పాఠకుడిని ఆకట్టుకునే రచనలు రావాలి
హైదరాబాద్: ప్రతి రచయితా పాలగుమ్మి పద్మ రాజును ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన జనం కోసం రచనలు చేసేవారని ప్రముఖ కథా రచయిత వేదగిరి రాంబాబు అన్నారు. ఇప్పుడు వస్తున్న రచనల్లో శిల్పం లేక కథనం దెబ్బతింటోందన్నారు. ప్రముఖ రచయత వాణిశ్రీ రచించిన ‘మా కథలు-2013’ పుస్తకాన్ని రవీంద్రభారతిలో ఆదివారం ఆయున ఆవిష్కరించారు. తెలుగు కథారచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. కొంతమంది కథ చరిత్ర తెలి యకుండా రాస్తుంటారని, కథ ముగింపు పాఠకుడిని ఆలోచింపజేసేలా ఉండాలన్నారు.
ప్రజల్ని ఆకట్టుకునే రచనలు రావాలని సూచిం చారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ కథా రచయితలు వారి కథలను వారే మెచ్చుకోవడం గొప్ప కాదని, ఇతరులు మెచ్చుకున్నప్పుడే పాఠకాదరణ పొందుతాయన్నారు. రచయితలు తవు కథల్లో కొత్తదనం ఉండేలా చూసుకోవాలని సూచించారు. రచయితలు వీరాజీ, కన్నెగంటి అనసూయ తదితరులు పాల్గొన్నారు.