చంద్రబాబును సాగనంపేందుకు ప్రజలు సిద్ధం | Veera Bhadra Swamy about chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును సాగనంపేందుకు ప్రజలు సిద్ధం

Published Mon, Dec 5 2016 3:31 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

చంద్రబాబును సాగనంపేందుకు ప్రజలు సిద్ధం - Sakshi

చంద్రబాబును సాగనంపేందుకు ప్రజలు సిద్ధం

పామూరు:  అబద్ధాలతో ముఖ్యమంత్రి గద్దెనెక్కిన చంద్రబాబును 2019లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మోసపూరిత వైఖరిని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు  పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో చేపట్టిన గడప గడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు దోచుకోవడం ఆయన కుమారుడు దాచుకోవడం కోసమే పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలు వైఎస్ పాలనను జగన్‌రూపంలో కోరుకుంటున్నారన్నారు. నోట్ల కష్టాలు ప్రారంభమై 25 రోజులు కావస్తున్నా, ప్రజల కష్టాలు వివరించడానికి చంద్రబాబు ఒక్కసారైనా ఢిల్లీ వెళ్లలేదన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఐక్యంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని  పిలుపునిచ్చారు.

సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు బొల్లా మాల్యాద్రిచౌదరి, జిల్లా కార్యదర్శి అంబటి కొండారెడ్డి, కార్యవర్గ సభ్యులు కల్లూరి రామిరెడ్డి, పార్టీ పట్టణ అధక్షుడు ఎస్‌కే సెంట్రింగ్‌చాంద్‌బాషా, ఎంపీటీసీ సభ్యులు ఎస్‌కే రషీద్, ఇర్రి కోటిరెడ్డి, పార్టీ జిల్లా యూత్ కార్యదర్శి ఇర్రి కృష్ణారెడ్డి, మునగల వెంకటరెడ్డి, కొత్తూరి రవి, ఉప సర్పంచ్ గట్లా విజయభాస్కరరెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు జి.రవీంద్రబాబు, మైనారిటీ సెల్ అద్యక్షుడు ఎస్‌కే ఇస్మారుుల్, ఎస్‌కే చినహాజీ, బడబాగ్ని రాజు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. లోక్‌సత్తా నియోజకవర్గ అధ్యక్షుడు తడికమళ్ల వెంకట క్రిష్ణ సుబ్బారావు మర్యాద పూర్వకంగా వీరభద్రస్వామిని కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement