నేడు ప్రధాని మోదీ వారణాసి పర్యటన
వారణాసి: కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమాయత్తం చేసేందుకు బీజేపీ అధినాయకత్వం సమాయత్తమవుతోంది. ప్రధాని మోదీ గురువారం తన వారణాసి పర్యటనలో భాగంగా దాదాపు 20 వేల మంది బూత్ లెవల్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. యూపీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడానికి ముందు తన నియోజక వర్గంలో ప్రధాని మోదీకి ఇదే చివరి పర్యటన కావచ్చు.