Veera Bhadra Swamy
-
AP: డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా కోలగట్ల నామినేషన్
సాక్షి, అమరావతి: శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులకు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో కోలగట్ల వెంట బీసీ సంక్షేమం, పౌర సంబంధాల శాఖ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చీఫ్విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, పుష్పశ్రీవాణి, శంబంగి చిన్నప్పలనాయుడు తదితరులున్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కోలగట్ల స్పీకర్ తమ్మినేని సీతారాంను మర్యాదపూర్వకంగా కలిశారు. గడువు ముగిసే సమయానికి కోలగట్ల మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సోమవారం లాంఛనంగా ప్రకటించనున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి గురువారం రాజీనామా చేయడంతో ఆ పదవికి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ను శాసనసభలో శుక్రవారం స్పీకర్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలవరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువుగా తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఎన్నిక నిర్వహిస్తామని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. -
దక్షిణ కాశీగా పేరు.. కన్నడిగులతో కిక్కిరిస్తున్న కోవెల.. ఎక్కడంటే?
వైఎస్ఆర్ జిల్లా(సంబేపల్లె): దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ వీరభద్రస్వామి రాచవీడు రేడుగా విరాజిల్లుతున్నారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి పట్టణ నడిబొడ్డున 11వ శతాబ్దంలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రాలయం నెలకొని దినదినాభివృద్ధి చెందుతోంది. 8వ శతాబ్దపు రాజరాజచోళుడు, 11వ శతాబ్దపు కాకతీయ గణపతిదేవుడు, శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్ర అభివృద్ధికి బాటలు వేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. వీరభద్రస్వామి వీరశైవులకు ఇలవేల్పుగా వెలుగొందుతున్నారు. ఈ ఆలయంలో ప్రతి యేటా మాఘమాస బహుళ ఏకాదశి నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి స్థానిక భక్తులతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా వస్తుంటారు. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలైన అగ్నిగుండప్రవేశం, మహానైవేద్యం, రథోత్సవం కార్యక్రమాలు కీలకం. అంతేకాకుండా ప్రతి అమావాస్య నాడు కర్ణాటక భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటుంటారు. 1980లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో కొన్ని అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీరభద్రాలయానికి పశ్చిమాన రాజగోపురం నిర్మాణంతో పాటు సాలహారం నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.58 కోట్లను మంజూరు చేయించగా మరో రూ.38 లక్షలతో విమాన గోపురం, గర్భాలయ అభివృద్ధి పనులను చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల రాకను దృష్టిలో ఉంచుకున్న వీరభద్రాలయ అధికారులు ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేసి బస సౌకర్యాలను కల్పిస్తున్నారు. చదవండి: శవమే శివం.. భోజనం 2 పూటలే.. శుభకార్యాలకు దూరం -
ఉగ్రరూపంలో వీరభద్రస్వామి
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన చారిత్రక పట్టణం లేపాక్షి. మధ్యయుగం నాటి శిల్పకళా నిర్మాణంలో ఒక పురాతన శివాలయం ఇక్కడ కొలువు తీరి ఉంది. ఈ ఆలయంలోని శివలింగానికి సుమారు 30 అడుగుల ఎత్తువరకు పాము చుట్టలు చుట్టుకొని ఉన్నట్లు కనువిందు చేస్తుంది. పై కప్పు కూడా లేకుండా ఈ విగ్రహం ఆరుబయట దర్శనమిస్తుంది. ఇక్కడ స్తంభాలు, మండపాలతో పాటు అనేక శివలింగాలతో కూడిన ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతున్నాయి. విశాలమైన ఆవరణ మధ్యభాగంలో కొలువుతీరి ఉండటం ఈ ఆలయ విశిష్టత. ఇక్కడి మూలవిరాట్టు వీరభద్రస్వామి. ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహం ఉంటుంది. సాధారణంగా దేవుడు మనకు గుడి బయట నుంచి కనపడతాడు. వీరభద్రస్వామిది ఉగ్రరూపం, ఆయన కోపపు చూపులు సూటిగా గ్రామం మీద పడకూడదు. అందువల్ల ఈ ఆలయ ముఖద్వారం కొంచెం పక్కకు ఉంటుంది. ఇది ఈ ఆలయ విశేషం. ఇక్కడి వేలాడే స్తంభం ఈ గుడికి ముఖ్య ఆకర్షణ. ఈ స్తంభం కింద నుంచి మనం ఒక పల్చటి వస్త్రాన్ని అతి సులువుగా తీయగలుగుతాం. ఇది అప్పటి శిల్పకారుల నైపుణ్యానికి తార్కాణం. ఇక్కడి వీరభద్రస్వామిని మహిమలు గల దేవునిగా కొలుస్తారు. –డా. వైజయంతి -
చంద్రబాబును సాగనంపేందుకు ప్రజలు సిద్ధం
పామూరు: అబద్ధాలతో ముఖ్యమంత్రి గద్దెనెక్కిన చంద్రబాబును 2019లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మోసపూరిత వైఖరిని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో చేపట్టిన గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు దోచుకోవడం ఆయన కుమారుడు దాచుకోవడం కోసమే పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలు వైఎస్ పాలనను జగన్రూపంలో కోరుకుంటున్నారన్నారు. నోట్ల కష్టాలు ప్రారంభమై 25 రోజులు కావస్తున్నా, ప్రజల కష్టాలు వివరించడానికి చంద్రబాబు ఒక్కసారైనా ఢిల్లీ వెళ్లలేదన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఐక్యంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు బొల్లా మాల్యాద్రిచౌదరి, జిల్లా కార్యదర్శి అంబటి కొండారెడ్డి, కార్యవర్గ సభ్యులు కల్లూరి రామిరెడ్డి, పార్టీ పట్టణ అధక్షుడు ఎస్కే సెంట్రింగ్చాంద్బాషా, ఎంపీటీసీ సభ్యులు ఎస్కే రషీద్, ఇర్రి కోటిరెడ్డి, పార్టీ జిల్లా యూత్ కార్యదర్శి ఇర్రి కృష్ణారెడ్డి, మునగల వెంకటరెడ్డి, కొత్తూరి రవి, ఉప సర్పంచ్ గట్లా విజయభాస్కరరెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు జి.రవీంద్రబాబు, మైనారిటీ సెల్ అద్యక్షుడు ఎస్కే ఇస్మారుుల్, ఎస్కే చినహాజీ, బడబాగ్ని రాజు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. లోక్సత్తా నియోజకవర్గ అధ్యక్షుడు తడికమళ్ల వెంకట క్రిష్ణ సుబ్బారావు మర్యాద పూర్వకంగా వీరభద్రస్వామిని కలిశారు.