సామాజిక సేవలో ముందుండాలి
ఆదిలాబాద్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : సామాజిక సేవలో ఎన్ఎస్ఎస్ అధికారులు ముందుండాలని కాకతీయ యూనివర్సిటీ(కేయూ) ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ సురేశ్‌లాల్ అన్నారు. గురువారం స్థానిక వాగ్దేవి కళాశాలలో వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించి సామాజిక అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. విద్యాలయాల్లోనూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు ముమ్మరం చేయాలని సూచించారు. ఏడాదిపాటు వివిధ ఎన్ఎస్ఎస్ పీవోలు చేపట్టిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్ఎస్ అధికారి కన్నం మోహన్‌బాబు, నారాయణరావు, వివిధ కళశాలల ఎన్ఎస్ఎస్ అధికారులు పాల్గొన్నారు.