కలప అక్రమ రవాణా | wood smuggling in adilabad distirict | Sakshi
Sakshi News home page

కలప అక్రమ రవాణా

Published Tue, Feb 10 2015 11:02 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

wood smuggling in adilabad distirict

ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా కలపను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరేడిగొండ మండలంలోని తండా చెక్ పోస్టు వద్ద అటవీ శాఖ అధికారులు మంగళవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా టేకును అక్రమంగా రవాణా చేస్తున్న ఐకేర్ వాహనాన్ని సీజ్ చేశారు.

వాహన డ్రైవర్ , క్లీనర్ పరారైయ్యారు. పట్టుకున్న కలప విలువ సుమారు రు. 2 లక్షలు ఉంటుందని ఎఫ్ఆర్సీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(నేరేడిగొండ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement