 శాతం, ఫార్మా రంగం 7.3 శాతం, ఐరన్, స్టీల్ ఉత్పత్తులు 7.3 శాతం, నాన్ బాస్మతి రైస్ 4.8 శాతంతో ఎగుమతులకు దోహదపడ్డాయి. 2018–19లో ఎగుమతుల్లో రాష్ట్రం 9వ స్థానంలో ఉండగా 2019–20లో 7వ స్థానానికి చేరుకుంది. 2020–21లో నాలుగో స్థానానికి చేరుకున్నాం. రాష్ట్ర జీఎస్డీపీ కోవిడ్ సంవత్సరం 2020–21లో 2.58 శాతం క్షీణిస్తే దేశ జీడీపీ 7.3 శాతం క్షీణించింది. ఈ వివరాలు ఎందుకు చెబుతున్నామంటే.. సరైన మౌలిక వసతుల కల్పన, చక్కటి విధానాల ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమని మా గట్టి నమ్మకం. పారిశ్రామిక ప్రగతి, ఎగుమతుల వృద్ధికి ఈ రెండూ చాలా కీలకం. రెండేళ్లలో చాలా దూరం ప్రయాణం గత రెండేళ్లలో మేం చాలా దూరం ప్రయాణం చేశాం. రూ.5,204 కోట్లతో రాష్ట్రంలో 16,311 ఎంఎస్ఎంఈలు నెలకొల్పడం ద్వారా 1,13,777 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇది కాకుండా గత రెండేళ్లలో 68 అతి భారీ, భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.30,175 కోట్ల పెట్టుబడులు ఈ పరిశ్రమల ద్వారా వచ్చాయి. 46,119 మందికి ఉపాధి లభించింది. మరో రూ.36,384 కోట్ల పెట్టుబడితో 62 భారీ, అతి భారీ పరిశ్రమలు నిర్మాణాన్ని పూర్తి చేసుకోబోతున్నాయి. 76,960 మందికి ఉద్యోగాలను కల్పించే సామర్థ్యం వీటికి ఉంది. గత ఏడాది కాలంలోనే రూ.26,391 కోట్లతో ఏర్పాటు కానున్న 10 మెగా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం. వీటివల్ల 55,024 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ – గెయిల్ స్థిరమైన పారిశ్రామిక ప్రగతి కోసం అవసరాలకు సరిపడా ఇంధన వనరులు అందుబాటులో ఉండడం చాలా కీలకం. సరిపడా గ్యాస్ లభ్యం కావాలి. పరిశ్రమలు, గృహ అవసరాల కోసం గ్యాస్ అందుబాటులో ఉంచడానికి గెయిల్ భాగస్వామ్యంతో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. అతి తక్కువ ఖర్చుతో ఇంధన వనరులను అందుబాటులోకి తేవడం దీని ఉద్దేశం. 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు నైపుణ్య లేమిని తీర్చడానికి ప్రపంచస్థాయిలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కోటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు తిరుపతి, విశాఖల్లో స్కిల్ వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక యూనివర్సిటీ పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టిపెడితే మరో వర్సిటీ ఐటీ రంగంలో నైపుణ్యాలను పెంపొందించటంపై దృష్టి సారిస్తుంది. ఇవి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచి ఉద్యోగాల కల్పన దిశగా నడిపిస్తాయి. కొత్త పోర్టుల నిర్మాణం... రాష్ట్రానికి 974 కి.మీ. సువిశాల తీర ప్రాంతం ఉంది. ఎగుమతులు వృద్ధి చెందడానికి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు పోర్టులను నిర్మిస్తోంది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు, ప్రకాశం జిల్లా రామాయపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టులను నిర్మిస్తోంది. పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ పోర్టులు సమీపంలో ఉన్నాయి. మచిలీపట్నం పోర్టు తెలంగాణకు, రామాయపట్నం తమిళనాడుకు, భావనపాడు ఉత్తరాది రాష్ట్రాలకు సమీపంలో ఉన్నాయి. విదేశీ వాణిజ్యాన్ని పెంచడంలో ఈ పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయి. పారిశ్రామికీకరణ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పోర్టుల వార్షిక నిర్వహణ సామర్థ్యం 254 మిలియన్ టన్నులు కాగా మూడు కొత్త పోర్టుల వల్ల తొలిదశలో మరో 65 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం వృద్ధి చెందుతుంది. 8 కొత్త ఫిషింగ్ హార్బర్లు వీటితోపాటు మరో 8 ఫిషింగ్ హార్బర్లను కూడా నిర్మిస్తున్నాం. ఏపీకి ఇంత పెద్ద సముద్ర తీర ప్రాంతం ఉన్నా హార్బర్లు లేకపోవడంల్ల మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు విడతల్లో 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. ఇందుకోసం రూ.3,827 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీనివల్ల 76,230 మంది మత్స్యకారులు లబ్ధి పొందడమే కాకుండా మరో 35 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీలు, చేపలు, రొయ్యల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి రావడం ద్వారా ఎగుమతులు పెరుగుతాయి. 25 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల రైతులకు మంచి ధరలు దక్కడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించడం వల్ల ఎగుమతులు పెరుగుతాయి. ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పలువురు వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లున్న ఏకైక రాష్ట్రం దేశంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్– బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తిస్తాయి. ఈ కారిడార్లు ఆర్థిక వృద్ధి రేటును పెంచడమే కాదు పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్తాయి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేస్తోంది. 3,155 ఎకరాల్లో మల్టీ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన విద్యుత్తు, నీరు, ఎస్టీపీలు లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. రూ.20 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే దిశగా అడుగులేస్తున్నాం. దాదాపు లక్ష మందికిపైగా ఉపాధి కల్పించే సమర్థత ఈ పార్కుకు ఉంది. ఇదే ఇండస్ట్రియల్ పార్కులో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. 800 ఎకరాల్లో రూ.730 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మిస్తున్నాం. దీనిద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. 25 వేల మందికి ఉద్యోగాల కల్పన సామర్థ్యం ఈఎంసీకి ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్టీల్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగిన దృష్ట్యా 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ.13,500 కోట్లతో కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీని నెలకొల్పుతున్నాం. ఆకట్టుకున్న ఎగ్జిబిషన్ స్టాల్స్ విజయవాడలో రెండురోజుల వాణిజ్య ఉత్సవ్‌లో రాష్ట్ర పరిశ్రమలశాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శకులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అమితంగా ఆకర్షించింది. రాష్ట్రంలో ఎగుమతి అవకాశాలను తెలిపే విధంగా మొత్తం 29 స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న 15 ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ఏపీ ఎక్స్పీరియన్స్ ఎరినా పేరుతో రాష్ట్రంలో మౌలిక వసతులు, వైఎస్సార్ వన్ ద్వారా అందించే బిజినెస్ అడ్వైజరీ సేవలు, రాష్ట్రంలో ఎగుమతులకు అవకాశం ఉన్న ఉత్పత్తులు, ఎగుమతులకు ప్రభుత్వం సహకారం తెలిపే విధంగా మూడు తెరలు ఏర్పాటు చేసి వీడియోలు చూసేలా టచ్ స్క్రీన్ కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 15 నిమిషాలపాటు ఆసక్తిగా ఎరినా, ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సందర్శించారు. మానవ శిరోజాలను ఎగుమతిచేసే స్టాల్స్, టీ ఎగుమతులు, హస్తకళలు, ఎంపెడా ఏర్పాటు చేసిన అక్వేరియం చేపలు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ, హస్తకళల స్టాల్స్‌ను సందర్శించి వ్యాపారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ స్టాల్స్‌లో చిన్న వేంకటేశ్వరస్వామి ప్రతిమను చూసి వీటిని పెద్దగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అతిథులకు ఇచ్చే మెమెంటోగా వాడుకోవచ్చని సీఎం అధికారులకు సూచించారు. ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో ఉత్పత్తులను తిలకిస్తున్న సీఎం జగన్ -
ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
-
మెగా ప్రాజెక్ట్‌ల ద్వారా 55 వేల మందికి ఉపాధి
-
ఇండస్ట్రియల్ కారిడార్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ: సీఎం జగన్
-
రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపన
-
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషి మరువలేనిది
-
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెం.1: మేకపాటి గౌతమ్ రెడ్డి
-
వాణిజ్య ఎగుమతుల్లో ఏపీ ది బెస్ట్: ఆదిత్యనాథ్ దాస్
-
వాణిజ్యోత్సవాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
వాణిజ్య ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
10 మెగా ప్రాజెక్టులతో 55 వేల మందికి ఉపాధి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీ ఎగుమతుల రోడ్ మ్యాప్ బ్రోచర్‌ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.ఎగుమతులకు సంబధించి ప్రత్యేకంగా ఈ- పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల ప్రముఖులు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని పేర్కొన్నారు. 2020-2021లో రూ. 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. 2020-2021లో ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని సీఎం తెలిపారు. రెండేళ్లలో రూ. 20, 390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు, హైదారాబాద్- బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రీయల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 730 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్షరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 3గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, 13వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2023-2024 కల్లా భావనపాడు, మచిలీపట్నం, రాయామపట్నం పోర్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 3 వేల మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ. 500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గెయిల్‌తో కలిసి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యం అభివృద్ధికి 25 ప్రపంచస్థాయి కళాళాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్రం 10 శాతం వాటి సాధించడమే లక్ష్యమని అన్నారు. 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి, రూ. 2,500 కోట్ల పెట్టుబడితో 80 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రెట్టింపు చేయడమే లక్క్ష్యమని అన్నారు. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని తెలిపారు. ఫార్మా ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్ ఎగుమతులకు భారీ అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఈ వారంలోనే ఎక్స్‌పోర్టు కాన్క్లేవ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎక్స్‌పోర్టు కాన్క్లేవ్ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారం అందిస్తామని తెలిపారు. వాణిజ్యంలో దేశంలోని ఏ రాష్ట్రంతోనైనా పోటీ పడే సత్తా ఏపీకి ఉందని పేర్కొన్నారు. వాణిజ్యం పెంపుకు, మౌలిక వసతుల కల్పనలో ఏపీ ముందుంటుందని తెలిపారు. కోవిడ్ కష్టాలున్నా ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు.