Varanasi tour
-
నేడు వారణాసికి ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానిగా వరుసగా మూడో విడత బాధ్యతలు చేపట్టిన మోదీ ఈ నెల 18న మొదటిసారిగా తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. వారణాసిలో జరిగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ పథకం కింద 17వ విడతలో రూ.20 వేల కోట్ల నిధులను దేశవ్యాప్తంగా ఉన్న రూ.9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. ‘కృషి సఖి’లుగా శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు దశాశ్వమేథ ఘాట్‌లో జరిగే గంగా ఆరతి కార్యక్రమంలో పాల్గొంటారు. -
నేడు ప్రధాని మోదీ వారణాసి పర్యటన
వారణాసి: కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమాయత్తం చేసేందుకు బీజేపీ అధినాయకత్వం సమాయత్తమవుతోంది. ప్రధాని మోదీ గురువారం తన వారణాసి పర్యటనలో భాగంగా దాదాపు 20 వేల మంది బూత్ లెవల్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. యూపీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడానికి ముందు తన నియోజక వర్గంలో ప్రధాని మోదీకి ఇదే చివరి పర్యటన కావచ్చు. -
వారణాశిలో నేడు మోడి పర్యటన!