తాండూర్ వాసవీక్లబ్కు ‘సూపర్‌స్టార్’ క్లబ్ అవార్డు
తాండూర్ : తాండూర్ వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు కె.సంతోష్‌కుమార్‌కు వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ 5 స్టార్ ప్రసిడెంట్ అవార్డు దక్కింది. ఆదివారం వరంగల్‌లో జరిగిన వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయి సంకల్పం మిడ్కాన్ 2016 కార్యక్రమంలో పలు అవార్డులు ప్రకటించారు.
ఇందులో భాగంగా తాండూర్ వాసవీక్లబ్లకు సూపర్‌స్టార్ క్లబ్ అవార్డు రాగా, క్లబ్ అ«ధ్యక్షుడు సంతోష్‌కు 5 స్టార్ అవార్డు దక్కింది. ఈ అవార్డును క్లబ్ గోల్డెన్ స్టార్ పబ్బ విజయ్‌కుమార్ అందజేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ గవర్నర్ ముక్తా శ్రీనివాస్, జోన్ చైర్మన్ బోనగిరి వేణుగోపాల్, ఇంటర్నేషనల్ సభ్యులు రేణుకుంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.