Velaikaran
-
వేలైక్కారన్‌తో హ్యాపీ
తమిళ సినిమా: వేలైక్కారన్ చిత్రం సాధిస్తున్న వసూళ్లతో తనకు చాలా సంతోషం, సంతృప్తి కలుగుతోందని ఆ చిత్ర దర్శకుడు మోహన్‌రాజా పేర్కొన్నారు. శివకార్తికేయన్, నయనతార జంటగా నటించిన చిత్రం వేలైక్కారన్. మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని 24ఏఎం.స్టూడియోస్ పతాకంపై ఆర్డీ.రాజా నిర్మించారు. అనిరుద్ సంగీతాన్ని అందించారు. క్రిస్మస్ పండగ సందర్భంగా ఈ నెల 22వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్‌రాజ్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ వేలైక్కారన్ చిత్రం సాధిస్తున్న వసూళ్లు చాలా సంతృప్తిగా ఉన్నాయన్నారు. ఈ చిత్రం ఇంతకు ముందు శివకార్తికేయన్ నటించిన చిత్రాలన్నిటి కంటే అధిక వసూళ్లను సాధిస్తోందని తెలిపారు. తమిళనాడులోనే కాకుండా కర్ణాటక, కేరళ ప్రేక్షకులు వేలైక్కారన్ చిత్రానికి విశేష ఆదరణ చూపుతున్నారని చెప్పారు. ముఖ్యంగా కేరళలో మరో 30 స్క్రీన్స్‌ను అదనంగా పెంచారని తెలిపారు. ఇక ఓవర్సీస్లో వేలైక్కారన్కు అనూహ్య ఆదరణ లభిస్తోందని చెప్పారు. వేలైక్కారన్ చిత్ర వసూళ్ల గణాంకాలను బట్టి చిత్ర విజయాన్ని ట్రేడ్ వర్గాలు ధ్రువీకరించడం ఆనందంగా ఉందని తెలి పారు. ఒక మంచి సందేశంతో కూడిన చిత్రాన్ని తాము ఎప్పుడూ ఆదరిస్తామని ప్రేక్షకులు వేలైక్కారన్ చిత్రం ద్వారా మరోసారి నిరూపించారని అన్నారు. సమాజానికి కావలసిన ఒక సందేశంతో కూడిన మంచి కమర్శియల్ చిత్రాన్ని ప్రజల్లోకి చేరినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని దర్శకుడు మోహన్‌రాజా అన్నారు. -
టార్గెట్ @10
ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళలు బరువు పెరగడం సహజమే. నటి స్నేహ కూడా బరువు పెరిగారు. తర్వాత కాస్త బరువు తగ్గారు కూడా. ఇప్పుడు ఇంకా బరువు తగ్గే పనిలో ఉన్నారు. ఏదో ప్రెగ్నన్సీ వల్ల పెరిగిన బరువో? డెలివరీ తర్వాత పెరిగిన బరువునో ఆమె తగ్గించాలనుకోవడంలేదు. అసలు తగ్గాలన్న ఉద్దేశం కూడా స్నేహకు లేదు. అయితే క్యారెక్టర్ డిమాండ్ చేసిందని తగ్గుతున్నారు. మొత్తం పది కిలోలు తగ్గాలన్నది ఆమె టార్గెట్. ఆల్రెడీ ఏడు కిలోలు తగ్గారు స్నేహ. మరో మూడు కిలోలు తగ్గాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే... ఆమెకంటే వయసులో ఏడాది చిన్నోడైన ఫాహద్ ఫాజిల్‌కి జోడీగా కనిపించనున్నారు స్నేహ. ‘ధృవ’ తమిళ మాతృక ‘తని ఒరువన్’ తర్వాత దర్శకుడు మోహన్ రాజా తీస్తున్న సినిమా ‘వేలైక్కారన్’. శివ కార్తికేయన్, ఫాహిద్ ఫాజిల్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, స్నేహ హీరోయిన్లు. ‘‘ఫాహిద్తో ఓ మలయాళ సినిమా చేశా. కానీ, అందులో మా కాంబినేషన్లో ఎక్కువ సీన్లు లేవు. ‘వేలైక్కారన్’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురు చూస్తున్నా’’ అన్నారు స్నేహ. ఈ సినిమాలో వీలైనంత సన్నగా కనిపించాలని ఇంట్లోనే ఉదయం కార్డియో, సాయంత్రం వెయిట్ ట్రైనింగ్ వర్కౌట్స్ చేస్తున్నారామె.