vegetable seller
-
కూరగాయల వ్యాపారి దారుణం
-
కూరగాయల వ్యాపారి రూ.21 కోట్ల స్కాం: మాస్టర్ మైండ్ కోసం వేట
ఇంట్లో నుంచే పని, రివ్యూలు రాసే పార్ట్‌టైమ్ ఉద్యోగంతో భారీ ఆదాయం అంటూ కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలి ప్పిస్తానని మభ్య పెట్టి ఆరు నెలల్లో 21 కోట్లు ఆర్జించాడు. చివరికి డెహ్రాడూన్‌కు చెందిన వ్యాపారవేత్త ఫిర్యాదుతో అడ్డంగా బుక్కయ్యాడు. 10 రాష్ట్రాల్లో, 37 ఫ్రాడ్ కేసులు సహా, 855 ఇతర కేసులలో ఇతడిదే కీలక పాత్ర అని తేలింది. దీంతో అతనిపై పలు కేసులు నమోదు చేశారు. విచారణలో వెలుగు చూసిన విషయాలతో పోలీసులే నివ్వెరపోయారు. ఉత్తరాఖండ్ పోలీసు అధికారుల సమాచారం ప్రకారం రిషబ్ శర్మ ఫరీదాబాద్‌లో కొన్నేళ్లుగా కూరగాయల వ్యాపారం చేసుకునే వాడు. కానీ ఆ తరువాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పేరుతో రూ. 21 కోట్ల మోసానికి తెగబడ్డాడు. అయితే తాజా బాధితుడు, డెహ్రాడూన్‌కు చెందిన వ్యాపారవేత్త రూ. 20 లక్షల మోసపోయాడు. దీంతో అతను ఉత్తరాఖండ్‌లోని పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు అక్టోబర్ 28న రిషబ్ శర్మను అరెస్ట్ చేశారు. సైబర్ స్కామర్‌గా ఏలా మారాడంటే...! కరోనా ఆంక్షల కారణంగా కూరగాయల వ్యాపారి గుర్గావ్కు రిషబ్ శర్మ కూడా భారీగా నష్టపోయాడు. దుకాణాన్ని మూసివేశాడు. ఈ సమయంలోనే కుటుంబ పోషణ నిమిత్తం వర్క్ ఫ్రం హోం ఆఫర్లపై దృష్టి పెట్టాడు. అలా అప్పటికే ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న పాత స్నేహితుడిని కలిశాడు. తాను కూడా రంగంలోకి దిగి పోయాడు. పలువుర్ని మోస పుచ్చటం మొదలు పెట్టాడు. దీని ద్వారా ఊహించని ఆదాయం లభించడంతో మరింత రెచ్చి పోయాడు. అలా కూరగాయల వ్యాపారి కాస్తా సైబర్ స్కామర్‌గా మారాడు. లక్షల మందిని మోసం చేశాడు. కేవలం ఆరు నెలల్లోనే అతను రూ. 21 కోట్లు సంపాదించాడని ఉత్తరాఖండ్ సీనియర్ పోలీసు అధికారి అంకుష్ మిశ్రా తెలిపారు. హోటల్ చైన్ అసలు వెబ్సైట్ మారియట్ డాట్ కామ్ పోలిన "మారియట్ బోన్వాయ్" పేరుతో నకిలీ వెబ్ సైట్ సృష్టించడమే అతని పని. తన ఉచ్చులో పడిన బాధితులకు హోటల్ యజమానిని అని, తన ఒక హోటల్లో పని చేస్తున్న సహోద్యోగి సోనియాను కూడా పరిచయం చేస్తాడు. ఆ హోటల్‌కు నకిలీ రివ్యూ రైటర్లకు తొలుత రూ.10 వేలు చెల్లించే వారిని ఆకర్షిస్తాడు. ఇందుకోసం టెలిగ్రామ్ గ్రూపును కూడా ప్రారంభించాడు. ఈ క్రమంలోనే డెహ్రాడూన్‌కు చెందిన బడా వ్యాపారికి ఈ ఏడాది ఆగస్టు 4న వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులోని నంబరుకు కాల్ చేయడం ఆలస్యం రిషబ్ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. ఇందులో భాగంగానే ఒక్కో రివ్యూకు రూ.10 వేలు చొప్పున రెండుసార్లు చెల్లించడంతో రిషబ్‌పై పూర్తి నమ్మకం ఏర్పడింది. దీంతో ఏకంగా రూ.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు సదరు వ్యాపారి. తరువాత రిటర్న్స్ గురించి అడిగితే మరింత పెట్టుబడి పెట్టాలని డిమాండ్ చేశాడు. ఇక ఆ తరువాతనుంచి ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రిషబ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో కీలక విషయాలను రాబట్టారు. ఇతర దేశాలకు రహస్యంగా పంపే ముందు దొంగిలించిన డబ్బు కోసం బ్యాంకు ఖాతాలను తెరవడానికి భారతదేశంలోని వ్యక్తులను నియమించు కునే అంతర్జాతీయ క్రిమినల్ గ్రూపులతో సంప్రదింపులు జరుపుతున్నాడని గుర్తించారు క్రిప్టో రూపంలో చైనా, సింగపూర్ వంటి దేశాల నిర్వాహకులకు కోట్లాది రూపాయలు చేరివేసినట్టు అంచనా వేశారు. అంతర్జాతీయ ముఠాలలో ఒకదానికి ఏజెంట్ అని, సాధారణంగా, ఈ ఏజెంట్లకు అసలు సూత్రధారి గురించి ఎటువంటి సమాచారం ఉండదని, మాస్టర్ మైండ్‌ని పట్టుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మిశ్రా తెలిపారు.. -
Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా..
అటెన్షన్... మీ ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది. డ్రైనేజీ వాటర్‌లో కడిగిన కూరగాయలు మీ వంటింటికి చేరుతున్నాయి. దయచేసి కూరగాయను కొనేముందు ఓ క్షణం ఆలోచించండి.. మరింత అవగాహన పెంచుకోండి.. అనే క్యాప్షన్‌తో ట్విటర్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. చూశారంటే యాక్.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన ఓ గుర్తుతెలియని కూరగాయల వ్యాపారిపై కేసు ఫైల్ అయ్యింది. ఏం చేశాడో తెలెస్తే మీకు స్పృహ తప్పుతుంది. పొద్దుపొద్దునే తాజా కొత్తమీర కట్టల్ని సింథికాలనీ రోడ్డుపై లీకైపారుతున్న డ్రైనేజీ వాటర్‌లో కడిగాడు మరి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైనేజీ నీళ్లతో కడిగితే ఆరోగ్యానికి ప్రమాదమని వీడియో తీసిన వ్యక్తి పదేపదే చెబుతున్నా సదరు వ్యాపారి మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడట. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! దీంతో జిల్లా కలెక్టర్ అవినాష్ లవనియా... ఈ కల్తీ, కలుషిత ఆహార సమాచార సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆహార శాఖ, పౌర అధికారులకు ఆదేశించినట్లు మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా భోపాల్ జిల్లా ఆహార భద్రత అధికారి దేవేంద్ర కుమార్ దుబే ఐపీసీ సెక్షన్ 269 కింద సరదు గుర్తుతెలియని వ్యాపారిపై కేసు ఫైల్ చేశామని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెల్పారు. కాబట్టి.. కూరగాయల వ్యాపారుల దగ్గర కూరగాయాలు కొనే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించిమరీ కొంటే మంచిది. ఏం తింటున్నామో.. ఎలాంటి ఆహారం కొంటున్నామో.. తెలసుకోకపోతే బతుకు డ్రైనేజి పాలౌతుంది! చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. सावाधान देखिए आपकी सेहत से कैसे हो रहा खिलवाड़, कंही पर ऐसी सब्जी तो नही खरीद रहे ,भोपाल के सिंधी कॉलोनी में नाली के पानी से धुक रही सब्जी @bhupendrasingho जी @CollectorBhopal @digpolicebhopal मामले पर संज्ञान लेकर उचित कार्यवाही का आग्रह है , @KamalPatelBJP @DrPRChoudhary pic.twitter.com/10Em39YxPz — sudhirdandotiya (@sudhirdandotiya) October 26, 2021 -
కూరగాయలమ్ముతున్న ప్రముఖ డైరెక్టర్
కలర్స్ టీవీలో ప్రసారం అయిన ‘బాలికా వధు’ సీరియల్‌కి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఈ సీరియల్ మంచి జనాదరణ పొందింది. తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’ పేర డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంత పేరు తెచ్చుకున్న సీరియల్ డైరక్టర్ ప్రస్తుతం ఓ తోపుడు బండి మీద కూరగాయలమ్ముకుంటున్నాడు. వినడానికి కాస్త బాధగా ఉన్న ఇది మాత్రం వాస్తవం. కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు ఇవి. వివరాలు.. బాలికా వధు సీరియల్ దర్శకుల్లో ఒకరైన రామ్ వ్రిక్ష గౌర్ ప్రస్తుతం అజంగఢ్ జిల్లాలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఓ సినిమా కోసం రెక్కి నిర్వహించడానికి నేను అంజగఢ్ వచ్చాను. ఇంతలో లాక్డౌన్ విధించారు. నేను తిరిగి వెళ్లలేకపోయాను. ఇక సినిమా కూడా ఆగిపోయింది. నిర్మాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయమే పడుతుందని తెలిపాడు. దాంతో నేను నా తండ్రి వ్యాపారాన్ని నిర్వహించాలనుకున్నాను. అందుకే ఇలా తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముతున్నాను. దీని గురించి నేను సిగ్గుపడటం లేదు’ అన్నారు రామ్ వ్రిక్ష. (చదవండి: రాఖీలు అమ్ముకుంటున్న సీరియల్ నటి) రామ్ వ్రిక్ష తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ‘2002లో నా స్నేహితుడు, రచయిత షహనాజ్ ఖాన్ సాయంతో ముంబై వెళ్లాను. తొలుత లైట్ డిపార్ట్మెంట్లో పని చేశాను. తర్వాత సీరియల్ ప్రొడక్షన్ శాఖలో పనికి కుదిరాను. అలా ఒక్కొ మెట్టు ఎక్కుతూ అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను. ఆ తర్వాత ‘బాలికా వధు’ సీరియల్‌కి ఎపిసోడ్ అండ్ యూనిట్ డైరెక్టర్‌గా పని చేశాను’ అని తెలిపారు. రామ్ వ్రిక్ష.. యశ్పాల్ శర్మ, మిలింద్ గునాజీ, రాజ్‌పాల్ యాదవ్, రణదీప్ హుడా, సునీల్ శెట్టి వంటి దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కరోనా తగ్గిన తర్వాత అతడు ఓ భోజ్‌పురి చిత్రానికి, హిందీ చిత్రానికి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాక ముంబైలో తనకు సొంత ఇళ్లు ఉందని.. తప్పకుండా తిరిగి వెళ్తానని అప్పటివరకు తనకు చేతనైన కష్టం చేసి పొట్టపోసుకుంటానని తెలిపారు రామ్ వ్రిక్ష. -
పీహెచ్డీ చేసి.. కూరగాయలు అమ్ముతోంది
భోపాల్: ఇండోర్‌లోని ఓ కూరగాయల మార్కెట్లో మున్సిపల్ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా ఓ యువతి నిరసన తెలుపుతోంది. చుట్టు ఉన్నవారు ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. నిరసన తెలిపితే ఆశ్చర్యం పోవడం ఎందుకు అనుకుంటున్నారా.. కారణం ఉంది. ఆమె స్పష్టమైన ఇంగ్లీష్‌లో నిరసన తెలుపుతుండటంతో చుట్టు ఉన్న వారు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వివరాలు.. రైసా అన్సారీ అనే యువతి ఇండోర్‌లోని దేవి అహల్య యూనివర్సిటీ నుంచి మెటిరియల్ సైన్స్‌లో పీహెచ్డీ చేసింది. కానీ ఉద్యోగం లభించలేదు. ఇదిలా ఉండగానే.. కరోనా వచ్చి పరిస్థితులను మరింత దిగజార్చింది. (ఆ కథనంపై చలించిన సోనూసూద్) In Indore a vegetable vendor Raisa Ansari protested against the municipal authorities when they came to remove the handcarts of vegetables.The woman later claimed that she has done Phd in Materials Science from DAVV Indore. @ndtvindia @ndtv @GargiRawat #lockdown #COVID19 pic.twitter.com/RieGffTMyP — Anurag Dwary (@Anurag_Dwary) July 23, 2020 ఈ క్రమంలో సదరు యువతి కుటుంబానికి తోడుగా ఉండాలని భావించింది. దాంతో ఓ తోపుడు బండి మీద కూరగాయలు, పండ్లు అమ్మడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. గురువారం మున్సిపల్ అధికారలు వచ్చి.. రోడ్డు పక్కన ఉన్న తోపుడు బండ్లను తొలగించాల్సిందిగా ఆదేశించారు. దాంతో అన్సారీ మిగితావారితో కలిసి మున్సిపల్ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా నిరసనకు దిగింది. అధికారులు తమను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో స్పష్టమైన ఇంగ్లీష్‌లో తెలిపింది. ఈ సదర్భంగా అన్సారీ మాట్లాడుతూ.. ‘ఓ పక్క మార్కెట్‌ను క్లోజ్ చేశారు. కూరగాయలు కొనడానికి ఎవరూ రావడం లేదు. ఇక్కడ నేను, నా కుటుంబ సభ్యులు, స్నేహితులం 20 మంది దాకా ఇలా తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకుంటున్నాం. కానీ అధికారులు వచ్చి బండ్లను తొలగించమంటున్నారు. మరి మేం ఏం తిని బతకాలి’ అని ప్రశ్నించారు. (రాఖీలు అమ్ముకుంటున్న సీరియల్ నటి) ఇంతలో కొందరు ‘ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు.. ఏం చదివారు’ అని అన్సారీని అడిగితే పీహెచ్డీ చేశానని చెప్పారు. ‘మరి ఉద్యోగం చేయవచ్చుగా’ అని అడిగితే.. నా పేరు చూసి ఎవరు నాకు ఉద్యోగం ఇవ్వడం లేదని వాపోయారు. ప్రస్తుం ఈ వీడియో తెగ వైరలవుతోంది. -
వీలైతే కొనండి, లేదా ఫ్రీగా తీసుకెళ్లండి
ఔరంగాబాద్: కొండంత చేసినా, గోరంత చేసినా సాయం విలువ మారదు. కరోనా విపత్తు వల్ల పూట గడవటమే కష్టంగా మారిన నిరుపేదల గురించి ఆలోచించిన ఓ కూరగాయల వ్యాపారి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. ఉచితంగా కూరగాయలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఔరంగాబాద్‌కు ఎందిన రాహుల్ లాబ్డే ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్డౌన్ వల్ల కంపెనీ జీతాలివ్వడం మానేసింది. దీంతో అతను తన తండ్రితో కలిసి కూరగాయాల వ్యాపారం చేస్తున్నాడు. ఓ రోజు అతని బండి దగ్గరకు ఓ వృద్ధురాలు వచ్చి రూ.5కు కూరగాయలివ్వమని అడిగింది. (ఆవు అంత్యక్రియలు: గుంపులుగా జనం) దీంతో విస్తుపోయిన లాబ్డే ఆమె దీన స్థితిని అర్థం చేసుకుని ఉచితంగా కూరగాయలిచ్చాడు. ఆ క్షణమే అతనిలో నిరుపేదలకు సాయం చేయాలన్న ఆలోచన మనసులో బలంగా నాటుకుంది. వెంటనే తన కూరగాయల బండికి ఒక బోర్డు తగిలించాడు. అందులో "వీలైతే కొనండి, లేదంటే ఉచితంగా తీసుకోండి" అని రాసి ఉంది. దీన్ని గమనించిన జనం కొందరు విడ్డూరంగా చూడగా మరికొందరు మాత్రం అతని నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.2 వేలు విలువ చేసే కూరగాయలను ఉచితంగా ఇచ్చాడు. దీని గురించి లాబ్డే మాట్లాడుతూ.. 'రోజు ముగిసే సరికి ఆకలితో ఎవరూ నిద్రించవద్ద'న్నదే తన కోరిక అని చెప్తూ మంచి మనసును చాటుకున్నాడు. (‘ఈ ఫోటోలకు అరెస్ట్ కాదు.. అవార్డు ఇవ్వాలి’) -
టాపర్‌గా కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు
పట్నా : చదువుకు డబ్బుతో సంబంధం లేదనే విషయం మరోసారి రుజువైంది. కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు బిహార్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టాపర్‌గా నిలిచాడు. ఓవైపు తండ్రికి సాయంగా ఉంటూనే.. మరోవైపు చదువులో మెరుగైన ఫలితాలు సాధించిన అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. బిహార్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ మంగళవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. ఈ పరీక్షలకు మొత్తం 15.29 లక్షల మంది హాజరవ్వగా.. 12.4 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్ష ఫలితాల్లో రోహ్తాస్ జిల్లాలోని జనతా హైస్కూల్‌కు చెందిన హిమాన్ష్ రాజ్ టాపర్‌గా నిలిచాడు. 500 మార్కులకు గానూ హిమాన్ష్ 482 మార్కులు సాధించాడు. కాగా, హిమాన్ష్ తండ్రి కూరగాయల అమ్మకం సాగిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో హిమాన్ష్ టాపర్‌గా నిలవడంతో.. అతని స్వగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అయితే హిమాన్ష్ రోజుకు 14 గంటల పాటు చదువుకుంటూనే.. కూరగాయల షాప్‌లో తన తండ్రికి సాయం కూడా చేసేవాడని తెలిసింది. హిమాన్ష్‌కు చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం ఉందని, చాలా తెలివైనవాడని అతని ఉపాధ్యాయులు తెలిపారు. కాగా, ఇంజనీర్ కావాలన్నదే తన లక్ష్యమని హిమాన్ష్ చెప్పాడు. -
కొత్త రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తికి ఎంతకష్టం?
రాంచీ: కొంతమంది బాగా కష్ట పడతారు.. కానీ దానిఫలితాలు మాత్రం వేరేవారు అనుభవిస్తారు. అలా అనుభవించేవారినే సమాజం పట్టించుకుంటుందిగానీ, అందుకు కారణమైన వ్యక్తిని మాత్రం మర్చిపోతుంది. జార్ఖండ్‌లో సరిగ్గా ఇదే జరిగింది. ఆయన ఒక ఉద్యమకారుడు. ఆత్మగౌరవం నిండుగా ఉన్నవాడు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం నడుంకట్టాడు. అసలు రాష్ట్ర సాధన అనే తలంపుతో తొలుత ఉద్యమ సంస్థను స్థాపించిందే ఆయనే. దాదాపు పదేళ్లపాటు ఉధృతంగా పోరాటం చేశాడు. లాఠీ దెబ్బలు తిన్నాడు. జైలుకు వెళ్లాడు. అతడి కష్టానికి, ఆశలకు తగినట్లుగానే కొత్త రాష్ట్రం వచ్చింది కానీ, ఇప్పుడా వ్యక్తి ఓ మార్కెట్ మూలన కూరగాయలు అమ్ముకుంటున్నాడు. అదే మరోచోట అయితే, సత్కారాలు, పదవుల సంగతి ఎట్లున్నా కనీసం మర్యాదతో వ్యవహరించేవారేమో.. పూర్తి వివరాల్లోకి వెళితే.. బినోద్ భగత్ అనే వ్యక్తి జార్ఖండ్ రాష్ట్రం కోసం తొలుత సమరశంఖం పూరించారు. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ స్థాపించి క్షేత్ర స్థాయి నుంచి ఉద్యమానికి ఊపిరిలూదాడు. అర్థశాస్త్రం, జర్నలిజంలో రాంఛీ యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన సౌత్ ఈస్ట్రన్ రైల్వే ధనబాద్‌లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టారుగా పనిచేశారు. అయితే, ఎప్పుడైతే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఊపొచ్చిందో అప్పుడే ఆయన 1986లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష పోరాటంలోకి దూకారు. దాదాపు పదేళ్లపాటు విస్తృతంగా పనిచేశారు. జైలుకు వెళ్లారు. 1995లో జార్ఖండ్‌ను స్వతంత్ర ప్రతిపత్తిగల మండలిగాప్రకటించిన సమయంలో ఆయన కౌన్సిలర్‌గా కూడా పనిచేశారు. అయితే, సహజంగానే ఆత్మాభిమానం కల వ్యక్తి కావడంతో కొందరు అవినీతిపరులతో మసలలేకపోయారు. 2000లోనే బిహార్ నుంచి విడివడి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఆయన కింద పనిచేసిన వారు సైతం ఇప్పుడు గొప్పగొప్ప పదవులు అనుభవిస్తూ దర్జాగా తిరుగుతుండగా ఆయన మాత్రం కూరగాయాలు అమ్ముకుంటున్నారు. ‘ఆర్థిక సమస్యల కారణంగా ఒకప్పుడు నేటి ప్రధాని మోదీ టీ అమ్మేవారు. ఇప్పుడు నేను కూడా అదే పరిస్థితులతో కూరగాయలు అమ్ముకుంటున్నాను. 1986లో నా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యేక జార్ఖండ్కోసం కష్టపడ్డాను. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునేందుకు నేనేమీ సిగ్గుపడటం లేదు. అవినీతి చర్యలకు పాల్పడి డబ్బు సంపాధించేకంటే ఇదే మంచి పని. నాకు సంతృప్తి దొరుకుతుంది. నా జీవితంలో ఇదే కొంత ఇబ్బందికరమైన దశ. అయితే, త్వరలోనే వెళ్లిపోతుంది’ అంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 55 ఏళ్ల వయసులో ఉన్న ఆయన జార్ఖండ్ మైనింగ్‌పై పరిశోధన చేస్తున్నారు.