varun sandhesh
-
ఉదయ్‌కిరణ్, తరుణ్‌లతో నన్ను పోల్చకండి : వరుణ్ సందేశ్
Varun Sandesh : హ్యాపీడేస్ చిత్రంతో తొలిసారి తెలుగుతెరకు పరిచయం అయ్యాడు హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్తబంగారు లోకం సినిమాతో మరో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్న వరుణ్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో వరుణ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందనుకున్న సమయంలో బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఎంట్రీ ఇచ్చి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వరుణ్ ఆటిట్యూడ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్-3 నుంచి బయటకు వచ్చిన అనంతరం వరుణ్ నటించిన తొలి సినిమా ఇందువదన. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న వరుణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన కెరీర్‌ను తరుణ్, ఉదయ్‌కిరణ్‌లతో పోల్చవద్దని తెలిపాడు. నాకు ఉదయ్, తరుణ్ బాగా తెలుసు. ఉదయ్‌కు అలా జరగడం చాలా బాధాకారం. కానీ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. కెరీర్‌ను అలా పోల్చి చూడలేం. ఇక నా విషయానికి వస్తే..నేను కోల్పోయినదాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. బిగ్‌బాస్ తర్వాత కొన్ని కథలకు సైన్ చేశా. కానీ కోవిడ్ సహా మరికొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్స్ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇక తర్వాత నేను యూఎస్ వెళ్లి ఐటీ కోర్స్ చేశాను. వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాలనే ఆలోచన కూడా ఉంది అని వరుణ్ వివరించాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటించిన ఇందువదన చిత్రంలో ఫర్నాజ్ శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడదులైన మూవీ ఫస్ట్ లుక్ సినిమాపై ఆకస్తిని కలిగించేలా ఉంది. -
ఆకట్టుకుంటున్న.. గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా..
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఇందువదన".ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'వడివడిగా సుడిగాలిలా వచ్చి .. గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా' అంటూ ఓ సాంగ్ రిలీజ్ అయింది. శివ కాకాని సంగీతాన్ని అందించగా, జావేద్ అలీ, మాళవిక ఆలపించారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక వరుణ్ సందేశ్ చేస్తోన్న మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాలో వరుణ్ సందేశ్ అటవీశాఖ అధికారి పాత్ర పోషించగా, ఫర్నాజ్ శెట్టి గిరిజన యువతిలా కనిపించనుంది. ఈ సినిమాతో ఫర్నాజ్ హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించనుకోనుంది. ఇక రఘు బాబు, అలీ, సురేఖ వాణి, ధనరాజ్కీ మూవీలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే పప్రేక్షకుల ముందుకు రానుంది. -
రీ ఎంట్రీ ఇస్తున్న వరుణ్ సందేశ్.. బోల్డ్ పోస్టర్ రిలీజ్
హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో వరుణ్ సందేశ్. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన వరుణ్ సందేశ్ బిగ్‌బాస్ షోతో ద్వారా మరోసారి తెలుగు ఆడియోన్స్‌కు దగ్గరయ్యాడు. సీజన్-3లో మిస్టర్ కూల్ అనే ట్యాగ్ లైన్‌ను సంపాదించుకున్నాడు. ఓ దశలో బిగ్ బాస్ విన్నర్ వరుణ్ సందేశే అనుకున్నారంతా. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో టాప్4 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిగ్‌బాస్ సీజన్-3 ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వరుణ్ తాజాగా ఓ సినిమా అనౌన్స్ చేసి మరోసారి రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఎంఎస్ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ బాలాజీ పిక్చర్స్ పతాకం నిర్మిస్తుంది. వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇందువదన అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తోన్న వరుణ్ సందేశ్ సోమవారం ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత సినిమా చేస్తుండటం, పోస్టర్ బోల్డ్‌గా ఉండటంతో ఈ మూవీ కథ ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి మొదలైంది. పోస్టర్ వేరె లెవల్లో ఉందంటూ వరుణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: పెళ్లి కాలేదని చెప్పి..వేరే అమ్మాయిలతో నటుడి ఎఫైర్స్ యాంకర్ రవి కారులో.. సీక్రెట్స్ బయటపెట్టేసిన లాస్య View this post on Instagram A post shared by Varun Sandesh (@itsvarunsandesh) -
బిగ్‌బాస్ : 50 లక్షలు ఎవరివి?
తెలుగువాళ్లు రెండుగా విడిపోయారు. ఐదేళ్ల క్రితమే ‘ప్రత్యేక తెలంగాణ’ పేరుతో విడిపోయారుగా.. ఇప్పుడేమిటి మళ్లీ విడిపోవడం? అప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయింది తెలుగు ప్రజలు. ఇప్పుడు విడిపోయింది రెండు రాష్ట్రాల్లోని తెలుగు వీక్షకులు. వీళ్లను విడదీసింది నాయకులు కాదు.‘బిగ్‌బాస్–3’ టీవీ షోలోని నటీనటులు. నటీనటులు కూడా కాదు. కంటెస్టెంట్లు. ఈ వంద రోజులూ ఒకరితో ఒకరు ఆడి, పాడి, పోట్లాడి.. పోటీలో చివరికి ఐదుగురు మిగిలారు. ఆ ఐదుగురిలో ప్రధానంగా ఇద్దరిపైనే అందరి చూపు ఉంది. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్. వీళ్లిద్దరిలో ఎవరు విజేత అవుతారన్నదానిపైనా తెలుగు టీవీ వీక్షకులు రెండుగా విడిపోయారు! బిగ్‌బాస్ 3 షోలో యాభై లక్షల ప్రైజ్‌మనీని శ్రీముఖి కొట్టేస్తుందని సగం మంది. కాదు కాదు.. ఆ యాభై లక్షలు రాహుల్‌నే వరిస్తాయని మిగతా సగం మంది! మరి మిగిలిన ముగ్గురిలో అలీకి ఏం తక్కువైంది? బాబా భాస్కర్‌కి ఏం ఎక్కువైంది? వరణ్ సందేశ్‌కి ఎక్కువ తక్కువలు ఏం ఉన్నాయి? వాళ్లెందుకు మొదటి ఇద్దరిలో స్థానం సంపాదించుకోలేక పోయారు? సంపాదించుకోలేదని ఎవరన్నారు? ఈ ఐదుగురి స్థానం గత కొన్ని రోజులుగా వెనుకా ముందు, ముందూవెనుక అవుతూ.. ప్రయారిటీ లిస్ట్‌లోకి ప్రధాన పోటీదారులుగా శ్రీముఖి, రాహుల్ వచ్చేశారు. పందేలు ప్రధానంగా వీళ్లిద్దరి మధ్యే నడుస్తున్నాయి. చెప్పలేం. ఈ సాయంత్రం లోపు రాతలు తారుమారవచ్చు. వీక్షక ఓటర్లు పైకొకటి చెప్పి, లోపల ఇంకొరికి ఓటేస్తూ తమ సెల్‌ఫోన్ బటన్ నొక్కొచ్చు. అప్పుడు శ్రీముఖీ, రాహుల్ కాకుండా వేరెవరైనా విజేతలవచ్చు. వీళ్లయిదుగురి స్పెషాలిటీ ఏంటి? వీళ్లలో మళ్లీ ఆ ఇద్దరి ప్రత్యేకతలేంటి? చూసే ఉంటారుగా. రాహుల్ సిప్లిగంజ్ గాయకుడు. శ్రీముఖి యాంకర్. వరుణ్ సందేశ్ నటుడు. బాబా భాస్కర్ కొరియోగ్రాఫర్. అలీ (అలీ రెజా).. ఇతనూ యాక్టరే. ఇతడి తొలి సినిమా ‘గాయకుడు’. రాబోయే సినిమా ‘సినీ మహల్’. వీళ్ల గురించి ఇంతవరకు చాలు. మిగతా 12 మంది కంటెస్టెంట్ల పేర్లు కూడా ఒకసారి ఏకబిగిన చెప్పేసుకుందాం. పాపం ఇన్ని రోజులు మనల్ని ఎంటర్టైన్ చేశారు కదా. బిగ్‌బాస్ హౌస్‌లో ఆటాడింది మొత్తం 17 మంది. అంతమంది ఉన్నారా! ఉన్నారు. మీరు చూశారు. ఈ పదిహేడు మందిలో పదిహేను మంది ఒరిజినల్ కంటెస్టెంట్లు. రాహుల్, శ్రీముఖి. వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ, శివజ్యోతి, వితిక, మహేశ్, పునర్నవి, రవికృష్ణ, హిమజ, అశురెడ్డి, రోహిణీరెడ్డి, జాఫర్ బాబు, హేమ.. వీళ్లు ఒరిజినల్. మిగిలిన ఇద్దరు.. శిల్పా చక్రవర్తి, తమన్నా సింహాద్రి.. వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి ఎంటర్ అయినవాళ్లు. ప్రస్తుతం మిగిలిన ఐదుగురు తప్ప అంతా ఎలిమినేట్ అయ్యారు. రాహుల్ కూడా ఎలిమినేట్ అయ్యాడు కానీ.. అది ఫేక్ ఎలిమినే షన్. అతడిని సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. ఇదంతా ఆటలో భాగం. బిగ్‌బాస్ మొదటి సీజన్లో విజేత శివబాలాజి. రెండో సీజన్లో విజేత కౌశల్. మొదటి రెండు సీజన్లలోనూ మగవాళ్లకే ప్రైజ్ మనీ రావడంతో ఈసారి కచ్చితంగా శ్రీముఖే గెలుస్తారని ఒక అంచనా. మొన్నటి వరకు ఆమెకు పోటీగా శివజ్యోతి ఉంటుందని భావించారు కానీ, శివజ్యోతి కూడా ఎలిమినేట్ అయిపోవడంతో మిగిలిన ఐదుగురు ఫైనలిస్ట్‌లలో ఏకైక మహిళ అయిన శ్రీముఖికే ఎక్కువ చాన్స్ ఉందని వీక్షకులు ఊహిస్తున్నారు.అయితే శనివారం సాయంత్రం వరకు అందుబాటులో ఉన్న వీక్షకుల ఓటింగ్ అంచనాల ప్రకారం విజేతగా రాహుల్ మొదటి స్థానంలో ఉండగా, వరుణ్ సందేశ్, శ్రీముఖి.. రెండు, మూడు స్థానాలలో ఉన్నారు. ‘యాభై లక్షల ప్రైజ్ మనీ గెలిస్తే ఏం చేస్తావు? అనే ప్రశ్న వచ్చినప్పుడు రాహుల్ చెప్పిన సమాధానం కూడా వీక్షకుల గుండెల్లో హత్తుకుపోయింది. ‘ఆ డబ్బుతో బార్బర్ షాపు’ పెడతాను అని రాహుల్ అన్నాడు. కులవృత్తి మీద అతడికున్న గౌరవానికి ఆ క్షణమే బిగ్‌బాస్ వీక్షకులు ఫ్లాట్ అయిపోయి ఉంటారు. దాంతో అతడి గెలుపుపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక అతడికి ప్రధాన పోటీదారు అనుకుంటున్న శ్రీముఖి తరఫున పెద్ద సైన్యమే బయటి నుంచి పని చేస్తోంది. టాప్ యాంకర్‌గా ఆమెకున్న ఫాలోయింగే ఆమెను గెలిపిస్తుందని ధీమాగా చెబుతున్నవాళ్లు చాలామందే ఉన్నారు. శ్రీముఖికి ‘బుల్లితెర రాములమ్మ’ అని పేరు. సెలబ్రిటీలు సైతం ఆమెను గెలిపించమని ప్రతి వేదికపై పోస్టింగ్‌లు పెడుతున్నారు. చూద్దాం ఏమౌతుందో. విజేతలు ఎవరైనా.. స్టార్ మా చానెల్లో ఈ సాయంత్రం జరిగే ‘లైవ్’ ముగింపు కార్యక్రమం మాత్రం మూడు గంటలపాటు ఓ మహోత్సవంగా జరగబోతోంది. మొత్తం పదిహేడు మంది కంటెస్టెంట్లూ మళ్లీ ప్రత్యక్షం అవుతారు. ‘షో’ హోస్ట్‌లు నాగార్జున, రమ్యకృష్ణ ఎలాగూ ఉంటారు. స్పెషల్ ఎట్రాక్షన్‌గా స్టార్ హీరో చిరంజీవి కనిపించినా ఆశ్చర్యం లేదు. ‘షో’ని హిట్ చేసిందెవరు? సందేహమే లేదు.. కంటెస్టెంట్లే! ప్రతి కంటెస్టెంటూ వీక్షకుల్ని ఆకట్టుకున్నారు. అల్లరితో, కన్నీళ్లతో, ఇతరత్రా ఎమోషన్లతో అత్యంత సహజంగా బిగ్‌బాస్ పెట్టిన టాస్క్‌లన్నీ పూర్తి చేశారు. ఒకరిద్దరు ఓవర్ రియాక్ట్ అయ్యారు. వాళ్లను నాగార్జున మందలించారు. సీరియస్‌గా తీసుకోవద్దని చెప్పారు. కొందరిని అభినందించారు. ‘షో’ బిగి తగ్గకుండా నడుపుతూ హోస్ట్ చేసిన నాగార్జున కూడా హిట్‌కు ప్రధాన కారకులే. రమ్యకృష్ణ కూడా హోస్ట్‌గా ఉన్న కొద్ది రోజులూ డీసెంట్‌గా, ప్లెజెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌ను చక్కబెట్టారు. -
జర్నలిస్ట్ ఏం చేశాడు?
‘‘అమెరికా నుంచి ఏడాది తర్వాత తిరిగి వచ్చాక విన్న కథల్లో ‘దాడి’ నచ్చింది. గోకుల్ చాట్ బాంబు దాడిలో కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తి పాత్రలో కనిపిస్తా. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అలాంటి పరిణామాల వెనక అసలు నిజాన్ని రాబట్టడానికి జర్నలిస్ట్‌గా మారి ఏం చేశానన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమా తర్వాత చంద్రమహేశ్‌గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా’’ అని వరుణ్ సందేశ్ అన్నారు. జీవన్, చెరిష్మా శ్రీకర్, కారుణ్య చౌదరి ముఖ్య తారలుగా వరుణ్ సందేశ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దాడి’. మధు శోభ.టి దర్శకత్వంలో శంకర్ ఆరా, జయరాజు.టి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఏడిద శ్రీరామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, శివాజీ రాజా క్లాప్ ఇచ్చారు. మధు శోభ.టి మాట్లాడుతూ– ‘‘యూత్‌కు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సమాజంలో జరుగుతున్న పరిణామాల వెనకున్న చీకటి కోణాలను వెలికి తీసే జర్నలిస్ట్ కథ ఇది’’ అన్నారు. ‘‘మధు చెప్పిన కథ నచ్చడంతో నిర్మాతగా మారా. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం’’ అని శంకర్ ఆరా అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: ప్రసాద్ ఈదర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్. -
కొత్తగా ఉంటుంది
‘‘మా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలో చాలా సినిమాలకు రామకృష్ణ సహాయ దర్శకుడిగా పని చేసాడు. తనలో మంచి ప్రతిభ ఉంది. ‘మర్లపులి’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రంలో కొత్తదనం కనిపిస్తోంది. అన్ని వర్గాల వారికి ఈ సినిమా నచ్చుతుంది’’ అని నిర్మాత వాకాడ అప్పారావు అన్నారు. అర్చనవేద, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో వరుణ్‌సందేశ్ ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మర్లపులి’. డి.రామకృష్ణ దర్శకత్వంలో భవానీశంకర్, బి.సుధాకర్ రెడ్డి, ఐ.యస్. దినకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ‘‘ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. రామకృష్ణ, టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు సురేందర్‌రెడ్డి. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. అర్చనవేద పాత్ర కొత్తగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర చేస్తున్నారామె. నటిగా మంచి గుర్తింపు వస్తుంది. వరుణ్ సందేశ్ పాత్ర మా సినిమాకే ప్రత్యేక ఆకర్షణ. పోసాని పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు రామకృష్ణ. తాగుబోతు రమేష్, భానుశ్రీ, చమ్మక్ చంద్ర, రమణారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం బి.ఎస్. రెడ్డి, కెమెరా: ఎం. మురళీ కృష్ణ. -
కృష్ణదేవరాయల హారం కహానీ
కౌశిక్ బాబు, వరుణ్ సందేశ్, వితికా షేరు, షీనా (బిందాస్ ఫేమ్) ప్రధాన తారలుగా రూపొందిన సినిమా ‘రాయల హారం’. కర్రి బాలాజీ దర్శకత్వంలో శ్రీమల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై జి.ఎల్.బి శ్రీనివాస్–నూకల లక్ష్మణ సంతోష్‌కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘శ్రీకృష్ణదేవరాయుల కాలంనాటి ఓ హారం ప్రధానాంశంగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రమిది. విజువల్ ఎఫెక్ట్స్‌కి అధిక ప్రాధాన్యమిస్తూ వినోదాన్ని మేళవించాం. కృష్ణదేవరాయలుగా కౌశిక్ బాబు పాత్ర అద్భుతంగా ఉంటుంది. త్వరలోనే ఫస్ట్ లుక్, ఆడియో రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. ముక్తార్ ఖాన్, ధనరాజ్, ఫిష్ వెంకట్, చక్రవర్తి తదితరులు నటించిన ఈ సినిమాకి కెమెరా: కర్ణ, సంగీతం: శ్రీవత్స–మీనాక్షీ–నాగరాజు–ప్రణవ్, సమర్పణ: ఎం.ఏ.చౌదరి. -
వరుణ్‌కి డెంగ్యూ ఫీవర్
సోమవారం సాయంత్రం.. డిసెంబర్ 7న తన నిశ్చితార్ధం అంటూ ప్రకటించిన వరుణ్ సందేశ్, 24 గంటలు కూడా గడవక ముందే ఆస్పత్రిలో చేరాడు. టైఫాయిడ్ , డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న వరుణ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని వరుణ్ పెళ్లాడబోతున్న వితికా షేరు స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'నాకు కాబోయే భర్త వరుణ్ సందేశ్ టైఫాయిడ్, డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. డిసెంబర్ 7 నిశ్చితార్ధం నాటికి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నా.. మీరు కూడా వరుణ్ కోసం ప్రార్థించండి' అంటూ ట్వీట్ చేసింది. My fiancé @iamvarunsandesh is down with TYPHOID and DENGUE!!Hope he gets better by December 7th PLS PRAY FOR HIM #hospitalised — Vithika Sheru (@IamVithikaSheru) December 1, 2015