varshika bramostavalu
-
ఘనంగా లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
-
ఒంటిమిట్టలో ఘనంగా కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
-
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం స్వస్తివాచనంతో ప్రారంభమయ్యాయి. బాలాలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. ముందుగా గర్భాలయ ఆవరణలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, నవకలశాభిషేకం, రక్షాబంధనం కార్యక్రమాలను నిర్వహించారు. ధాన్యరాశిలో సత్యం, జ్ఞానం, ధర్మం అనే ముగ్గురు దేవతలను ఆవాహన చేసి ఆ కలశాలలో శుద్ధ గంగాజలాన్ని పోసి వాటికి ప్రత్యేక పూజలు చేశారు. మొదట దేవస్థాన అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి యజ్ఞాచార్యులకు, ఆ తర్వాత ఆలయ అర్చకులకు రక్షాబంధనం చేశారు. అనంతరం అర్చకులు దేవస్థాన ఈఓ గీతారెడ్డి, చైర్మన్ బి.నర్సింహమూర్తిలకు రక్షాబంధనం చేశారు. ఈ ఉత్సవాల్లో పంచనారసింహుల శక్తిని పెంచడానికి కఠోర నియమాలతో దీక్ష తీసుకోవడమే రక్షాబంధనం. అనంతరం పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టు చీరలు, ధోవతి, కండువా, తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణానికి అవసరమయ్యే పుట్టమన్ను తెచ్చి కల్యాణ మండపంలో స్వామివారిని అధిష్టింపచేశారు. పుట్టమన్నును 12 పాత్రలలో వేసి 12 రకాలైన ధాన్యాలను వేసి 12 రకాల దేవతలతో ఆవాహన చేసి ప్రత్యేక పూజలతో అంకురార్పణ చేశారు. ధ్వజస్తంభానికి బంగారు తొడుగు ఈనెల 28న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో అళ్వార్ మండపంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి చేపట్టిన బంగారు తొడుగుల పనులు తుది దశకు చేరాయి. ధ్వజస్తంభం 34 అడుగుల ఎత్తు ఉంది. ఇక గోపురాలు, విమాన శిఖరాలపై బిగించేందుకు బంగారు కలశాలు సిద్ధం చేస్తున్నారు. కలశాలు 8 నుంచి 10అడుగుల ఎత్తు ఉన్నాయి. -
AP: అరుదైన ఆలయం.. భారతమాతకు వందనం
సాక్షి, కవిటి: రాష్ట్రంలోనే అత్యంత అరుదైన ఆలయంగా గుర్తింపు పొందిన శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం సీహెచ్ కపాసుకుద్ధిలోని భారతమాత ఆలయం 15వ వార్షికోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు పూర్ణ కలశాలను పట్టుకుని గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం నిరంజన్, శంకర్స్వామిల ఆధ్వర్యంలో భారతమాతకు విశేష పూజలు చేశారు. చదవండి: అల్లూరి పేరిట పోస్టల్ కవర్ మత్స్యకారులు వేటను స్వచ్ఛందంగా నిలిపివేసి పూజల్లో పాల్గొన్నారు. 200 మంది మహిళలచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భారీ సంఖ్యలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్రలో వాడిన పూజా సామగ్రిని సముద్రంలో నిమజ్జనం చేశారు. భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్న మహిళలు చదవండి: భక్తుల సెల్ఫోన్లకు ఎప్పటికప్పుడు రోజువారీ కార్యక్రమాల వివరాలు -
వైభవోపేతం.. శ్రీనివాసుని కల్యాణం
జంగారెడ్డిగూడెం : గోకుల తిరుమల పారి జాతగిరిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీని వాసుని కల్యాణాన్ని శని వారం వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజు కల్యాణ మహోత్సవంలో తొలుత విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, హోమ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యుల పర్యవేక్షణలో ఋత్విక్ స్వాములు జరి పారు. రెడ్డి శ్రీనివాసరావు దంపతులు, తానింకి సత్యనారాయణ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన కోరా నాగేశ్వరరావు, రేవతి దంపతులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మ¯ŒS బిక్కిన సత్యనారాయణ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.