Vedagiri ram babu
-
వేదగిరి రాంబాబు కన్నుమూత
హైదరాబాద్ : శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో కథానిక సదస్సు లు నిర్వహిస్తూ సంపాదించిందంతా సాహిత్యానికి ధారపోసిన కథానిక జీవి వేదగిరి రాంబాబు(66) శనివారం కన్నుమూశారు. న్యూరోపతి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాంబాబు ఆరోగ్యం శనివారం విషమించడంతో వెంటనే హైదర్‌గూడ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహా న్ని బాగ్‌లింగంపల్లిలోని ఆయన నివాసానికి తరలించినట్లు కుమారుడు విజయ్ చెప్పారు. రెండు నంది అవార్డులు ఆంధ్రప్రదేశ్ తెనాలిలోని సుండూరులో జన్మించిన రాంబాబు.. ఉన్నత చదువులు చదివినా తెలుగు భాషకు సేవ చేయాలని జర్నలిస్టుగా పని చేశారు. ఆయన రాసిన ‘జైలుగోడల మధ్య’ అనే నవల రాంబాబుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆ తరువాత దూరదర్శన్‌లో పాపం పసివాళ్ళు సీరియల్, తెలుగు భాషా కథనిక సదస్సులు నిర్వహించడంతో పాటు యువ కథానిక రచయితలను ప్రోత్సహించేందుకు వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం ప్రారంభించారు. గురజాడ వేంకట అప్పారావు నివాసాన్ని లైబ్రరీగా మార్చడంతో పాటు ఎన్నో పుస్తకాలు రాశారు. వైద్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ‘మన ఆరోగ్యం’హెల్త్ మ్యాగజైన్‌కు గౌరవ సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గాను రెండు నంది అవార్డులు కూడా అందుకున్నారు. -
పాఠకుడిని ఆకట్టుకునే రచనలు రావాలి
హైదరాబాద్: ప్రతి రచయితా పాలగుమ్మి పద్మ రాజును ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన జనం కోసం రచనలు చేసేవారని ప్రముఖ కథా రచయిత వేదగిరి రాంబాబు అన్నారు. ఇప్పుడు వస్తున్న రచనల్లో శిల్పం లేక కథనం దెబ్బతింటోందన్నారు. ప్రముఖ రచయత వాణిశ్రీ రచించిన ‘మా కథలు-2013’ పుస్తకాన్ని రవీంద్రభారతిలో ఆదివారం ఆయున ఆవిష్కరించారు. తెలుగు కథారచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. కొంతమంది కథ చరిత్ర తెలి యకుండా రాస్తుంటారని, కథ ముగింపు పాఠకుడిని ఆలోచింపజేసేలా ఉండాలన్నారు. ప్రజల్ని ఆకట్టుకునే రచనలు రావాలని సూచిం చారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ కథా రచయితలు వారి కథలను వారే మెచ్చుకోవడం గొప్ప కాదని, ఇతరులు మెచ్చుకున్నప్పుడే పాఠకాదరణ పొందుతాయన్నారు. రచయితలు తవు కథల్లో కొత్తదనం ఉండేలా చూసుకోవాలని సూచించారు. రచయితలు వీరాజీ, కన్నెగంటి అనసూయ తదితరులు పాల్గొన్నారు.