కలప అక్రమ రవాణా
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా కలపను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరేడిగొండ మండలంలోని తండా చెక్ పోస్టు వద్ద అటవీ శాఖ అధికారులు మంగళవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా టేకును అక్రమంగా రవాణా చేస్తున్న ఐకేర్ వాహనాన్ని సీజ్ చేశారు.
వాహన డ్రైవర్ , క్లీనర్ పరారైయ్యారు. పట్టుకున్న కలప విలువ సుమారు రు. 2 లక్షలు ఉంటుందని ఎఫ్ఆర్సీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(నేరేడిగొండ)